Shashtipoorthi Movie Review: షష్టిపూర్తి సినిమా రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్ చౌదరీ, ఆకాంక్ష సింగ్, అచ్యుత్ కుమార్, ఆనంద చక్రపాణి, చలాకీ చంటీ, మురళీధర్ గౌడ్, సంజయ్ స్వరూప్ తదితరులు
రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పవన్ ప్రభ
నిర్మాత: రూపేష్ చౌదరీ
సంగీతం: ఇళయరాజా
ఆర్ట్: తోట తరణి
సినిమాటోగ్రఫి: రామ్ రెడ్డి
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
బ్యానర్: మా ఆయి ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2025-05-30

నీతి, నిజాయితీతోపాటు ప్రొఫెషనల్ విలువలను పాటించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీరామ్ ( రూపేష్ చౌదరీ) తల్లిదండ్రులకు దూరంగా ఒంటరిగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. నియమ నిబంధనలు స్ట్రిక్ట్‌గా పాటించే రూపేష్‌కు కాలనీలో అందరూ దూరంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఓ క్లిష్టమైన సమస్యలో ఇరుక్కొన్న జానకీ (ఆకాంక్ష సింగ్) శ్రీరామ్‌కు తారసపడి అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. జానకీని తొలిచూపులోనే ప్రేమించడమే కాకుండా పెళ్లి కూడా చేసుకోవాలని అనుకొంటాడు. కానీ అయితే నీతి, నిజాయితీకూ దూరంగా ఉండి.. అబద్దాలు ఆడాలని శ్రీరామ్‌కు జానకీ కండిషన్స్‌ పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే తల్లిదండ్రులు దివాకర్ (రాజేంద్ర ప్రసాద్), భువనేశ్వరి (అర్చన) విడిపోవాలని నిర్ణయించుకొంటారు.

Shashtipoorthi Movie Review

తల్లిదండ్రులకు దూరంగా శ్రీరామ్ ఎందుకు ఒంటరిగా ఉంటాడు? నిజాలు మాట్లాడే శ్రీరామ్‌ను కాలనీవాసులు ఎందుకు దూరం పెడుతారు? పెళ్లి చేసుకొనే సమయంలో శ్రీరామ్‌ను జానకీ ఎందుకు అబద్దాలు ఆడాలని కండిషన్ పెడుతుంది? అబద్దాలు ఆడితే శ్రీరామ్‌కు ఎదురైన పరిస్థితులు ఏమిటి? శ్రీరామ్‌ను తల్లి ఎందుకు ఈసడించుకొంటుంది? భర్త దివాకర్ నుంచి భువనేశ్వరి ఎందుకు విడాకులు తీసుకోవాలనుకొంటుంది? విడిపోవాలని అనుకొన్న తల్లిదండ్రులను శ్రీరామ్ కలిపాడా? వారిద్దరి షష్టిపూర్తి జరిపించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే షష్టిపూర్తి సినిమా కథ.

సమాజంలో ఫ్యామిలీ వాల్యూస్ కనుమరుగవుతున్న సమయంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరుగుతున్న అంశాలను ఆధారంగా చేసుకొని దర్శకుడు పవన్ ప్రభ ఎంచుకొన్న పాయింట్ బాగానే ఉంది. కానీ దానిని పూర్తిస్థాయి కథగా విస్తరించి తెర మీదకు తీసుకు రావడంలో తొలి చిత్ర దర్శకుడిగా తడబాటుకు గురయ్యాడనిపిస్తుంది. ముఖ్యంగా కమర్షియల్ అంశాలను జొప్పించడం వల్ల కోర్ పాయింట్‌ దారి తప్పిందనే భావన కలుగుతుంది. అయితే కొత్తవాడైన రూపేష్, హీరోయివ్‌ అకాంక్ష సింగ్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలను బాగా రాసుకొన్నాడు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీని బాగా పండించేలా జాగ్రత్త పడ్డాడు.

Shashtipoorthi Movie Review

ఇక ఫస్టాఫ్‌లో అసలు కథను దాచి పెట్టి... సినిమాను బాగా సాగదీశాడనే ఫీలింగ్ కలుగుతుంది. తొలి భాగంలో సన్నివేశాల బలంగా, ప్రేక్షకుడిని ఆకట్టుకొనేలా లేకపోవడంతో రెగ్యులర్, రొటీన్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో రెండు రొమాంటిక్ సాంగ్స్ మంచి కిక్ ఇచ్చేలా ఉండటం కొంత ఉపశమనం. సెకండాఫ్ విషయానికి వస్తే.. కథ, ఎమోషన్స్, ట్విస్టులు ఓవర్‌లోడ్ అవ్వడంతో సినిమాలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ను దెబ్బ తీసిందనిపిస్తుంది. సెకండాఫ్‌లోని కథను కొంత ముందుకు జరిపి.. తల్లితో హీరో కాన్‌ఫ్లిక్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్‌గా వేసి.. ఫ్లాష్ బ్యాక్‌ను సెకండాఫ్ ఆరంభంలోనే నడిపించి ఉంటే బెటర్‌గా ఉండేది. అలాగే ఎమోషనల్ కంటెంట్‌తో సుధాకర్ (ఆనంద చక్రపాణి) పాత్రను కథలోకి తెచ్చే సరికి ఆడియెన్స్‌ అప్పటికే చేతులెత్తేసే పరిస్థితి. కాస్త ముందుగా ఈ ఎపిసోడ్‌ తెచ్చి ఉంటే.. సినిమాకు మంచి ప్లస్ అయ్యేది అనిపిస్తుంది.

ఇక నటీనటులు విషయానికి వస్తే.. షష్టిపూర్తి సినిమా భారాన్నంత తొలి చిత్ర నటుడు రూపేష్ మాగ్జిమమ్ తన భుజాలపై మోశాడు. ఫస్ట్ టైమ్ హీరో అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించలేదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌ యువ హీరోలతో పోటీ పడాలంటే.. రూపేష్ నటన పరంగా ఇంకా చాలా అంశాలు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆకాంక్ష సింగ్ అందాల ఆరబోతనే కాకుండా పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. రాజేంద్ర ప్రసాద్, అర్చన ఈ సినిమాకు బిగ్ అసెట్. ఆనంద చక్రపాణి తన మార్కు నటనను ప్రదర్శించాడు. కథను మలుపుతిప్పే పాత్రలో ఆయన గుర్తుండిపోతారు. అచ్యుత్‌, చలాకీ చంటీ, ఇంకా కొందరు నటులను సరిగా ఉపయోగించుకోలేకపోయారేంటి? అనిపిస్తుంది.

షష్టిపూర్తి సినిమాకు అత్యంత బలంగా నిలిచిన అంశాల్లో మ్యూజిక్, ఆర్ట్, సినిమాటోగ్రఫి ముందు వరుసలో ఉంటాయి. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలతో ఈ సినిమాను నెక్ట్స్ రేంజ్ అనిపించేలా ఉన్నాయి. గోదావరి పరిసర తీరాల్లో తోట తరణి ఆర్ట్ వర్క్ బ్రహ్మండంగా ఉంది. గ్రామీణ వాతావరణాన్నీ, నదీ తీరం అందాలను రామ్ రెడ్డి కెమెరాలో అద్బుతంగా బంధించాడు. ఎడిటింగ్ పరంగా కార్తీక్ శ్రీనివాస్ నిరాశపరిచాడు. మా ఆయి ప్రొడక్షన్ బ్యానర్ అందించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ ఓ పెయింటింగ్‌లా, రిచ్‌గా కనిపించాయి.

ప్రస్తుతం మితీమీరిన హింస, హారర్, అడల్డ్ కంటెంట్‌తో వస్తున్న సినిమాల మధ్య క్లీన్ చిత్రం షష్టిపూర్తి. రాజేంద్రప్రసాద్, అర్చన నటన, ఇళయరాజా, తోటతరణి పనితనం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఎడిటింగ్, బలమైన సన్నివేశాలు, ఎమోషన్స్ పూర్తిగా పండకపోవడం మైనస్‌గా అనిపిస్తాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. ఈ వారం ఫ్యామిలీ కంటెంట్ సినిమాలు చూడాలనుకొనే వారికి షష్టిపూర్తి ఓ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X