twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shekhar Movie Review: మెడికల్ మాఫియాపై సమరం.. రాజశేఖర్ ఫెర్ఫార్మెన్స్ అదుర్స్

    |

    Rating: 2.75/5

    నటీనటులు: రాజశేఖర్, ప్రకాష్ రాజ్, శివాని రాజశేఖర్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీవితా రాజశేఖర్
    నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం
    సమర్పణ: వంకాయలపాటి మురళీక్రిష్ణ
    సంగీతం: అనూప్ రూబెన్స్
    ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని
    పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
    డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ
    ఆర్ట్: సంపత్
    రైటర్: లక్ష్మీ భూపాల
    రిలీజ్ డేట్: 2022-05-20

    Recommended Video

    Shekar Movie Release Date Announcement | Filmibeat

    శేఖర్ మూవీ కథ..

    శేఖర్ మూవీ కథ..

    పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో శేఖర్ (రాజశేఖర్) నిబద్దత, నిజాయితీ గల అఫీసర్. తన మరదలు కిన్నెర (ముస్కాన్) ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు కానీ ఓ కారణంగా పెళ్లి చేసుకోలేకపోతాడు. భార్య ఇందు (ఆత్మీయ రాజన్), కూతురు గీత (శివానీ రాజశేఖర్)తో జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో కిన్నెర దారుణ హత్యకు గురవుతుంది. దాంతో మద్యానికి బానిస అవుతాడు. ఆ కారణంగా భార్య ఆత్మీయకు దూరమవుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో భార్య, కూతురు అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు. జీవితంలో చోటు చేసుకొన్న విషాదాలతో ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు.

    శేఖర్ మూవీలో ట్విస్టులు

    శేఖర్ మూవీలో ట్విస్టులు


    ఉద్యోగానికి రాజీనామా చేసిన శేఖర్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌తో ఎందుకు కలిసి పనిచేస్తాడు? కిన్నెర హత్యకు కారణం ఎవరు? సొంత కూతురు, భార్య ఎలా చనిపోయింది? తన కుటుంబ మరణాల వెనుక కారణం ఏమిటి? తన భార్య, కూతురు మరణాలపై తలెత్తిన అనుమానాలపై శేఖర్ ఎలాంటి దర్యాప్తు చేశాడు? ప్రభుత్వాలు అమలు చేస్తున్న జీవన్ ధాన్ స్కీమ్‌లోని అవకతవకలకు ఎలా పరిష్కారం చూపాడు అనే భావోద్వేగమైన ప్రశ్నలకు సమాధానమే శేఖర్ మూవీ సినిమా కథ.

     ఫస్టాఫ్ ఎనాలిసిస్

    ఫస్టాఫ్ ఎనాలిసిస్


    శేఖర్ సినిమా ఓ మర్డర్ మిస్టరీతో ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఆరంభంలో కథలోకి వెళ్లడానికి టైమ్ తీసుకొన్నప్పటికీ.. ఫ్యాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌తో సినిమా ఎమోషనల్‌గా మారుతుంది. కూతురు గీత (శివానీ)తో సన్నివేశాలు భావోద్వేగంగా ఉంటాయి. తండ్రి, కూతుళ్ల మధ్య కెమిస్ట్రీ అద్బుతంగా పండింది. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది. తొలి భాగంలో రాజశేఖర్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, ఫీల్‌గుడ్ ఫెర్ఫార్మెన్స్‌ ఫస్టాఫ్‌కు ఆకర్షణగా మారాయి.

    సెకండాఫ్‌లో జీవిత డీల్ చేసిన తీరు

    సెకండాఫ్‌లో జీవిత డీల్ చేసిన తీరు


    ఇక సెకండాఫ్‌ ఆరంభంలో కాస్త నెమ్మదించినప్పటికి.. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథలో వేగం కనిపిస్తుంది. కథను తెర మీద చెప్పిన విధానం, సన్నివేశాలను నడిపించిన విధానం జీవిత దర్శకత్వ ప్రతిభను చాటాయి. చివరి 30 నిమిషాలు కథలో ట్విస్టులు, హృదయాన్ని పిండేసే క్లైమాక్స్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తాయి. ఫ్యామిలీ, ఎమోషన్స్, ఫీల్‌గుడ్ అంశాలను దర్శకురాలిగా జీవిత చక్కగా హ్యాండిల్ చేసిందని చెప్పవచ్చు.

    శేఖర్‌లో సరికొత్త రాజశేఖర్‌

    శేఖర్‌లో సరికొత్త రాజశేఖర్‌


    యాంగ్రీ మ్యాన్‌గా రాజశేఖర్ ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు తెలుసు. శేఖర్ సినిమా చూసిన తర్వాత రాజశేఖర్ ఒక పరిపూర్ణమైన నటుడిగా కనిపిస్తారు. ఫేస్ ద్వారా రాజశేఖర్ పలికించిన హావభావాలు కొత్తగా ఉంటాయి. ఆరోగ్య పరిస్థితుల కారణంగా కాస్త బాడీలో చురుకుదనం లోపించినట్టు కనిపించినా.. పాత్రకు తగినట్టుగా అనిపిస్తాయి. చివరి 30 నిమిషాల్లో రాజశేఖర్ నటన మరో లెవెల్ అని చెప్పవచ్చు.

    శివానీ, ఇతరు నటీనటుల పెర్ఫార్మెన్స్

    శివానీ, ఇతరు నటీనటుల పెర్ఫార్మెన్స్


    శేఖర్ సినిమాలో మిగితా పాత్రల విషయానికి వస్తే.. శివానీ ఈ సినిమాకు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్. కథను ఎమోషనల్‌గా మార్చడంతోపాటు ఫ్యామిలీ మూవీగా మార్చిందని చెప్పివచ్చు. శివానీ పాత్ర కాస్త పెంచితే మరింత భావోద్వేగంగా సినిమా మారి ఉండేది. ఇక ముస్కాన్, ఆత్మీయ పాత్రలు కథకు సపోర్‌గా కనిపిస్తాయి. వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం వల్ల ఇద్దరు హీరోయిన్ల టాలెంట్ పెద్దగా కనిపించలేదు. సమీర్, అభినవ్ గోమటం, ఇతర నటీనటులు కథతోపాటు ట్రావెల్ అయ్యారు. చివర్లలో ప్రకాశ్ రాజ్ పాత్ర కొసమెరుపు మాత్రమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లోపాల కారణంగా మెడికల్ మాఫియా విజృంభిస్తున్న తీరును చక్కగా చెప్పగలిగారు.

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?


    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. శేఖర్ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పలు సీన్లు బీజీఎం కారణంగా బాగా ఎలివేట్ అయ్యాయి. సత్యం శివం సుందరం పాట సినిమాకు బలంగా మారింది. అరుకు అందాలను సినిమాటోగ్రాఫర్ చక్కగా చూపించాడు. ముఖ్యంగా రాజశేఖర్‌ను చూపించి విధానం బాగుంది. ఎడిటింగ్ విషయంలో కాస్త అసంతృప్తి ఉంటుంది. కొన్ని చోట్ల ల్యాగ్ కనిపిస్తుంది.

    ఫైనల్ జడ్జిమెంట్

    ఫైనల్ జడ్జిమెంట్


    మెడికల్ మాఫియా, అవయవాల దానంలో లోపాలపై ధ్వజమెత్తిన చిత్రం శేఖర్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవన్ ధాన్ స్కీమ్ వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి. అమాయకులు ఎలా బలి అవుతున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవయవాల దానాన్ని వాడుకొని ఎలాంటి కుంభకోణాలకు పాల్పడుతుందనే వివాదాలకు చక్కటి పరిష్కారం, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా సినిమాను రూపొందించారు. ఎమోషనల్, ఫ్యామిలీ అంశాలు, రాజశేఖర్ విభిన్నమైన నటనత ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఈ సినిమాను థియేటర్‌లో చూడటం వల్ల గొప్ప భావోద్వేగం కలుగుతుంది. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడాలనుకొనే వారికి శేఖర్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.

    English summary
    Angry Man and Hero Rajashekar's Shekar movie released in theatres on May 20th. In this occassion, Filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X