twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shikaaru Movie Review జబర్దస్త్ తరహా కామెడీతో.. షికారు ఎలా సాగిందంటే?

    |

    Rating:
    2.5/5

    నటీనటులు: కన్నడ కిషోర్, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కేవీ ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర, పోసాని, అన్నపూర్ణ, సురేఖవాణి, సమ్మెట గాంధీ తదితరులు
    దర్శకత్వం: హరి కొలగాని
    నిర్మాత: పీఎస్ఆర్ కుమార్
    సంగీతం: శేఖర్ చంద్ర
    సినిమాటోగ్రఫి: శ్యాంప్రసాద్
    రిలీజ్ డేట్: 2022-07-01

    కామాపురంలో పోలీస్ అధికారిగా పనిచేసే నరసింహ (కన్నడ కిషోర్)కు దీపిక (సాయి ధన్సిక)తో పెళ్లి జరుగుతుంది. కానీ భార్యకు శారీరక సుఖం అందించలేని నరసింహ భార్యను మానసికంగా వేధిస్తుంటాడు. అయితే భర్తకు తెలియకుండా బాబీ (అభినవ్) ఆకర్షణకు గురి అవుతుంది. భర్త నైట్ డ్యూటీకి వెళ్లిన బాబీని ఇంటికి పిలుస్తుంది. అయితే శారీరకంగా ఒక్కటయ్యే సమయంలో నరసింహ అనుకోకుండా వెనక్కి రావడంతో ఇంటిలో బాబీ చిక్కుకుపోతాడు.

    బాబీ ఇంట్లో ఉండగా భర్త రావడంతో దీపిక ఏం చేసింది? బాబీని ఇంట్లో దాచి పెట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకొన్నాయి? బాబీ ఇంటి నుంచి ఎలా బయటపడ్డాడు? ఇంట్లో దాక్కున్న బాబీని నరసింహ గమనించాడా? భార్య చేసిన పనికి నరసింహ ఎలా రియాక్ట్ అయ్యాడు? బాబీతో రిలేషన్ గురించి దీపిక చెబితే.. నరసింహ ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే షికారు సినిమా కథ.

    షికారు సినిమా మెయిన్ పాయింట్ మంచి హ్యుమర్, ఫన్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు స్కోప్ ఉన్న కథ. అయితే దర్శకుడు అడల్ట్ మూవీ తీయాలా? ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మలచాలా అనే సందిగ్దంలో కొట్టుమిట్టాడినట్టు కనిపిస్తుంది. బాబీతో కూడిన మెయిన్ ప్లాట్‌ను వదిలేసి.. మరో పాయింట్‌తో నసపెట్టి సినిమాను సాగదీశాడనే ఫీలింగ్ కలుగుతుంది. బాబీ, దీపిక, నరసింహ కథను పక్కన పెట్టి వినోదం కోసం ముగ్గురు స్నేహితులు (తేజ్, ధీరజ్, నవకాంత్) ట్రాక్‌ను అతిగా నడిపాడా సందేహం కలుగుతుంది. నాసిరకమైన కామెడీ సినిమాలోని ఎమోషన్స్‌ను ఎలివేట్ చేయలేకపోయింది.

    Shikaaru Movie Review and Rating

    ఇక నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కిషోర్, సాయి ధన్సిక పాత్రల మధ్య ఉండే సంఘర్షణ, ఎమోషన్స్ సరిగా పండలేదనే చెప్పవచ్చు. అయితే ఈ ఇద్దరు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు. కిషోర్ సీరియస్ రోల్‌లో ఆకట్టుకొన్నాడు. ఎప్పుడు టెన్షన్ పడి భర్త ప్రేమ కోసం తపించే పాత్రలో సాయి ధన్సిక మెప్పించింది. తేజ్, ధీరజ్, నవకాంత్ కామెడీ అప్పుడప్పుడు పేలింది. జై బాలయ్య ఎపిసోడ్ సినిమాకు ప్లస్ పాయింట్. బాలయ్య గొప్పతనం గురించి చెప్పే లెంగ్తీ డైలాగ్ మంచి ఫన్ క్రియేట్ చేసింది.

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంటెంట్‌కు తగినట్టుగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా ఆకట్టుకొన్నది. శ్యాంప్రసాద్ సినిమాటోగ్రఫి బాగుంది. చాలా సీన్లలో క్వాలిటీ, రిచ్‌నెస్ కనిపించింది. కంటెంట్ పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల ఫీల్, ఎమోషన్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. పీఎస్ కుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

    Shikaaru Movie Review and Rating

    కాలేజ్ నేపథ్యంలో ఫన్, డ్రామా, వైవాహిక జీవితంలో సమస్యలు, విలేజ్ పాలిటిక్స్ లాంటి అంశాలతో తెరకెక్కించిన చిత్రంగా షికారు కనిపిస్తుంది. స్క్రిప్ట్ పరంగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, అనవసరపు సీన్లు ఎక్కువ కావడంతో కథలో ఉండే ఎమోషన్స్ కిల్ అయ్యాయి. అసలు కథ గాలికి వదిలేసి.. కొసరు కథపై ఎక్కువ కాన్సెంట్రేట్ చేయడం సినిమా ఫీల్‌ను దెబ్బ తీసింది. అడల్డ్ కంటెంట్ ఆధారంగా వచ్చే సినిమాలను ఆదరించే వారకిి ఈస ినిమానచ్చడానికి అవకాశం ఉంది.

    English summary
    Shikaaru movie is adult content based fun and humar movie. Jabardasth fame Hari Kolagani is the director. Husharu fame tej, Abhinav, Kannada Kishore, Sai Dhansika are lead.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X