twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Hungama 2 movie review.. శిల్పా శెట్టి రీ ఎంట్రీ, ప్రణీత సుభాష్ బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉందంటే..

    |

    Rating:
    2.0/5
    Star Cast: శిల్పాశెట్టి, అక్షయ్ ఖన్నా, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్, పరేశ్ రావెల్
    Director: ప్రియదర్శన్

    ఫ్యామిలీ ఎమోషన్స్‌కు హాస్యాన్ని మెప్పించే దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం హంగామా 2. ఈ చిత్రం 1994లో ప్రియదర్శన్ దర్శకత్వంలో మిన్నారం ఆధారంగా రూపొందింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత దర్శకుడు ప్రియదర్శన్, హీరోయిన్ శిల్పాశెట్టి బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వడం ఈ సినిమాకు ప్రత్యేకత. థియేటర్ల మూసివేత కొనసాగుతున్నందున్న హంగామా 2 డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీలో రిలీజైంది. ఇలాంటి ప్రత్యేకతలతో వచ్చిన ప్రేక్షకుల మదిలో హంగామా సృష్టించిందా ఈ సినిమాను సమీక్షించాల్సిందే..

    హంగామా 2 కథ ఏమిటంటే..

    హంగామా 2 కథ ఏమిటంటే..

    కపూర్ (అశుతోష్ రాణా) కుమారుడు ఆకాశ్ కపూర్ (మీహాన్ జాఫ్రీ) జీవితం సాఫీగా సాగుతూ పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన సమయంలో వాణీ కపూర్ (ప్రణీత సుభాష్) అలజడి రేపుతుంది. తన బిడ్డకు ఆకాశ్ కారణం అంటూ ఇంట్లో సెటిల్ అయిపోతుంది. కుమారుడు చేసిన నిర్వాకంతో తన కాబోయే వియ్యంకుడు బజాజ్ (మనోజ్ జోషి)కి కపూర్ ఏం చెప్పాలి? ఏం చేయాలో తెలియక ఆందోళనకు లోనవుతుంటాడు.

     మూవీలో ట్విస్టులు ఇలా

    మూవీలో ట్విస్టులు ఇలా

    వాణి కపూర్ బిడ్డకు నిజంగానే ఆకాశ్ తండ్రినా? వాణి కపూర్‌, ఆకాశ్‌కు మధ్య సంబంధం ఏమిటి? అంజలి, ఆకాశ్ ప్రేమకు, అఫైర్‌కు ఎందుకు బ్రేక్ పడింది? ఈ కథలో అంజలి (శిల్పాశెట్టి), జితేందర్ (ఆక్షయ్ ఖన్నా) పాత్రలు ఏమిటి? శిల్పాశెట్టి భర్త ఎవరు? ఆకాశ్ కోసం అంజలి ఎలాంటి నిందల్ని మోయాల్సి వచ్చింది? చివరకు ఆకాశ్, అంజలి రిలేషన్‌కు ఎలాంటి ముగింపు లభించింది. అంజలి బిడ్డకు ఎలాంటి న్యాయం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే హంగామా 2.

    ఓవరాల్ ఎనాలిసిస్

    ఓవరాల్ ఎనాలిసిస్

    హంగామా సినిమా కథ కపూర్ ఇంటిలో ఎలాంటి హంగామా లేకుండా చాలా సాధారణంగా మొదలవుతుంది. వాణి ఎప్పుడైతే ఆకాశ్ ఎంట్రీ ఇస్తుందో కథలో కొంచెం కదలిక వస్తుంది. కానీ కథానాల్లో ఎలాంటి వేగం లేకపోవడం సినిమా సాగదీసినట్టు ఉండటంతో క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందోననే విషయాన్ని తెలుసుకోవడానికి వేచి చూడాల్సి రావడం సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. కాకపోతే చివరి 15 నిమిషాల్లో ప్రియదర్శన్ మాదిరి కామెడీ ఉండటంతో అప్పటి వరకు ఏర్పడిన నిరుత్సాహానికి కొంత ఉపశమనం కలిగినట్టు అవుతుంది. అయితే కథలో ఎమోషన్స్ పండకపోవడం, సరైన లావ్ ట్రాక్ లేకపోవడం ప్రధానంగా కామెడీ ఆకట్టుకోకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. ప్రియదర్శన్ మాదిరి హిలేరియస్ కామెడీని ఆశించిన వారికి నిరుత్సాహమే కలుగుతుంది.

    ప్రియదర్శన్ మార్కుకు దూరంగా

    ప్రియదర్శన్ మార్కుకు దూరంగా

    14 ఏళ్ల తర్వాత దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే.. సహజంగానే ఆసక్తిగా ఎదురు చూడటం జరుగుతుంది. అలాంటి ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. బలమైన కథ లేకపోవడం, కథనం నీరసంగా సాగడంతో ప్రియదర్శన్ మార్క్ ఎక్కడా కనిపించదు. ఈ సినిమాలో బలమైన పాత్రలను రాసుకోకపోవడం మరో మైనస్ పాయింట్‌గా మారింది. ఓవరాల్‌గా పేలవమైన స్క్రిప్ట్‌తో ప్రియదర్శన్ నిరాశపరిచారనే చెప్పాలి.

    ప్రణీత సుభాష్, మీజాన్ జాఫ్రీ ఫెర్ఫార్మెన్స్

    ప్రణీత సుభాష్, మీజాన్ జాఫ్రీ ఫెర్ఫార్మెన్స్

    ఇక దక్షిణాది సినీ పరిశ్రమలో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్న ప్రణీత సుభాష్ ఫుల్‌ లెంగ్త్ పాత్రతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తన పాత్రకు సరిపోయిన హావభావాలు, కొంతలో కొంత రొమాంటిక్‌ను పండించింది. ఇక ప్రముఖ నటుడు జావేద్ జాఫ్రీ కుమారుడైన మీజాన్ జాఫ్రీ ఆకాశ్ పాత్రలో ఆకట్టుకొనేందుకు ప్రయత్నించారు. ప్రణీత, మీజాన్ మధ్య సింపుల్ రొమాన్స్ ఎట్రాక్టివ్‌గా ఉంటుంది.

    శిల్పా శెట్టి రీ ఎంట్రీ ఎలా ఉందంటే

    శిల్పా శెట్టి రీ ఎంట్రీ ఎలా ఉందంటే

    ఇక 14 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శిల్పాశెట్టి తన ఇమేజ్‌కు దూరంగా ఉన్న పాత్రలో కనిపించింది. వయసు మళ్లిన భర్త (పరేశ్ రావెల్‌)కు భార్య‌గా శిల్పాశెట్టి నటించడం జీర్ణించుకోలేని విషయం. అయితే శిల్పాశెట్టి పాత్ర చాలా కృత్రిమంగా.. కేవలం క్లైమాక్స్ కోసం రాసుకొన్నారా అనే అనుమానం కలుగుతుంది. శిల్పాశెట్టి తన పాత్రతో మెప్పించలేకపోయింది. అక్షయ్ కుమార్ పాత్ర స్పెషల్‌గా ఉన్నప్పటికీ.. పరిమితులతో కూడిన అతిథిగానే కనిపిస్తాడు. జానీ లివర్ నవ్వించలేకపోయాడు. రాజ్‌పాల్ యాదవ్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య తనదైన హాస్యాన్ని పండించాడు. పరేశ్ రావెల్ అనుమానం మొగుడిగా మెప్పించలేకపోయాడు. నాసిరకమైన హాస్యంతో కూడిన పాత్రలో ఆయన ఆకట్టుకోలేకపోయాడు. మిగితా పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

    సాంకేతిక విభాగాల పనితీరు...

    సాంకేతిక విభాగాల పనితీరు...

    ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాను ఓ పెయింటింగ్‌లో తెరపైన సినిమాటోగ్రాఫర్ ఎన్‌కే ఏకాంబరం తీర్చిదిద్దారు. అందమైన లొకేషన్లను అద్భుతంగా ఉపయోగించుకొన్నాడు. ప్రతీ సీన్‌ను ఆహ్లాదకరంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. ఇక మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చురాకే దిల్ మేరా (తు అనాడీ మై ఖిలాడీ) పాటను రీమిక్స్ చేసి ఖూనీ చేశారు. తూ నహీతో మై నహీ.. మై నహీతో తుమ్ నహీ పాట బాగుంది. రీరికార్డింగ్ కథ, కథనాలకు తగినట్టే ఉంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెడితే సినిమా కొంత ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

    తుది తీర్పు...

    తుది తీర్పు...

    ఎమోషనల్ లవ్ స్టోరి, ఫ్యామిలీ డ్రామాకు భారీ స్కోప్ ఉన్న చిత్రంగా మారడానికి అన్ని అంశాలు ఉన్నప్పటికీ.. సరైన విధానంలో తెరకెక్కించలేని చిత్రంగా హంగామా 2 కనిపిస్తుంది. కామెడీ, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లు పండకపోవడం ఈ సినిమాకు మరో లోపంగా మారింది. స్లో నరేషన్, ఆకట్టుకొనే డైలాగ్స్ లేకపోవడం ఈ సినిమాకు ప్రతికూలంగా మారింది. ప్రణీత, శిల్పాశెట్టి, అక్షయ్ కుమార్ లాంటి భారీ తారాగణం కోసం సినిమాను చూసి సంతృప్తి పడాల్సిందే. అశ్లీలత, అసభ్యతకు చోటులేని ఈ సినిమాను వారాంతంలో ఫ్యామిలీతో సరదా కోసం, టైంపాస్ కోసం చూడటానికి అవకాశం ఉన్న సినిమా అని చెప్పవచ్చు. శిల్పాశెట్టి రీ ఎంట్రీ, ప్రణిత సుభాష్ బాలీవుడ్ ఎంట్రీ వర్కవుట్ కాలేదనే చెప్పవచ్చు. చివరగా ఎలాంటి హంగామా లేని సాదాసీదా చిత్రం హంగామా 2.

    Recommended Video

    Shilpa Shetty skips her shooting as raj kundra got arrested | Oneindia Telugu
    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: శిల్పాశెట్టి, అక్షయ్ ఖన్నా, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్, పరేశ్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, అశుతోష్ రాణా, జానీ లీవర్ తదితరులు
    కథ, దర్శకత్వం: ప్రియదర్శన్
    నిర్మాత: రతన్ జైన్, గణేష్ జైన్, చేతన్ జైన్
    డైలాగ్స్: అనుకల్ప్ గోస్వామి, మనీషా కోర్డే
    స్క్రీన్ ప్లే: యూనస్ సజవాల్
    సినిమాటోగ్రఫి: ఎన్‌కే ఏకాంబరం
    ఎఢిటింగ్: ఎంఎస్ అయ్యప్పన్ నాయర్
    మ్యూజిక్: అను మాలిక్
    బ్యానర్: వీనస్ వరల్డ్‌వైడ్ ఎంటర్‌టైన్‌మెంట్
    ఓటీటీ రిలీజ్: డీస్నీ + హాట్‌స్టార్
    ఓటీటీ రిలీజ్ డేట్: 2021-07-23

    English summary
    Shilpa Shetty's Hungama 2 movie review and Rating: Slow narated family drama
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X