twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీహరికి క్లాస్‌ చిత్రం

    By Staff
    |

    Shivaji
    -సౌమిత్‌
    చిత్రం: శివాజీ
    నటీనటులు: శ్రీహరి, ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, రాశి
    దర్శకత్వం: సాయి బాలాజీ

    శ్రీహరి చిత్రం అనగానే పక్కా మాస్‌ చిత్రం అనే బ్రాండ్‌ పడిపోయింది. ఆ బ్రాండ్‌ నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నమే- శివాజీ చిత్రం. అందుకే పోస్టర్లలోనూ శివాజీ- మాస్‌ హీరో విత్‌ క్లాస్‌ టచ్‌ అని ప్రచారం చేస్తున్నారు. ఈ తరహా చిత్రాలు గతంలో ఎన్నో వచ్చినప్పటికీ కథనంలో కొంత వైవిధ్యం ఉంది. మనిషికి శారీరక ధారుఢ్యమే కాదు, మానసిక ధారుడ్యం ఉండాలన్న సందేశంతో తీసిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకులను, శ్రీహరి అభిమానులను ఆకట్టుకుంటుందా అనేది సందేహమే.

    శ్రీహరి(శివాజీ) డ్రిల్‌ మాస్టర్‌. అతని వ్యక్తిత్వం నచ్చి పెళ్ళిచేసుకోవాలనుకుంటుంది రాశి. దానికి శివాజీ తల్లి, చెల్లెలు అంగీకరించినా, రాశి తండ్రి(జీవా) ఒప్పుకోడు. ఒకసారి నడిరోడ్డుపై మూత్రం పోస్తున్న జీవాను శివాజీ దండిస్తాడు. ఆ కోపంతో వీరి పెళ్ళికి ససేమిరా అంటాడు. దాంతో రాశి, శివాజీ మంచి స్నేహితులుగా ఉండిపోవాలని నిర్ణయించుకుంటారు. రాశి వివాహం ప్రకాష్‌ రాజ్‌ తో జరుగుతుంది. శివాజీకి హైదరాబాద్‌ బదిలీ అవుతుంది.

    అనాథైన ప్రకాష్‌ రాజ్‌ ను శివాజీ తల్లి చేరదీసి పెద్దకొడుకులా చూసుకుంటుంది. శివాజీ కుటుంబాన్ని ప్రకాష్‌ రాజ్‌ విందుకు ఆహ్వానిస్తాడు. అప్పుడు శివాజీ, రాశిల ప్రేమ విషయం అతనికి తెలుస్తుంది. దాంతో వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తుంటాడు. శివాజీ చెల్లెలు మాధవిశ్రీకి వచ్చిన సంబంధాన్నల్లా చెడగొట్టడమే పనిగా పెట్టుకుంటాడు. ఈ విషయం తెల్సుకున్న శివాజీ ప్రకాష్‌ రాజ్‌ ఇంట్లోకి మకాం మార్చుతాడు. లాండ్రీ పనివారితోనూ, రాశితోనూ కల్సి నాటకం ఆడి ప్రకాష్‌ రాజ్‌ పరివర్తనలో మార్పు తీసుకువస్తాడు.

    అదీ కథ. అనుమానపు మొగుడుగా ప్రకాష్‌ రాజ్‌ నటన చాలా బాగుంది. పాత్రలో జీవించాడు. శ్రీహరి ఎప్పటిలాగే ఫైట్‌ లతో మాస్‌ ప్రేక్షకులను అలరించే విధంగా నటించాడు. అయితే ఈ చిత్రంలో డ్యూయెట్లలో కూడా నటించాడు. రాశి గృహిణిగా చీర కట్టులో బావున్నా, టైట్‌ దుస్తుల్లో ప్రేక్షకులను బెదరగొట్టే విధంగా ఉంది. పోసాని కృష్ణమురళి సంభాషణల్లో పదను ఉంది. దర్శకుడు సాయిబాలాజీకి ఇది తొలి చిత్రమైనా ఫర్వాలేదనిపించాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X