twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శివ లింగ రివ్యూ

    రాఘవలారెన్స్, రితిక సింగ్ ప్రధాన పాత్రల్లో చంద్రముఖి దర్శకుడు పి.వాసు తెరకెక్కించిన హారర్-కామెడీ చిత్రం ‘శివలింగ’.

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5
    Star Cast: లారెన్స్ రాఘవ, భానుప్రియ, రితికా సింగ్
    Director: పీ వాసు

    డాన్స్, కామెడీ, హారర్, యాక్షన్ అదరగొడుతూ 'కాంచన' లాంటి సూపర్ హిట్ సినిమాలో తెలుగులో తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్న లారెన్స్, 'చంద్రముఖి' లాంటి సెన్సేషన్ హారర్ సస్పెన్స్ అందించిన దర్శకుడు పి. వాసు...... ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా, అది కూడా హారర్ కామెడీ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కడో ఉంటాయి. అలా భారీ అంచాలతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'శివలింగ'.

    ఈ మధ్య కాలంలో సౌత్ లో హారర్ - కామెడీ జేనర్ చిత్రాల హవా బాగా పెరిగింది. మొదట్లో ఈ సినిమాలకు ఆదరణ బాగానే లభించినా....రాను రాను అన్నింటిలోనూ రోటీన్ కాన్సెప్టు, అదే ఫార్ములా ఉంటుండటంతో చాలా చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించడం లేదు.

    మరి తాజాగా వచ్చిన 'శివలింగ' ..... అదే రొటీన్ ఫార్ములాను ఫాలో అయిందా? లేక ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించే కాన్సెప్టు ఏమైనా జోడించారా? అనేది చూద్దాం.....

    కథ రహీమ్ హత్య చుట్టూ

    కథ రహీమ్ హత్య చుట్టూ

    రహీమ్ అనే ఓ వంటవాడు ట్రైన్ లో హత్యకు గురవుతాడు. అయితే చూడటానికి అతడి మరణం ట్రైన్ నుండి దూకి ఆత్మహత్యకు గురైనట్లు ఉంటుంది. అతడు హత్యకు గురైనట్లు ఆధారాలు లేక పోవడంతో ఆత్మహత్యగానే కేసు క్లోజ్ చేస్తారు. అయితే రహీమ్ ప్రియురాలు.... రహీమ్ ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదు అంటూ.... పెద్ద పోలీస్ ఆఫీసర్ ను కలిసి కేసు రీ ఓపెన్ చేయిస్తుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సమర్థుడైన సీబి సీఐడి ఆఫీసర్ శివలింగ(రాఘవ లారెన్స్)కు అప్పజెబుతారు.

    భార్యను కాపాడుకోవడం కోసం హీరో ఏం చేసాడు?

    భార్యను కాపాడుకోవడం కోసం హీరో ఏం చేసాడు?

    రహీమ్ హత్య కేసు తన చేతికి రావడం, అదే సమయంలో శివలింగకు సత్యభామ(రితికా సింగ్)తో పెళ్లి దాదాపు ఒకేసారి జరుగుతుంది. తనను ఎవరు? ఎందుకు చంపారో? తెలుసుకోవడానికి రహీమ్ ఆత్మ పరితపిస్తుంది. శివలింగ భార్య సత్య శరీరంలోకి ప్రవేశించి త్వరగా కేసు సాల్వ్ చేయాలని, అప్పటి వరకు నీ భార్య శరీరంలోనే ఉంటానని బ్లాక్ మెయిల్ చేస్తుంది రహీమ్ ఆత్మ. తన భార్యను కాపాడుకోవడానికి శివలింగ ఏం చేసాడు? ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసును ఎలా సాల్వ్ చేసాడు? అనేది తర్వాతి కథ.

    పెర్ఫార్మెన్స్ పరంగా...

    పెర్ఫార్మెన్స్ పరంగా...

    సీబీ సిఐడి ఆఫీసర్ పాత్రలో రాఘవ లారెన్స్ అదరగొట్టాడు. పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా, యాక్షన్ పరంగా ఎక్కడా వంకపెట్టడానికి లేదు. గురు సినిమాలో బాక్సర్ గా కనిపించి రితిక సింగ్
    ఈ సినిమాలో భిననమై పాత్రలో కనిపించింది. అయితే హారర్ సన్నివేశాల్లో రితిక సింగ్ అంతగా ఆకట్టుకోలేదు. ఆయా సీన్లలో రితిక హావభావాలు పర్ఫెక్టుగా లేవు. రహీమ్ ఆత్మ పాత్రలో శక్తి బాగా నటించాడు. శివ లింగ తల్లి పాత్రలో ఊర్వశి, కామెడీ దొంగ పాత్రలో వడివేలు, రాధారవి, భానుప్రియ, జయప్రకాష్, ప్రదీప్ రావత్ తదితరులు ఓకే.

    సినిమా ఎలా ఉందంటే....

    సినిమా ఎలా ఉందంటే....

    కాంచన, చంద్రముఖి హీరో- డైరెక్టర్ కాంబినేషన్ కావడంతో అంతకు మించి ఊహించుకుని ప్రేక్షకులు థియేటర్ కు వెళతాడు. రోటీన్ హారర్-కామెడీకు భిన్నంగా ఇంకా ఏదైనా కొత్తగా ఆశిస్తాడు. అయితే ‘శివలింగ'లో అలాంటిదేమీ కనిపించదు. ఇంతకు ముందే వచ్చిన ఏదో పాత హారర్ కామెడీ సినిమా చూసిన ఫీలింగే కలుగుతుంది. కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా సినిమా సాగుతుంది.

    హీరో ఇంట్రడక్షన్

    హీరో ఇంట్రడక్షన్

    లారెన్స్ ఇంట్రడక్షన్ బావుంది. యాక్షన్ సీన్ తోపాటు.... చిన్న కబాలి అంటూ సాగే పాటతో లారెన్స్ ఎంట్రీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

    కామెడీ వర్కౌట్ కాలేదు

    కామెడీ వర్కౌట్ కాలేదు

    సినిమాలో కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కేవలం కామెడీ కోసమే ఊర్వశి, వడివేలు మీద ప్రత్యేకంగా సీన్లు చేసారు. హారర్ సీన్లకు కామెడీ మిక్స్ చేసినపుడే ప్రేక్షకుడు థ్రిల్ అవుతారు. కానీ సినిమాకు అది మైనస్సు అయింది.

    సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నంలో....

    సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నంలో....

    హారర్, కామెడీ, యాక్షన్.... ఇలా సీన్లు అల్లుకుంటూ దర్శకుడు సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తూ.... పాత కాన్సెప్టునే ఫాలో అయ్యాడు. ఎంతసేపూ పాత కాన్సెప్టు తరహాలోనే ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడంపైనే దృష్టి పెట్టారే తప్ప కథ, కథనం విషయంలో సరైన జాగ్రత్త తీసుకోలేదు. పి. వాసు దర్శకత్వ లోపం అని చెప్పలేం కానీ కథ, కథనం, రొటీన్ కాన్సెప్టును ఆయన ఎంచుకోవడమే మైనస్.

    టెక్నికల్ పాయింట్స్

    టెక్నికల్ పాయింట్స్

    తమన్ అందించిన సంగీతం యావరేజ్ గా ఉన్నా.... బ్యాగ్కౌండ్ స్కోర్ బావుంది. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువులు బావున్నాయి. సురేష్ ఎడిటింగ్ యావరేజ్ గా ఉంది. హారర్ సీన్లలో గ్రాఫిక్స్ ఓకే.

    బలాలు, బలహీనతలు

    బలాలు, బలహీనతలు

    +లారెన్స్ పెర్ఫార్మెన్స్
    +బ్యాగ్రౌండ్ స్కోర్
    +క్లైమాక్స్

    -రితిక సింగ్
    -రొటీన్ కథ, కథనం

    ఫైనల్‌ వర్డ్

    ఫైనల్‌ వర్డ్

    శివలింగ సినిమా చిత్రం కొత్త సీసాలో పాత సారా లాంటిది. రొటీన్, కథా, కథనాలతో విసుగు పుడుతుంది. బలమైన స్క్రీన్ ప్లే లేకపోవడం ప్రధాన లోపం.

    English summary
    Shivalinga is Tamil action horror comedy film directed by P. Vasu, starring Raghava Lawrence vanilla and Ritika Singh in the leading roles. Check out Telugu filmibeat review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X