Shivam Bhaje Review: శివం భజే మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: అశ్విన్ బాబు, అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు
దర్శకత్వం: అప్సర్
నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
మ్యూజిక్ డైరెక్టర్: వికాస్ బడిస
సినిమాటోగ్రఫి: దాశరథి శివేంద్ర
ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ
రిలీజ్ డేట్: 2024-08-01

చందు (అశ్విన్ బాబు) బ్యాంక్ లోన్స్ రికవరీ ఏజెంట్. తండ్రి బాల్యంలోనే మరణించడంతో తల్లి (తులసి) చాటున పెరిగిన అతడికి చిన్నతనం నుంచే శివ భగవానుడంటే కోపం. శైలజా (దిగంగన సూర్యవంశీ) అనే ఫార్మాసిస్టుతో ప్రేమలో పడి లైఫ్‌ను జాలీగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో లోన్ రికవరీ చేసే క్రమంలో ఓ ముఠాతో గొడవ కారణంగా జరిగిన ఫైట్‌లో చందు చూపు కోల్పోతాడు.

Shivam Bhaje Movie Review in Telugu  Ashwin Babu  Arbaaz Khan Suspense Thriller

బాల్యంలో తండ్రి ఎలా చనిపోయాడు? చిన్నతనం నుంచే ఎందుకు శివుడిపై అయిష్టతను పెంచుకొన్నాడు? రౌడీలతో జరిగిన కొట్లాటలో చూపు ఎలా కోల్పోయాడు? చూపు కోల్పోయిన తర్వాత కంటి సర్జరీ తర్వాత అతడి జీవితాన్ని గందరగోళంలో పడేసి మలుపు తిప్పిన సంఘటన ఏమిటి? తెలంగాణ పోలీస్ విభాగంలో డోగ్రా అనే శునకానికి చందు లైఫ్‌కు ముడిపెట్టిన విషయం ఏమిటి? భారత్‌ దురక్రమణకు చైనా, పాకిస్థాన్‌ చేసిన కుట్ర ఏమిటి? దేశ భద్రతకు భంగం కలిగించే విషయంలో ఏసీపీ మురళీ (అర్బాజ్ ఖాన్) పాత్ర ఏమిటి? చైనా, పాక్ కుట్రను చందు ఎలా ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ.

చందుగా అశ్విన్ బాబు తన పాత్రను సమర్ధవంతంగా పోషించడమే కాకుండా పలు రకాల వేరియేషన్స్‌ను చక్క్గగా పలికించాడు. ఇక రాజు గారి గది ఫ్రాంచైజీ, హిడింబ సినిమా తర్వాత మరింతగా మెచ్యురిటీని ప్రదర్శిస్తూ్ ఫెర్పార్మ్ చేశాడు. కామెడీ, యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. ఇక దిగంగన కనిపించిన వరకు క్యూట్‌గా తెర మీద కనిపించింది. తన పాత్ర పరిధి మేరకు పూర్తి న్యాయం చేసిందనిపించింది. ఇక అర్బాజ్ ఖాన్ రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్. సటిల్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. ఏసీపీగా అర్బాజ్ ఖాన్ కూల్ అండ్ గుడ్ లుకింగ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. హైపర్ ఆది తన కామెడీతో నవ్వులు పూయించాడు.

Shivam Bhaje Movie Review in Telugu  Ashwin Babu  Arbaaz Khan Suspense Thriller

ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఎడిటింగ్ అత్యంత బలంగా నిలిచాయి. సినిమాటోగ్రాఫర్ శివేంద్ర చిత్రీకరించిన సన్నివేశాలు, యాక్షన్ సీన్లు బాగున్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను ఓ రేంజ్‌కు చేర్చాయి. బీజీఎం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక ఎడిటర్ చోటా కే ప్రసాద్ సినిమాను పరుగులు పెట్టించడానికి తన కత్తెరకు బాగా పదును పెట్టారు. ఫస్టాఫ్‌లో కథను ఎస్టాబ్లిష్, క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో కొంత ల్యాగ్ అనిపిస్తుంది. మిగితా అంతా చక్కగా కట్ చేశారు. గ్రాఫిక్ వర్క్ చాలా ప్రొఫెషన్‌గా ఉంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండటమే కాకుండా సినిమా ఫుల్ క్వాలిటీ, రిచ్‌గా అందించడంలో సక్సెస్ అయ్యారు.

దర్శకుడు అఫ్ఫర్ కథకు ఎంచుకొన్న అంశాలు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తాయి. పాత్రల చుట్టూ అల్లుకొన్న సన్నివేశాలు ఫస్టాఫ్‌లో ఫన్నీగా ఎమోషనల్‌గా ఉంటాయి. అయితే రెండు,మూడు లేయర్లతో కథను నడిపిని విధానం బాగుంది. ఇంటర్వెల్‌లో ఇచ్చిన ట్విస్టుతో కథలో ఏదో బ్రహ్మండమైన విషయం చెప్పబోతున్నామనే ఫీల్‌ను దర్శకుడు క్రియేట్ చేయడంలో సక్సెస్ అవ్వడమే కాకుండా సెకండాఫ్‌పై అంచనాలు పెంచారని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు హైపర్ ఆది, హీరో అశ్విన్ బాబు చుట్టు రాసుకొన్న సన్నివేశాలు ఆకట్టుకొన్నాయి.

Shivam Bhaje Movie Review in Telugu  Ashwin Babu  Arbaaz Khan Suspense Thriller

ఇక సెకండాఫ్‌లో కథ సీరియస్‌ జోన్‌లోకి నెట్టి ఆసక్తిని క్రియేట్ చేశాడు. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా గ్రిప్పింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రీ క్లైమాక్స్‌లో ట్విస్టును రివీల్ చేసి క్లైమాక్స్‌పై అంచనాలు పెంచేలా చేశాడు. కానీ క్లైమాక్స్‌లో ఆ ట్విస్టును రెగ్యులర్, రొటీన్‌గా ముగించడం ప్రేక్షకుడిని కాస్త అసంతృప్తికి గురి చేస్తుంది. క్లైమాక్స్‌ను బాగా డిజైన్ చేసి ఉంటే.. హనుమాన్ తరహా విజయం దక్కి ఉండేదనిపిస్తుంది. సినిమా మొత్తాన్ని గ్రిప్పింగ్‌గా చెప్పిన డైరెక్టర్ చివర్లో తడబాటు పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

పాక్, చైనా ఇంటర్నేషనల్ మాఫియా, ఫ్యామిలీ ఎమోషన్స్, మెడికల్ సర్జరీల అంశాలకు శివతత్వం కలిపి రూపొందించిన సస్సెన్స్ థ్రిల్లర్. డోగ్రా డాగ్ సెంటిమెట్ సినిమాకు ఫీల్ గుడ్ ఎలిమెంట్. ఫస్ట్ టైమ్ డైరెక్టర్ విజన్, మేకింగ్ బాగుంది. అశ్విన్ బాబు ఫెర్ఫార్మెన్స్ లాంటి అంశాలు సినిమాకు ప్లస్‌గా మారాయి. పురాణాలు, దేశభక్తి అంశాలతో వచ్చే సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమాను వారాంతంలో థియేటర్‌లో ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి. ఈ సినిమాను ఓసారి ప్రశాంతంగా చూసేయొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X