twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bestseller web series Review శృతిహాసన్ వన్ ఉమెన్ షో.. మిథున్ దా విలక్షణ నటనతో..

    |

    Rating: 3/5

    నటీనటులు: మిథున్ చక్రవర్తి, శృతిహాసన్, అర్జున్ బజ్వా, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే, సొనాలీ కులకర్ణి
    దర్శకత్వం: ముకుల్ అభ్యంకర్
    రచయిత: అన్వితా దత్
    నిర్మాత: సిద్దార్థ్ పీ మల్హోత్రా, స్వప్న ఎస్ మల్హోత్రా
    ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
    ఓటీటీ రిలీజ్ డేట్: 2022-02-18

    బెస్ట్ సెల్లర్ కథ ఇలా..

    బెస్ట్ సెల్లర్ కథ ఇలా..

    యువ రచయిత తాహిర్ వజీర్ వాస్తవ సంఘటనల ఆధారంగా రాండ్ సాండ్ సీదీ సన్యాసి అనే గమ్మత్తైన టైటిల్‌తో ఓ పుస్తకాన్ని రాస్తాడు. ఆద్య జైసింగ్ అలియాస్ మీతూ మాథుర్ (శృతిహాసన్) ఆ అనే యువతి ఆ పుస్తకం చదివి తాహిర్ వజీర్‌కు వీరాభిమానిగా మారిపోతుంది. తాహిర్ వజీర్‌ను ఓ సందర్భంలో కలుసుకొని పరిచయం పెంచుకొంటుంది. కొన్ని పరిస్థితుల కారణంగా తాహిర్ ఆశ్రయాన్ని పొంది అతడి ఇంటిలోనే ఉంటుంది. అయితే ఓ రోజు మీతూ మాథుర్‌పై దాడి జరుగుతుంది. ఆ తర్వాత తాహిర్ భార్య, యాడ్ ఫిలిం డైరెక్టర్ మయాంక్ కపూర్ (గౌహర్ ఖాన్) వద్ద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ లోకేష్ ప్రమాణిక్ (మిథున్ చక్రవర్తి), అతడి వద్ద పనిచేసే ఎస్సై ఊర్మిల రనడే (సోనాలి కులకర్ణి) దర్యాప్తు చేపడుతారు.

    బెస్ట్ సెల్లర్ సిరీస్‌లో ట్విస్టులు

    బెస్ట్ సెల్లర్ సిరీస్‌లో ట్విస్టులు


    రాండ్ సాండ్ సీదీ సన్యాసి రాయడానికి తాహీర్ వజీర్ స్పూర్తి ఏమిటి? ఈ నవల రాసిన తర్వాత తాహిర్‌కు ఎలాంటి సమస్యల్లో కూరుకుపోయాడు? అభిమాని అనే పేరుతో తాహిర్‌కు మీతూ మాథుర్ ఎందుకు చేరువైంది? మీథూ మాథుర్‌పై ఎవరు దాడి చేశారు? లోకేష్ ప్రమాణిక్ దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? తాహిర్, మీతూ మాథుర్ మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఆద్యా జైసింగ్ పేరును మీతూ మాధూర్‌గా ఎందుకు మార్చుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే బెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్ కథ.

    8 ఎపిసోడ్స్ 35 నిమిషాల నిడివి

    8 ఎపిసోడ్స్ 35 నిమిషాల నిడివి

    ప్రముఖ రచయిత తాహిర్ వజీర్‌ను మీతూ కలుసుకోవడంతో ఫీల్‌గుడ్‌ నోట్‌తో సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ వెబ్ సిరీస్‌ నిడివి 30 నుంచి 35 లోపు ఉండటంతో కథ చాలా వేగంగా ముందుకెళ్లినట్టు అనిపిస్తుంది. అయితే తాహిర్‌కు మీతూ చేరువైన తర్వాత ఊహించని సంఘటనలు చకచకా చోటుచేసుకోవడంతో కథ, కథనాలు ఆసక్తిగా మారుతుంటాయి. తాహిర్, మీతూ మధ్య కాన్‌ఫ్లిక్ట్ డెవలప్ అయిన తర్వాత ఆ పాత్రలు పోషించిన అర్జున్, శృతి హాసన్ ఫెర్ఫార్మెన్స్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

     సెకండాఫ్‌ గ్రిప్పింగ్‌గా

    సెకండాఫ్‌ గ్రిప్పింగ్‌గా

    బెస్ట్‌సెల్లర్ వెబ్ సిరీస్‌లో 4 నుంచి 5 ఎపిసోడ్‌లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కథను డ్రైవ్ చేసిన విధానం ఆకట్టుకొంటుంది. మొత్తం సిరీస్‌లో ఆరు నుంచి ఎనిమిదో ఎపిసోడ్ వరకు కథలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని సంఘటనలను ఉందే ఊహించే విధంగా ఉండినప్పటికీ.. కథలోని ఎమోషన్స్, కథనం ఇంట్రెస్ట్‌ను కలుగజేస్తాయి. ఓవరాల్‌గా మంచి ఎమోషనల్, సస్పెన్స్, థ్రిల్లర్ చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.

     శృతిహాసన్ ఫెర్ఫార్మెన్స్ ఇలా..

    శృతిహాసన్ ఫెర్ఫార్మెన్స్ ఇలా..


    ఆద్యా జైసింగ్, మీతూ మాథూర్ పాత్రల్లో శృతిహాసన్ పలు రకాల వేరియేషన్స్ చూపించింది. మదర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్‌తో సాగే ఈ వెబ్ సిరీస్‌ భారాన్ని తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించింది. అమాయకురాలిగా, తల్లికి జరిగిన అవమానానికి బదులు తీర్చుకొనే కూతురిగా విభిన్నమైన నటనను ప్రదర్శించింది. కొన్ని సన్నివేశాల్లో గ్లామర్‌పరంగా కూడా మెప్పించింది.

    మిగితా నటీనటులు గురించి

    మిగితా నటీనటులు గురించి

    మిగితా పాత్రల్లో పోలీస్ ఆఫీసర్ లోకేష్ ప్రమాణిక్‌గా మిథున్ చక్రవర్తి విభిన్నంగా కనిపించాడు. సింపుల్, సౌమ్యంగా ఉండే పోలీస్ ఆఫీసర్‌గా మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్ చూపించాడు. చివర్లలో మిథున్ ఇచ్చిన ట్విస్టు సీజన్ 2కు మంచి లీడ్ ఇచ్చింది. తాహిర్ భార్య మయాంక కపూర్‌గా గౌహర్ ఖాన్ అందాలను ఆరబోసింది. పాత్ర చిన్నదైనా గుర్తుండి పోతుంది. ఊర్మిల పాత్రలో సొనాలి కులకర్ణి ఫర్వాలేదనిపించింది. శృతిహాసన్ సోదరుడిగా సత్యజిత్ దూబే మంచి నటనతో ఆకట్టుకొన్నాడు.

    English summary
    Shruti Haasan's Bestseller web series hits the Amazon Prime Video OTT on February 18th. Here is the Telugu filmibeat exclusive review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X