twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త సీసాలో పాత సారా

    By Staff
    |

    Shubavela
    -జలపతి గూడెల్లి
    చిత్రం: శుభవేళ
    నటీనటులు: రవికాంత్‌, అను, తనికెళ్ళ భరణి
    సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, ఛాయగ్రహణం: తేజ
    నిర్మాత: రామోజీరావు
    దర్శకత్వం: రమణ

    అమాయకమైన పల్లెటూరి యువతి చేసే చేష్టలు, అల్లరి, వేసే చిందులు...ఆధారంగా చేసుకొని చాలా చిత్రాలు వచ్చాయి. చిత్రం, నువ్వే కావాలి తర్వాత ఉషాకిరణ్‌ మూవీస్‌ అందించిన తాజా చిత్రం శుభవేళ కూడా అదే తరహా చిత్రం. కొత్త సీసాలో పాత సారాను పోసేందుకు చేసిన ఈ ప్రయత్నం ఫర్వాలేదు. సాధారణంగా ఉన్న ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ విషయం సంగీతం. వినసొంపైన పాటలు, అందుకుతగ్గ చిత్రీకరణ హాయిగొల్పుతాయి.

    అనుకు పెళ్ళి అంటే భయం. తాళిని చూడగానే ఆమెలో ఎక్కడలేని భయం ముంచుకొస్తుంది. అందుకే పెళ్ళిపీటల మీద పెళ్ళి కొడుకులను తన్ని, తాళిని విసిరేసి పారిపోతుంది. అలా నాలుగుసార్లు జరగడంతో అది ఇంట్రెస్టింగ్‌ స్టోరి అని భావించిన కుర్ర రిపోర్టర్‌ రవికాంత్‌ తను పనిచేసే పత్రికలో ప్రచురిస్తాడు. దాంతో పరువు నష్టం కేసు దాఖలు చేస్తారు అను తల్లితండ్రులు. రవికాంత్‌ పనిచేసే పత్రికను కోర్ట్‌ సీజ్‌ చేస్తుంది. పత్రికను కాపాడుకునేందుకు రవికాంత్‌ అను వాళ్ళ ఊరికి బయలుదేరుతాడు.

    ఆమెను ప్రత్యక్షంగా చూసిన రవికాంత్‌ ఫస్ట్‌ సైట్‌ లోనే ప్రేమలో పడుతాడు. మెల్లగా అను కూడా రవికాంత్‌ ను ప్రేమిస్తుంది. నాలుగు సార్లు పెళ్ళిపీటల మీద పెళ్ళి ఆగిపోయిన అమ్మాయిని పెళ్ళిచేసుకుంటానని దవికాంత్‌ ముందుకు రావడంతో అను తల్లితండ్రులు వెంటనే ఒప్పుకుంటారు. పెళ్ళి అంటే ఆమెకు భయం పోయేలా చేయడంతో ఇద్దరికీ పెళ్ళి అవుతుంది.

    చిత్రం సినిమాలో మ్యాజిక్‌ చేసిన ఆర్‌.పి.పట్నాయక్‌, కులశేఖర్‌ లు మరోసారి ఆహ్లాదకరమైన పాటలను అందించారు. ఫోటోగ్రఫీ విషయంలో మంచి ప్రతిభను కనబర్చిన తేజ స్క్రీన్‌ ప్లే లో జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది. రమణ దర్శకత్వం ఫర్వాలేదు. ఈ చిత్రంతో పరిచయమైన హీరో, హీరోయిన్లు రవికాంత్‌ , అనుల నటనలో పరిణతి లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X