For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాణి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating: 2.5/5

  విభిన్నమైన కథాంశంతో చిన్న చిత్రాలు టాలీవుడ్‌లో సందడి చేస్తున్నాయి. చిన్న చిత్రాలుగా వచ్చిన పలు చిత్రాలు ఫీల్‌గుడ్‌తో మంచి అనుభూతికి గురి చేస్తున్నాయి. ఇలాంటి కోవలో తాజాగా వచ్చిన రాణి చిత్రం ప్రస్తుతం అమెజాన్, ఎం‌ఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఓటీటీ‌లో మంచి ఆదరణను కూడగట్టుకొంటున్న ఈ చిత్రం గురించి మరింత లోతుగా...

  రాణి మూవీ కథ

  రాణి మూవీ కథ

  సంగీత అలియాస్ రాణి (శ్వేతా వర్మ) పేదరికంలో పుట్టిన యువతి. తండ్రి కోరిక మేరకు ఉన్నత చదువులు చదివి కలెక్టర్ కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంటుంది. ఈ క్రమంలో అమ్మాయిల ఆర్థిక అవసరాలను, బలహీనతలను ఆసరాగా చేసుకొని యువతులను వేశ్య వృత్తిలోకి దించే శివ (ప్రవీణ్ యండమూరి) బారిన పడుతుంది. సంగీత పేరుతో కాకుండా రాణి పేరుతో వేశ్యగా మారుతుంది. ఈ క్రమంలో రాణిని వేశ్యవృత్తిలో నుంచి బయటకు లాగేందుకు తన స్నేహితుడు, పోలీస్ అధికారి విక్రమ్ (కిషోర్ మారిశెట్టి) ప్రయత్నిస్తుంటాడు.

  రాణి ఎలా ఉందంటే...

  రాణి ఎలా ఉందంటే...

  రాణి చిత్రానికి ప్రధానమైన బలం కథ, కథనాలు. కీలక సన్నివేశాల సమయంలో తెర మీద వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్ కలుగజేస్తాయి. అన్నివర్గాలను ఆకట్టుకొనే విధంగా రాణి క్యారెక్టర్‌ను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకొంటుంది. అలాగే శివ పాత్రలోనే వేరియేషన్స్ చిత్రంలో అలరించే అంశాలుగా కనిపిస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టు కథా స్వరూపాన్ని, గమనాన్ని మార్చివేసి ప్రేక్షకుడిని ఆలోచనలో పడేస్తాయి.

  దర్శకుడు రాఘవేంద్ర గురించి

  దర్శకుడు రాఘవేంద్ర గురించి

  దర్శకుడు రాఘవేంద్ర కటారి కర్త, కర్మ, క్రియగా మారితే శ్వేతా వర్మ తన నటనతో రాణి చిత్రాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. రాణి, శివ, విక్రమ్ క్యారెక్టర్లను రాసుకొన్న విధానానికి, కథ, కథనాలను గ్రిప్పింగ్‌గా రూపొందించుకొన్న తీరును అభినందించాల్సిందే. చిన్న చిత్రమైనా దర్శకుడు ఫీల్‌గుడ్‌ అంశాలతో చక్కటి చిత్రంగా రూపొందించారు. ‘ఎండలో భగభగ మండుతున్న నాపరాతి బండి మీద చిన్న పురుగును పడవేస్తే అది ఎలా కొట్టుకుంటూ చస్తుందో రాణి కూడా అలా చచ్చేటప్పుడు చూడాలి', పగ తీర్చుకోవడం అంటే శత్రువను చంపడం కాదు.. మనకు నచ్చినట్టుగా మార్చుకోవడం అంటూ దర్శకుడు రాసుకొన్న డైలాగ్స్ ఆకట్టుకొంటాయి.

  విభిన్నమైన పాత్రలో శ్వేతా వర్మ

  విభిన్నమైన పాత్రలో శ్వేతా వర్మ

  రాణిగా, సంగీతగా శ్వేతా వర్మ ఒదిగిపోయారు. రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించి చక్కటి నటనను ప్రదర్శించారు. సాధారణ యువతి సంగీతగా, పగతో రగిలిపోయే రాణిగా తన పాత్రకు ఓ తెలుగు అమ్మాయిగా పూర్తిగా న్యాయం చేశారు. ఇక చివర్లో శ్వేత వర్మ చూపించిన పరిణితి ఆకట్టుకొంటుంది. వైవిధ్యభరితమైన, నటనకు స్కోప్ ఉన్న చక్కటి పాత్రలను ఎంచుకొంటే నటిగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  శివగా ప్రవీణ్, విక్రమ్‌గా కిషోర్

  శివగా ప్రవీణ్, విక్రమ్‌గా కిషోర్

  శివగా నటించిన ప్రవీణ్ యండమూరి రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో చక్కగా నటించాడు. రెండు గెటప్స్‌లో నటించి మెప్పించారు. విలన్‌గా మంచి స్కోప్ ఉన్న పాత్రను అవలీలగా పోషించాడు. క్లైమాక్స్‌ సన్నివేశాల్లో ఆయన నటన బాగుంది. ఇక విక్రమ్‌గా కిషోర్ మారిశెట్టి తన పాత్రకు న్యాయం చేశాడు. నటనపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే బాగుండేది. సినిమాకు బలంగా మారిన పాత్రలో ఒదిగిపోయారు. సినిమాను మలుపుతిప్పే వైద్య పరిశోధకుడు పాత్రలో నటించిన అప్పాజీ అంబరీషతోపాటు ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. రాణి చిత్రానికి ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫి. సినిమాటోగ్రాఫర్ రామ మారుతి యం సన్నివేశాలను చాలా రిచ్‌గా, అందంగా చిత్రీకరించారు. శాండీ అడ్డంకి అడ్డంకి అందించిన మ్యూజిక్ బాగున్నది. గుండె నిండా నిప్పు అంతుకుండ, సముద్రం తలోంచెనా అనే పాటలు భావోద్వేగంతో సాగుతాయి. జస్విన్ ప్రభు ఎడిటింగ్ ఫర్వాలేదు. ఇంకా కొంత చేతికి పనుందనే ఫీలింగ్ కలుగుతుంది.

  నటీనటులు

  నటీనటులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  శ్వేతా వర్మ, ప్రవీణ్ యండమూరి, కిషోర్ మారిశెట్టి, అప్పాజీ అంబరీష, ధర్మ, మేక రామకృష్ణ, రాజశేఖర్ అన్నింగి, సురభి శ్రావణి, సుజాత, తదితరులు

  బ్యానర్: మనోహరి ఆర్ట్స్. నజియా షేక్ ప్రొడక్షన్స్

  నిర్మాత: కిషోర్ మారిశెట్టి, నజియా షేక్

  కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాఘవేంద్ర కటారి

  మ్యూజిక్: శాండీ అడ్డంకి

  సినిమాటోగ్రఫీ: .రామా మారుతి యం

  ఎడిటర్: జెస్విన్ ప్రభు

  పీఆర్వో: .మధు వి ఆర్

  ఓటీటీ రిలీజ్: అమెజాన్, ఎం‌ఎక్స్ ప్లేయర్‌

  English summary
  Producer's Nazia Shaik, Kishore Marishetty's Rani released in OTT platform. Shweta Varma as lead role in this movie. Praveen Yandamuri played crucial role. Directed by Raghavendra Katari
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X