Sikandar Critic Review: సల్మాన్ రిటైర్మెంట్ తీసుకో.. యాక్టింగ్ వచ్చా? సికందర్‌పై విరుచుకుపడ్డ క్రిటిక్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ మూవీ రంజాన్ పండుగ కానుకగా మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ నటించారు. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించాడు. అయితే ఈ సినిమాపై క్రిటిక్స్ పెదవి విరిచారు. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్ KRK అలియాస్ కమల్ ఆర్ ఖాన్ ఘాటైన విమర్శలు చేశారు. కేఆర్కే చేసిన రివ్యూ వివరాల్లోకి వెళితే..
సికందర్ మూవీ చూసిన తర్వాత దర్శకుడు ఏఆర్ మురగాస్ వైఫల్యం కొట్టిచ్చినట్టు కనిపించింది. ఈ కథ, కథనాల విషయంలో ఏం చేస్తున్నాడో కూడా ఆయనకు తెలియని పరిస్థితి కనిపించింది. ఈ సినిమా చేస్తే 15 నుంచి 20 కోట్ల రూపాయలు పారితోషికం వస్తుంది. ఇక ఖేల్ ఖతం అని అనుకొన్నాడు. నా జీవితం సెట్ అయిపోయిందని భావించాడమే అని కేఆర్కే తన రివ్యూలో వెల్లడించారు.
సికందర్ సినిమా కథ చెప్పడంలో విఫలమయ్యాడు. మంచి మ్యూజిక్ అందించడంలో మరీ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. యాక్షన్ సీన్లను పేలవంగా చిత్రీకరించారు. మిగితా విభాగాల పనితీరును ఆయన హ్యాండిల్ చేయడంలో దారుణంగా విఫలయ్యాడు. మురగదాస్ డైరెక్షన్ చాలా దారుణంగా ఉంది అని కేఆర్కే చెప్పారు.

సహజంగానే సల్మాన్ ఖాన్‌కు యాక్టింగ్ రాదు. డైలాగ్స్ చెప్పడం రాదు. కానీ యాక్టింగ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. నాకు ఇష్టం లేకున్నా యాక్టింగ్ చేస్తున్నాను అని చెప్పే విధంగా ఆయన యాక్టింగ్ అయింది. ఆయనకు యాక్టింగ్ రాదు.. డైలాగ్ చెప్పడం రాదు. డ్యాన్సులు చేయడం రాదు. నీకు సినిమాలు ఎందుకు?.. రిటైర్మెంట్ తీసుకో. భారీగా డబ్బు సంపాదించావుగా అంటూ కేఆర్కే విరుచుకుపడ్డారు.
నీకు వయసు మీద పడింది. నీకు సినిమాలు ఎందుకు? నువ్వు హీరోగా పనికిరావు. బలవంతంగా హీరోను చేసి మా మీద రుద్దారు అని కేఆర్కే అన్నారు. ఈ సినిమాలో శర్మాన్ జోషి కీలక పాత్రలో నటించాడు. ప్రతీ మూడు నిమిషాలకు రాజాసాబ్ అనే డైలాగ్ చెప్పడం తప్పా ఏమీ లేదు. ఈ సినిమాలో నటించి పరువు పోగోట్టుకొన్నాడు అని కేఆర్కే అన్నాడు.

ఇక రష్మిక మందన్నను చిన్న పాత్రే ఉంది. ఈ సినిమాలో గ్లామరస్‌గా కూడా కనిపించలేదు. ఆమె యాక్టింగ్ చేయడానికి స్కోప్ లేకపోయింది. ఈ సినిమాలో సంజయ్ కపూర్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర కూడా పేలవంగా ఉంది. ఈ మూవీలో వరుణ్ ధావన్ కోడలు అంజలి ధావన్ కూడా ఉన్నారు.ఆమెను చూసిన తర్వాత యాక్టర్ అవ్వడానికి స్కోపేలేదు అని కేఆర్కే విమర్శించాడు.
ఈ సినిమా చూడటానికి ఒక్క మంచి అంశం కూడా లేదు. ఈ సినిమా చూడటం టైమ్ వేస్ట్. 2.30 గంటల టార్చర్. మీరు డబ్బు వేస్ట్ చేసుకోవడానికి, టార్చర్ అనుభవించడానికి వెళ్లాలనుకొంటే వెళ్లండి. ఈ సినిమా ప్రదర్శించే థియేటర్‌కు 2 కిలోమీటర్ల దూరంలో ఉండండి. ఇందులో మంచి అంశాలు ఒకటి కూడా లేవు కాబట్టి ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 0/5 అని కేఆర్కే తన వీడియోలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











