Sikandar Movie Review: సికందర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బబ్బర్, సంజయ్ కపూర్, కిషోర్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏఆర్ మురగదాస్
నిర్మాత: సాజిద్ నడియావాలా
సినిమాటోగ్రఫి: తిరు
మ్యూజిక్: ప్రీతమ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సంతోష్ నారాయణ్
ఎడిటింగ్: వివేక్ హర్షన్
బ్యానర్: నాడియావాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2025-03-30

రాజ్‌కోట్ రాజవంశానికి చెందిన సంజయ్ రాజ్‌కోట్ అలియాస్ సికందర్ అలియాస్ రాజాసాబ్ (సల్మాన్ ఖాన్), రాణి సాయిశ్రీ (రష్మిక మందన్న) అన్యోన్య దంపతులు. తమ ప్రాంతంలోని ప్రజలను కంటికి రెప్పలా చూసుకొంటారు. మంత్రి ప్రధాన్ (సత్యరాజ్)‌తో వైరం కారణంగా సాయిశ్రీ మరణిస్తుంది. అయితే తన కోరిక మేరకు ముగ్గురికి ఆమె అవయవదానం చేస్తుంది. అయితే అవయవదానం పొందిన వారికి మంత్రి ప్రధాన్ నుంచి ముప్పు ఏర్పడుతుంది. అయితే ఆ ముగ్గురు జీవితాల్లో ఉన్న సమస్యలు, మంత్రి అనుచరులు దాడిని అడ్డుకొనేందుకు సికందర్ ముంబైకి వెళ్తాడు.

మంత్రి ప్రధాన్‌ కొడుకు అర్జున్‌తో సికందర్‌ గొడవ ఏమిటి? తన కొడుకుతో గొడవ పడిన సంజయ్‌తో మంత్రి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నాడు? సాయిశ్రీ ఎలా చనిపోయింది? అవయవదాన గ్రహీత వైదేహీ (కాజల్ అగర్వాల్)కు ఉన్న సమస్య ఏమిటి? మిగితా ఇద్దరు ఆర్గాన్ డొనేషన్ తీసుకొన్న వారికి ఏర్పడిన ప్రమాదానికి సికందర్ ఎలా అడ్డుగా నిలిచాడు. మంత్రి ప్రధాన్ కొడుకు అర్జున్ పరిస్థితి ఏమైంది? మంత్రి ప్రధాన్‌కు ఎలాంటి గుణపాఠం చెప్పాడు? అనే ప్రశ్నలకు సమాధానమే సికందర్ మూవీ సినిమా కథ.

Sikandar Movie Review
దర్శకుడు ఏఆర్ మురగదాస్ గతంలో కూడా సామాజిక అంశాలను ఇతివృత్తంగా చేసుకొని సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో సినిమాలను అందించారు. సల్మాన్ లాంటి స్టార్ హీరోను టార్గెట్ చేసుకొని అవయవదానం గురించి ప్రేక్షకులకు అవగాహన కల్పించే విధంగా సల్మాన్ ఇమేజ్‌కు తగిన కథను రాసుకొన్నాడు. అయితే కథను బలమైన సన్నివేశాలు రాసుకొనే క్రమంలో ఆయన ట్రాక్ మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. మంత్రి, ఆయన కొడుకుతో వైరం అనే పాయింట్‌ను ఈ కథలోకి జొప్పించడమే మైనస్‌గా మారింది. రాజవంశానికి చెందిన రాజాసాబ్.. తలచుకొంటే ఏదైనా చేయగలడు. కానీ ఆ క్యారెక్టర్‌కు ఉన్న స్ట్రెంగ్త్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోయాడనే ముమ్మాటికి నిజం. సల్మాన్ ఖాన్ ఎనర్జీ, స్టార్‌డమ్‌ను క్యాష్ చేసుకోవడంలో మురగదాస్ పూర్తిగా విఫలమయ్యాడని చెప్పవచ్చు.

ఇక సల్మాన్ ఖాన్ రాజాసాబ్‌గా తన స్టైల్, ఎనర్జీ, ఇమేజ్‌కు తగినట్టుగానే ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టాడనే చెప్పాలి. కానీ సల్మాన్ పాత్ర చూస్తే కింగ్ సైజ్ క్యారెక్టర్ మాత్రం కాదు. రష్మిక యువరాణిగా గ్లామరస్‌గా కనిపించింది. కానీ రష్మిక బాక్సాఫీస్ జోష్‌కు అడ్డుకట్టపడిందనే చెప్పాలి. కాజల్ అగర్వాల్ చాలా నాసిరకమైనా పాత్రకే పరిమితమైంది. ఎలాంటి స్కోప్ లేని వైదేహీ పాత్రలో కనిపించింది. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్, శర్మాన్ జోషి పెద్దగా ప్రాధాన్యం పాత్రలే అనిపిస్తాయి.

టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ స్టార్‌డమ్‌కు తగినట్టుగా పాటలు ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ డ్రామాతోపాటు డైలాగ్స్ డ్రామా కూడా ఎక్కువగానే ఉంది. కొన్ని చోట్ల డైలాగ్స్ గుండెను తాకుతాయి. తిరు సినిమాటోగ్రఫి, సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా కథకు తగినట్టుగా సాజిద్ నాడియావాలా గ్రాండియర్‌గా నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కానీ కంటెంట్ వాల్యూస్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్. ఇంకాస్త కంటెంట్ మీద ఫోకస్ పెట్టి ఉంటే.. బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదనిపిస్తుంది.

Sikandar Movie Review

ఆర్గాన్ డొనేషన్, లవ్, ఎమోషన్స్ అంశాలను జోడించి సల్మాన్ ఖాన్ స్టార్ వాల్యూకు తగినట్టుగా రూపొందించిన సినిమా సికందర్. పక్కా మాస్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకుడి ఈ సినిమా నుంచి క్రేజీగా తీసుకెళ్లే అనుభూతులు ఏమీ లేవనే చెప్పాలి. హిందూ రిలేటేడ్ సీన్లలో సల్మాన్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాస్ అంశాలు మెప్పిస్తాయి. సల్మాన్ ఫ్యాన్స్‌కు మాత్రం ఏ విధమైనా నిరాశ ఉండదు. కాకపోతే సికందర్.. బాలీవుడ్ సినిమాకు తక్కువ.. సౌత్ సినిమాకు ఎక్కువగా ఉంది అనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X