Sikandar First Review: సికందర్ ఫస్ట్ రివ్యూ.. సల్మాన్ ఖాన్ మూవీ హిట్టా? ఫట్టా?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రం ఈద్‌కు విడుదలయ్యేందుకు ముస్తాబైంది. దక్షిణాది దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రంజాన్ పండుగ కానుకగా మార్చి 30 తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ తదితరులు కనిపించనున్నారు. ఈ సినిమా గురించి ప్రముఖ క్రిటిక్ సోషల్ మీడియాలో వెల్లడించిన రివ్యూ వివరాల్లోకి వెళితే..

సల్మాన్ ఖాన్, మురగదాస్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో రంజాన్ కానుకగా వస్తున్న సికందర్ సినిమాపై దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ ఘాటైన కామెంట్స్ చేశారు. ఈ సినిమాను దుబాయ్ సెన్సార్ సందర్భంగా చూసినట్టు ఆయన సోషల్ మీడియా ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచిందని వెల్లడించారు.

Sikandar Movie First Review

సికందర్ సినిమా పూర్తిగా పేలవమైన మూవీ. సల్మాన్ ఖాన్ ఎంచుకొన్న చిత్రాలను చూస్తే.. ఆయనకు ఏమౌందనే అనుమానం కలుగుతున్నది. ఆయన ఇండస్ట్రీకి ఇచ్చిన హిట్ సుల్తాన్. ఆ సినిమా 2016లో వచ్చింది. అప్పటి నుంచి ఆయనను డిజాస్టర్లు వెంటాడుతున్నాయి. గత 9 ఏళ్లుగా ఆయనకు ఒక్క హిట్ కూడా లేదు అని ఉమేర్ సంధూ తన రివ్యూలో పేర్కొన్నారు.

సికందర్ సినిమాను చూస్తుంటే ఇరిటేట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. పేలవమైన స్టోరి, మ్యూజిక్. దానికి తగినట్టే చెత్త పెర్ఫార్మెన్స్, యాక్షన్ సంట్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సినిమా మూడు సినిమాలను రీమేక్ చేసినట్టు కినిపిస్తున్నది. దక్షిణాది, భోజ్‌పురి, బంగ్లాదేశీ సినిమాలను కలిపి తీసినట్టు ఉందని ఆయన తన రివ్యూలో వెల్ల్లడించారు.

సికందర్ సినిమా చూసిన తర్వాత పూర్తిగా నిరాశకు గురయ్యాను. స్క్రీన్ ప్లే బాగా లేదు. సాంగ్స్ బాగాలేవు. యాక్టర్ల పెర్ఫార్మెన్స్ కూడా చెత్తగా ఉన్నాయి. ఈ సినిమా రంజాన్ సందర్భంగా మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. కానీ హాలీడేస్ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటం ఖాయం అని ఉమేర్ సంధూ ఘాటుగా విమర్శించారు.

సికిందర్ సినిమాకు ఉమేర్ సంధూ కేవలం 2/5 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఆయన ఈ సినిమాను పూర్తిగా తన కామెంట్స్‌తో కడిగిపడేశారు. ఈ క్రిటిక్ కొన్నిసార్లు దారుణమైన రివ్యూలు ఇస్తారు. అందుకు భిన్నంగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించాయి. కొన్ని బాగున్నాయని చెబుతాడు. కానీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. కాబట్టి సినిమా చూసిన తర్వాతే దానిపై ఓ అవగాహనకు రావాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X