Sikandar Twitter Review : సికందర్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. సల్మాన్ ఖాన్, రష్మిక హిట్ కొట్టారా?
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, వరుస విజయాలతో జోరుమీదున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం సికందర్. దక్షిణాది దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సికందర్‌లో కాజల్ అగర్వాల్ కీలకపాత్ర పోషంచారు. సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బబ్బర్, కిషోర్, జతిన్ శర్మ, సంజయ్ కపూర్, నవాబ్ షా తదితరులు నటించారు. రంజాన్ , ఉగాది పండుగల కానుకగా మార్చి 30 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నదియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సాజిద్ నదియాడ్‌వాలా ఈ సికందర్ చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు తిరు సినిమాటోగ్రఫర్‌గా సేవలందించగా.. ప్రీతమ్, సంతోష్ నారాయణన్‌లు సంగీత సారథ్యం వహించారు. ప్రీమియర్ షో తర్వాత ఈ సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే?

సల్మాన్ కెరీర్‌లో గత 8 నుంచి పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఎంట్రీ చూడలేదని.. సల్లూభాయ్ ఎంట్రీ సీన్ అదిరపోయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. పైసా వసూల్ బ్లాక్ బస్టర్ అంటూ అతను పోస్ట్ చేశాడు.
బ్లాక్‌బస్టర్ బొమ్మ.. ఇప్పుడే సికందర్ చూశాను. బజరంగీ భాయిజాన్ తర్వాత సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే సికందర్ బెస్ట్ ఫిల్మ్ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. సుల్తాన్, టైగర్ జిందా హై సినిమాల కంటే సికందర్ సినిమానే బెటర్ అన్న ఆ వ్యక్తి.. సికందర్ సినిమా చూస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నట్లు రాసుకొచ్చాడు. ఎమోషనల్ సీన్స్‌తో పాటు యాక్షన్ ప్యాక్డ్‌గా ఉందని.. కొన్ని గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయని ఆ నెటిజన్ తెలిపాడు.
సికందర్‌లో స్ట్రాంగ్ ఫస్టాఫ్ ఉందని.. బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్‌లు సాలీడ్‌గా ఉన్నాయని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ అయితే టాప్‌లో ఉన్నాయని.. సెకండాఫ్ కోసం అంతా సీట్లకు అతుక్కుపోయి వెయిట్ చేస్తున్నారని ఆ నెటిజన్ రాసుకొచ్చాడు.
ఆరా, స్వాగ్, ఆధిపత్యం.. సల్మాన్ ఖాన్ ఎంట్రీ సీక్వెన్స్. బీజీఎం అయితే ప్యూర్ మాస్ మాస్ అండ్ మాస్ అంటూ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. మురగదాస్ థండర్ స్ట్రోమ్ కుక్ చేశాడని అతను రాసుకొచ్చాడు.
సికందర్ చూసి నేను ఈ సంవత్సరం ఏంటో కూడా మర్చిపోయారు. 2025పై భాయ్ ఎఫెక్ట్ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అలాగే తొలుత 2024లో బిగ్గెస్ ఇండియన్ మూవీ చూస్తున్నానని చేసిన పోస్ట్‌ను సరిదిద్దుతూ మరో పోస్ట్ చేశాడు.
భాయి కోసం మాస్, క్లాస్ కలిసొచ్చారు. సికందర్ ఒక సినిమా కాదు.. ఇదొక పండుగ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అలాగే సికందర్ సినిమాకు ఆ యూజర్ 4/5 రేటింగ్ ఇచ్చాడు.
ప్రేక్షకుల నుంచి అనూహ్య డిమాండ్ కారణంగా సికందర్ సినిమాకు గోల్డ్ క్లాస్ సెషన్స్‌ను మరిన్ని పెంచారని .. అందరూ సినిమాకు వెళ్లాలని ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఎర్లీగా వచ్చిన పబ్లిక్ రివ్యూలు అదిరిపోయాయని, హేటర్స్ చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని .. వీరంతా నిర్మాతలను దోచుకునే ప్రయత్నంలో విఫలమైనవారని ఆ యూజర్ ఘాటుగా రాసుకొచ్చాడు. కాసేపట్లో ఈ సినిమాను చూడబోతున్నా.. ఇక వెయిట్ చేయలేనని పోస్ట్‌లో తెలిపాడు.


Click it and Unblock the Notifications











