twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిల్లీఫెలోస్ రివ్యూ అండ్ రేటింగ్

    By Rajababu
    |

    Recommended Video

    Silly Fellows Movie Review సిల్లీఫెలోస్ రివ్యూ అండ్ రేటింగ్

    Rating:
    1.0/5
    Star Cast: అల్లరి నరేష్‌, సునీల్‌, చిత్ర శుక్ల, నందిని, పూర్ణ
    Director: భీమినేని శ్రీనివాసరావు

    టాలీవుడ్‌లో కమెడియన్ హీరోలు సునీల్, అల్లరి నరేష్‌కు ఓ బ్రాండ్ ఉంది. కానీ వారి చిత్రాలు ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సునీల్, అల్లరి నరేష్‌ జతకట్టారు. వారిద్దరి సిల్లీఫెలోస్‌గా మార్చి ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సిల్లీ ఫెలోస్ చిత్రం ఈ ముగ్గురికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     సిల్లీ ఫెలోస్ కథ

    సిల్లీ ఫెలోస్ కథ

    రాజకీయ వేత్త అయిన జాకెట్ జానకి రాం (జయప్రకాశ్‌రెడ్డి) కులాంతర వివాహాలు చేయిస్తుంటాడు. వీరబాబు (అల్లరి నరేష్) బలవంతం చేసి ఒప్పించడంతో పుష్ప (నందిని) అనే రికార్డింగ్ డ్యాన్సర్‌ను సురిబాబు (సునీల్) పెళ్లి చేసుకొంటాడు. కానీ అప్పటికే కృష్ణవేణి (పూర్ణ)తో ప్రేమలో ఉండటంతో వెంటనే విడాకులు తీసుకోవాలని అనుకొంటాడు. కథ ఇలా సాగుతుంటే ఎస్పై ఉద్యోగంలో చేరాలనే కోరికతో ఉన్న వాసంతి (చిత్ర శుక్ల)తో ప్రేమలో పడుతాడు. జాకెట్ జానకి రాంకు ఓ మినిస్టర్ చనిపోతూ తను దాచిన 500 కోట్ల గురించి చెబుతాడు. ఆ విషయం తెలిసిన జాకెట్ ప్రత్యర్థులు (రాజారవీంద్ర, పోసాని కృష్ణమురళీ) ప్రయత్నిస్తుంటారు.

     సిల్లీ ఫెలోస్ ట్విస్టులు

    సిల్లీ ఫెలోస్ ట్విస్టులు

    ఇంతకీ పుష్ఫకు విడాకులు ఇవ్వాలనుకొన్న సురిబాబు ప్రయత్నం నెరవేరింది. కృష్ణవేణితో సురిబాబు పెళ్లి జరిగిందా? వాసంతి ఇన్స్‌పెక్టర్ అయిందా? వాసంతి, వీరబాబు ప్రేమ కొలిక్కి వచ్చిందా? 500 కోట్ల రూపాయల ఆచూకి దొరికిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే సిల్లీ ఫెలోస్ సినిమా కథ.

     సిల్లీ ఫెలోస్ ఫస్టాఫ్

    సిల్లీ ఫెలోస్ ఫస్టాఫ్

    జాకెట్ జానకీరాం కార్యక్రమాలను ప్రత్యర్థి నాయకులు దెబ్బ తీయడమనే అంశంతో సినిమా కథ మొదలవుతుంది. సురిబాబును వీరబాబు పెళ్లికి ఒప్పించడం కథ ట్విస్టు మొదలవుతుంది. డబ్బు, బంగారం కోసం ఆశపడిన సురిబాబుకు పుష్ప కష్టాలు మొదలవుతాయి. కథ ఇలా రొటీన్‌గా సాగుతుంటే తెరపైకి వీరబాబు, వాసంతి ప్రేమ ట్రాక్ మధ్యలో దూరుతుంది. ఆ తర్వాత జాకెట్, ఆయన ప్రత్యర్థుల ట్రాక్ మరొకటి మధ్యలో దూరడంతో కథంతా గందరగోళంగా మారుతుంది. ఇక ప్రమాదంలో జాకెట్ గతాన్ని మరిచిపోయే ఎపిసోడ్ మరీ సిల్లీగా ఉంటుంది.

    సిల్లీ ఫెలోస్ సెకండాఫ్

    సిల్లీ ఫెలోస్ సెకండాఫ్

    సెకండాఫ్‌లో పరమ రొటీన్‌గా, 80 దశకం లాంటి టేకింగ్‌, స్క్రీన్‌ ప్లేతో సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. రొటీన్ డైలాగ్స్, పేలవమైన కామెడీ రెండో భాగం అలరించకలేకపోతుంది. సన్నివేశాల సాగదీత లాంటి విషయాలు సినిమా వేగాన్ని కళ్లెం వేసినట్టు అనిపిస్తాయి. నాసిరకమైన ముగింపుతో అమ్మో అయిపోయిందా అనిపిస్తుంది.

     భీమినేని శ్రీనివాసరావు టేకింగ్

    భీమినేని శ్రీనివాసరావు టేకింగ్

    గతంలో ప్రేక్షకులకు గిలిగింతలు ఓ వైపు పెట్టిస్తూనే, మరోవైపు కంటతడి పెట్టించే విధంగా చిత్రాలను తీసిన భీమినేని శ్రీనివాస్ రావు మరోసారి రీమేక్‌‌ను నమ్ముకొన్నారు. తమిళంలో విజయవంతమైన చిత్రం వెలైను ఒందుట్ట వెల్లకారన్ అనే చిత్రాన్ని సిల్లీ ఫెలోస్‌గా మార్చాడు. కానీ గతంలో తీసినట్టుగా పక్కా స్క్రీన్ ప్లే, విలక్షణ కామెడీని ఈ చిత్రంలో అందించలేకపోయాడనే చెప్పవచ్చు. భీమినేని నుంచి ఆరోగ్యకరమైన హాస్యాన్ని ఆశించే ప్రేక్షకులకు భంగపాటే అని చెప్పవచ్చు. ఏదో చుట్టేయాలనే ఫీలింగ్‌తో సినిమాను రూపొందించారా అనే భావన కలుగుతుంది.

    రోటిన్ పాత్రలో సునీల్

    రోటిన్ పాత్రలో సునీల్

    సునీల్‌కు సురిబాబు క్యారెక్టర్ కొత్తేమీ కాదు. రెగ్యులర్ పాత్రలోనే మరోసారి కనిపించాడు. సక్సెస్ అత్యవసరమైన సమయంలో ఇలాంటి పాత్రలను సునీల్ నమ్ముకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. డైలాగ్ టైమింగ్ బాగుంది. కొత్తగా సునీల్‌కు ఈ సినిమా వల్ల ఏదైనా ప్రయోజనం కలిగితే అంతకంటే గొప్ప విషయం మరోటి ఉండదు.

    రెగ్యులర్ కామెడీతో అల్లరి నరేష్

    రెగ్యులర్ కామెడీతో అల్లరి నరేష్

    నరేష్‌ కూడా విజయం కోసం మొహం వాచిపోయి ఉంది. ఒక్క సక్సెస్ పడితే కెరీర్ ఊపుందుకొంటుంది అనే టైంలో సిల్లీ ఫెలోస్‌ను నరేష్ ఎంచుకోన్నారు. వీరబాబు పాత్ర నరేష్‌కు పరమ రొటీన్ పాత్రే. సక్సెస్‌ను ఆశించే బలమైన పాత్ర కాకపోవడం ఆయనకు మైనస్ అనిపిస్తుంది.

     హీరోయిన్ల గురించి

    హీరోయిన్ల గురించి

    బిగ్‌బాస్ ఫేం నందినిరాయ్, చిత్ర శుక్ల, పూర్ణ పాత్రలు అంతగా ఎస్టాబ్లిష్ అయ్యే పాత్రలు కావు. కొంతలో కొంత చిత్ర శుక్ల పాత్ర కొంత మెరుగ్గా ఉంటుంది. కొంతలో కొంత విషయం ఉన్న పోలీస్ పాత్రను సరిగా ఉపయోగించుకోలేకపోయిందనే చెప్పవచ్చు.

    కమెడియన్స్ గురించి

    కమెడియన్స్ గురించి

    ఎమ్మెల్యేగా జయప్రకాశ్‌రెడ్డిది పెద్దగా పసలేని పాత్రే. 50 ఏళ్ల వ్యక్తి 10 ఏళ్ల మనస్తత్వంగా ఉన్న అబ్బాయిగా వ్యవహరించడం సూట్ కాలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు పాత్రకు సరిపడలేదని చెప్పవచ్చు. రాజా రవీంద్ర బ్యాచ్, పోసాని గ్యాంగ్ కామెడీ వెగటు పుట్టిస్తుంది. బ్రహ్మానందం కూడా పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించారు.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    ఇక సిల్లీ ఫెలోస్‌కు కొంతలో కొంత శ్రీ వసంత్ సంగీతం బాగుంది. పాటలు బాగున్నా.. రీరికార్డింగ్ బాగాలేదు. కథలో విషయం లేకపోవడం వల్ల సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ తదితర విభాగాలు పనితీరు ఎలివేట్ కాలేకపోయాయి. ఆయా సాంకేతిక నిపుణుల ప్రతిభ గొప్పగా చెప్పుకొనే రేంజ్‌లో లేకపోయాయి.

     ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు తగినట్టే ఉన్నాయి. ముగ్గురు హీరోయిన్లు, ఇద్దరు హీరోయిన్లు, తెర మీద ఎక్కువ క్యారెక్టర్లు కనిపించినా వాటి తీరు చిత్రానికి ప్లస్ కాలేకపోయాయి. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టాల్సి ఉండాల్సింది. ఎమ్మెల్యే లాంటి చిత్రాన్ని అందించిన కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నుంచి ఇలాంటి సినిమాను ఊహించడం చాలా కష్టం.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    సిల్లీ ఫెల్లోస్ చిత్రం నాసిరకమైన రకమైనా హాస్య చిత్రం. రొటీన్ కథ, కథనాలు, కామెడీతో విసుగుపుట్టించే చిత్రమని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్లలో వచ్చే స్పందనను బట్టి సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    నరేష్, సునీల్

    మైనస్ పాయింట్స్
    కథ, కథనాలు
    టేకింగ్
    రొటీన్ కామెడీ
    సినిమాటోగ్రఫి

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: అల్లరి నరేష్‌, సునీల్‌, చిత్ర శుక్ల, నందిని, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, బ్రహ్మానందం
    దర్శకత్వం : భీమినేని శ్రీనివాసరావు
    నిర్మాత : కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి
    సంగీతం : శ్రీ వసంత్‌
    రిలీజ్ డేట్: 2018-09-07

    English summary
    Allari Naresh, Sunil, Bhimaneni Srinivasa Rao ‘s Silly Fellows released on September 7th. It is also releasing in a very good number of screens. All theatrical rights of the film including expenses are valued for more than 5.50 Crores. Nandini Rai, Poorna, Krishna Shukla, Jayaprakash Reddy are lead actors in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X