Simbaa movie Review: సింబా మూవీ రివ్యూ.. అనసూయ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

Rating 2.5/5
మూవీ: సింబా
నటీనటులు: జగపతి బాబు, అనసూయ, వశిష్ట సింహ, శ్రీనాథ్, అనీష్ కురువిల్లా, కస్తూరి, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్ తదితరులు
దర్శకత్వం: మురళీ మనోహర్ రెడ్డి
నిర్మాతలు: సంపత్ నంది, రాజేందర్ సంయుక్త
మ్యూజిక్: కృష్ణ సౌరభ్
రిలీజ్ డేట్: 2024-08-10

టీచర్‌గా పనిచేసే అక్షిక ( అనసూయ) యాక్సిడెంట్‌లో వికలాంగుడైన భర్తకు సేవలు చేసుకొంటూ జీవిస్తుంటుంది. అయితే ఓ రోజు రోడ్డుపై ఓ వ్యక్తిని చూడగానే ఊహించని మార్పుకు గురై అతడిని చంపేస్తుంది. ఈ హత్య కేసును అనురాగ్ (వశిష్ట సింహ), జర్నలిస్టు ఫాజిల్ (శ్రీనాథ్) దర్యాప్తు చేస్తుంటారు. ఈ క్రమంలో మరోసారి అక్షిక మరో వ్యక్తిని చంపడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆ పరిస్థితుల్లో ఆమెతోపాటు ఫాజిల్, డాక్టర్ ఇరానీ (అనీష్ కురువిల్లా) ఓ మార్పుకు గురై ఆ వ్యక్తిని చంపేస్తారు.

Simbaa movie Review in Telugu  Anasuya Bhardwaj steal the show

చీమకు కూడా హాని తలపెట్టని అక్షిక హత్యలకు ఎందుకు పూనుకొన్నది? అనూహ్యంగా వారిలో కలిగిన మార్పుకు కారణం ఏమిటి? వరుస హత్యలను ఎందుకు చేయాల్సి వచ్చింది? వీరికి పర్యావరణ పరిరక్షకుడు పురుషోత్తం రెడ్డి (జగపతి బాబు)కు సంబంధం ఏమిటి? చివరకు వరుస హత్యల వెనుక ఉన్న మోటివేషన్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే సింబా సినిమా కథ.

ఓ ఎమోషనల్ పాయింట్‌తో స్టోరి పాయింట్‌ను ఎంచుకొని దాని చుట్టు రాసుకొన్న పాత్రలు, వాటిని నడిపించిన తీరు దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి ప్రతిభకు అద్దం పట్టింది. కథపై పట్టు సడలకుండా ప్రేక్షకుడిని కనెక్ట్ చేసిన విధానం ఇంకా బాగుంది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కానీ కథను ఎస్టాబ్లిష్ చేయడం, క్యూరియాసిటిని కొనసాగించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం వల్ల అలా అనిపిస్తుంది. మురళీ మనోహర్ రెడ్డి కథ, కథనాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాయి.

Simbaa movie Review in Telugu  Anasuya Bhardwaj steal the show

ఇక అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిన విషయం ఏమీలేదు. ఆమె ఇటీవల కాలంలో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్నారు. అదే కోవలో అక్షిక అనే పాత్ర ద్వారా భావోద్వేగంగా కనిపించారు. పాత్ర పరిధి మేరకు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. జగపతి బాబు‌కు సంబంధించిన సన్నివేశాలు సినిమాకు అత్యంత బలంగా మారాయని చెప్పవచ్చు. ఇక శ్రీనాథ్ మాగంటి, అనీష్ కురువిల్లా, దివి వద్యా, కస్తూరి తమ పాత్రలతో ఆలరించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. కృష్ణ సౌరభ్ మ్యూజిక్ బాగుంది. పలు సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బాగా ఎలివేట్ చేశారు. తెర మీద సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ అందంగా, రిచ్‌గా చిత్రీకరించారు. సంపత్ నంది, రాజేందర్ సంయుక్తం అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

Simbaa movie Review in Telugu  Anasuya Bhardwaj steal the show
సెల్యూలార్ మెమొరీ, బయోలాజికల్ మెమొరీ లాంటి కొత్త పాయింట్స్‌తో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్. ఈ చిత్రంలో పర్యావరణానికి సంబంధించిన మంచి మెసేజ్ ఉంది. దర్శకుడి విజన్, కథపై క్యూరియాసిటినీ కొనసాగించిన విధానం బాగుంది. బీ, సీ కేటగిరి ప్రేక్షకులకు ఈ కథ కొంత రుచిస్తుందా? అనే సందేహం వస్తుంది. ఫస్టాప్ మంచి ఫుల్ జోష్‌తో, సెకండాఫ్ కొంత స్లోగా నడుస్తుంది. కానీ రివేంజ్ డ్రామా బ్యాక్ డ్రాప్‌తో వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. వారాంతంలో అనసూయ, జగపతి బాబు లాంటి యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్ ఇష్టపడే ప్రేక్షకులు ఓ సారి థియేటర్లో చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X