Sing Geetham First Review: సింగ్ గీతం మూవీ ఫస్ట్ రివ్యూ

తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా బ్యానర్‌పై లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం సింగ్ గీతం (Sing Geetham). ఈ చిత్రాని మహానటి, కల్కి సినిమాల దర్శకుడు, జాతిరత్నాలు నిర్మాత నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈ చిత్రంలో అహల్య బమ్రూ, ఆయన్, షాలిని కొండెపూడి, శివ నారాయణ, బెనర్జీ తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫి: అకుంర్ సీ, ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: సంకల్ప్ గోరా,రచన: సింగీతం శ్రీనివాసరావు తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూన్ 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రానికి లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? ఈ చిత్రంపై వస్తు్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Sing Geetham Review by Censor Board

ప్రతాప్ (ఆయన్) అనే యువకుడు మెరుగైన జీవితాన్ని ఆస్వాదించేందుకు మారుమూల ప్రాంతమైన ఓ మిస్టీరియస్ గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామంలో ప్రతీ ఒక్కరు మాటలతో కాకుండా పాటలతో తమ కమ్యూనికేట్ చేసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతాప్‌ను అతీంద్రియ శక్తులు కొన్ని చుట్టుముడుతాయి. సంప్రదాయాలు, నాగరికత, అభివృద్దికి మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమా. మిస్టీరియస్ విలేజ్‌లో మనుషులు పాటలే ఎందుకు పాడుకొన్నారు? ఆ మారుమూల ప్రాంతానికి ప్రతాప్ ఎందుకు వెళ్లాడు? ఆ గ్రామంలో నెలకొన్న మూఢనమ్మకాలు, సంప్రదాయల వల్ల ఆయనకు ఎదురైన అనుభవాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

కమర్షియల్ విలువలకు దూరంగా ఫ్యాంటసీ, మ్యూజికల్, సూపర్ నేచురల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించారు.ఈ సినిమా కథ హానెస్ట్‌గా ఉండటం వల్ల సెన్సార్ టీమ్ పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా స్వల్ప మార్పులు చేర్పులతో ఈ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సినిమా సర్టిఫికేషన్ ప్రకారం.. ఈ చిత్రానికి యూ సర్టిఫికెట్ అందించారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఈ చిత్రాన్ని అన్ని వర్గాల వారు చూడటానికి అవకాశాన్ని కల్పించారు. దాంతో ఈ సినిమా క్లీన్ మూవీ అనే సర్టిఫికెట్‌ను వారు అందించారు. కాంప్లికేటెడ్ సన్నివేశాలు, డైలాగ్స్ లేకుండా వినోదాత్మకంగా ఈ సినిమాను సింగీతం రూపొందించారు అనే టాక్ బయటకు వచ్చింది. యువ టాలెంట్ ఈ కథను పండించేందుకు కృషి చేశారు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ అవుతుంది అని పేర్కొంటున్నారు. ఈ చిత్రం నిడివి 2 గంటల 17 నిమిషాలు అంటే.. 137 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు బజ్ క్రియేట్ కాకపోవడం, ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడం వల్ల రెగ్యులర్ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెద్దగా కనిపించడం లేదు. కంటెంట్ బెటర్‌గా మాట్లాడితే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు క్రమేపి పెరిగే అవకాశం కనిపిస్తున్నది. కొత్త నటీనటులు ఆడియెన్స్ రప్పిస్తారా? 94 ఏళ్ల సింగీతం మళ్లీ మ్యాజిక్ చేస్తారా? దేవీ శ్రీ ప్రసాద్ పాటలు చార్ట్ బస్టర్ అవుతాయా? అనేది విడుదల తర్వాత వచ్చే స్పందనను బట్టి తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం ఫిలింబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X