Singham Again Twitter Review: సింగమ్ అగైన్ ట్విట్టర్ రివ్యూ.. సల్మాన్ మ్యాజిక్ వర్కవుట్ అయిందా?
బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం సింగమ్ అగైన్ (Singham Again). ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాకు అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే, రోహిత్ శెట్టి నిర్మాతలుగా వ్యవహరించారు. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో ఐదో సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా నవంబర్ 1వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాపై నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..
పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనాకపూర్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపిక పదుకోన్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, దయానంద్ శెట్టి, శ్వేతా తివారీ, రవి కిషన్ నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు.

ఇండియన్ సినిమా రంగంలో ఇటీవల కాలంలో ఇంతలా భారీ తారాగణం, సూపర్ స్టార్స్ కలయికలో మూవీ వచ్చిన దాఖలాలు లేవు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ మూవీని సుమారుగా 375 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ సినిమా నిర్మాణ వ్యయం దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
సింగమ్ అగైన్ మూవీ గతంలో పోలీస్ అధికారి పాత్రల్లో నటించిన వారందరూ ఈ సినిమాలో నటించారు. దబాంగ్ సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో రెండు నిమిషాల పాటు అభిమానులకు కనువిందు చేయబోతున్నారు అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అజయ్, అక్షయ్, టైగర్ ష్రాఫ్‌తో కలిసి సల్మాన్ నడిచి వస్తున్నట్టు కనిపించారు.
సింగమ్ అగైన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. నేషనల్ చైన్ మల్టీప్లెక్స్‌లో బుకింగ్ ఓపెన్ కాగానే సుమారుగా 65 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.


Click it and Unblock the Notifications











