Singham Again Review: సింగం అగైన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 3.25/5
మూవీ: సింగం అగైన్
నటీనటులు: అజయ్ దేవగన్, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్ (గెస్ట్ అప్పీయరెన్స్) రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపిక పదుకోన్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, రవికిషన్, శ్వేత తివారీ తదితరులు
దర్శకత్వం: రోహిత్ శెట్టి
కథ: క్షితిజ్ పట్వర్ధన్
నిర్మాతలు: రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే
సినిమాటోగ్రఫి: గిరీష్ కాంత్, రజా హుస్సేన్ మెహతా
ఎడిటింగ్: బంటీ నేగి
మ్యూజిక్: రవీ బస్రూర్ (బీజీఎం), థమన్ ఎస్, రవి బస్రూర్ (పాటలు)
బ్యానర్: రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్, రోహిత్ శెట్టి పిక్చర్స్, దేవగన్ ఫిల్మ్స్, సినెర్జీ
బడ్జెట్: 400 కోట్లు
రిలీజ్ డేట్: 2024-11-01
డీసీపీ బాజీ రావు సింగం (అజయ్ దేవగన్) దేశం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టే ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. దేశంలోనే నిజాయితీ నిక్కచ్చిగా పేరు ఉన్న ఆఫీసర్ మాఫియాకు సింహస్వప్నంగా నిలుస్తాడు. సరిహద్దు మాఫియాను కట్టడి చేసేందుకు ఇండియా లెవెల్‌లో శివ స్క్వాడ్ అనే విభాగాన్ని సింగంతో ఏర్పాటు చేస్తారు. ఇదిలా ఉండగా, రామాయణం కాన్సెప్ట్‌తో సింగం భార్య అవని (కరీనా కపూర్) నాటకాలను ప్రదర్శిస్తుంటుంది. అయితే శ్రీలంకలో ఉండే మాఫియా డాన్ జుబేర్ హఫీజ్ అలియాస్ డేంజర్ లంక (అర్జున్ కపూర్) సింగం భార్య అవనిని రావణాసురుడి మాదిరిగా ఎత్తుకెళ్లడమే కాకుండా కొన్ని కండిషన్లు పెట్టి పూర్తి చేయకపోతే భార్యను చంపేస్తానని సింగానికి డేంజర్ లంక బెదిరింపులకు పాల్పడుతాడు. (Singham Again Review)
జమ్ములో ఓమర్ హాఫీజ్ అరెస్ట్ తర్వాత సింగానికి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి? శివ స్కాడ్ లక్ష్యం ఏమిటి? అవనిని కిడ్నాప్ చేసిన తర్వాత సింబ (రణ్‌వీర్ సింగ్) ఎంట్రీ ఏ పరిస్థితుల్లో జరిగింది? శ్రీలంకలో జుబేర్‌తో పోరాటానికి సూర్యవంశీ (అక్షయ్ కుమార్), శక్తి శెట్టి (దీపిక పదుకోన్) శివ స్క్కాడ్‌లో ఎలాంటి టాస్క్ తీసుకొన్నారు. జుబేర్ హాఫిజ్ పెట్టిన షరతులు ఏమిటి? జుబేర్‌ను శివ స్క్కాడ్ ఎలా ఎదుర్కొన్నది? జుబేర్‌కు ఓమర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? జుబేర్ చెర నుంచి అవనిని ఎలా విడిపించారు అనే ప్రశ్నలకు సమాధానమే సింగం అగైన్ (Singham Again Story) సినిమా కథ.

బాజీరావు సింగంపై ఓమర్ హఫీజ్ (జాకీ ష్రాఫ్) గ్యాంగ్ ఎటాక్‌తో పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కథను మెదలుపెట్టాడు రోహిత్ శెట్టి. ఓమర్ అరెస్ట్‌తో నేరుగా కథలోకి వెళ్లడం, శివ స్క్వాడ్ ఏర్పాటుతో చకచకా కథలోకి వెళ్లడంతో ఆసక్తిగా సీన్లు పరుగులు పెడుతాయి. రామాయణం కథను ముడిపెట్టి రాసుకొన్న స్టోరి, పాత్రలు, రామాయణం సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఉంటాయి. రామాయణం సీన్లతో సింగం అగైన్ కథను నడిపించే విధంగా రాసుకొన్న స్క్రీన్ ప్లే ఫర్‌ఫెక్ట్‌గా వర్కవుట్ అయిందనే చెప్పాలి. అవనిని జుబేర్ అపహరించే భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది.
ఇక సెకండాఫ్‌లో సింబా చేసే అల్లరి మంచి వినోదాన్ని పండించింది. అలాగే దీపిక పదుకోన్ ఫైట్స్, సూర్యవంశీగా అక్షయ్ కుమార్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానమే కాకుండా ఈ పాత్రలన్నీ కథలో జొప్పించిన తీరకు రోహిత్ శెట్టికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. శెట్టి యూనివర్స్‌లో పాత్రలను ప్రవేశపెట్టిన తీరు ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ఇస్తాయి. జుబేర్‌ను ఎదురించే సీన్లు రోహిత్ శెట్టి మార్క్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటాయి.
రామాయణం బేస్ చేసుకొని అల్లుకొన్న కతలో రాముడిగా సింగం పాత్రలో అజయ్ దేవగన్, సీతగా అవని పాత్రలో కరీనా కపూర్, హనుమంతుడిగా రణ్‌వీర్, లక్ష్మణుడు మాదిరి పాత్రలో అక్షయ్ కుమార్, పోలీస్ ఆఫీసర్ పాత్రలో దీపిక పదుకోన్ అన్నీ పాత్రలు చక్కగా కుదిరాయి. ప్రతీ పది నిమిషాలకు ఫ్యాన్ మూమెంట్ ఇచ్చేలా పాత్రలను డిజైన్ చేయడంతో వారికి ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా తేలికైందనే చెప్పాలి. చాలా నేచురల్‌గా అందరూ నటించి బ్లాస్ట్ చేశారు. అజయ్ దేవగన్ మరోసారి సీరియస్, ఎమోషనల్ పాత్రతో లీడ్ తీసుకొన్నాడు. ప్రతీ పాత్రకు ఇంపార్టెంటెన్సే కాకుండా మంచి ఫన్ కూడా ఉంటుంది. రావణుడిగా అర్జున్ కపూర్, విలన్ పాత్రలో జాకీ ష్రాఫ్ తమదైన నటనను ప్రదర్శించి మెప్పించారు.
టెక్నికల్ విషయాలకు వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి ఎప్పటిలానే సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తమన్ తో కలిసి ఆయన అందించిన పాటలు మంచి హై ఇస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చే ఫీల్ మామూలుగా లేదుగా అనిపిస్తుంది. ఇక గిరీష్ కాంత్, రజా హుస్సేన్ మెహతా కలిసి సన్నివేశాలను అద్బుతంగా తెరకెక్కించారు. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు బాగుంది. రోహిత్ శెట్టి సినిమాకు ఉండే నిర్మాణ విలువలు ఈ మూవీలోను హై స్టాండర్డ్‌లో కనిపిస్తాయి.

సినీ అభిమానులు తమ హీరోల నుంచి ఏం ఆశిస్తారనే అంశాలను బేరిజు వేసుకొని రామాయణం కథలోని సీతాపహరణ బ్యాక్ డ్రాప్‌తో రాసుకొన్న పోలీస్ స్టోరీ సింగం అగైన్. రామాయణాన్ని చక్కగా బ్లెండ్ చేయడంలో రోహిత్ శెట్టి ప్రతిభ ఓ పక్క, రణ్‌వీర్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, దీపిక పదుకోన్ పాత్రలు కృతిమంగా అతికించినట్టు కాకుండా కథలో భాగంగా ఎలివేట్ కావడం వారి ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుంది. యాక్షన్, మ్యూజిక్ అంశాలు హైలెట్‌గా నిలిచాయి. సల్మాన్ ఖాన్ కొసమెరుపు అప్పీయరెన్స్ ఫుల్ మీల్స్ తర్వాత మంచి మసాలా పాన్ తిన్న ఫీలింగ్ ఇస్తుంది. యాక్షన్, కామెడీ సినిమాలు ఇష్టపడే వారు థియేటర్లలోకి దూకేయండి.. మంచి ఎనర్జీతో బయటకు వస్తారు.


Click it and Unblock the Notifications











