Single Movie Review: సింగిల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, కల్పలత తదితరులు
దర్శకత్వం: కార్తీక్ రాజు
నిర్మాతలు: విద్యా కొప్పినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరీ
సమర్పణ: అల్లు అరవింద్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫి: ఆర్ వెల్‌రాజ్
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
బ్యానర్:
రిలీజ్ డేట్: 2025-05-09

బ్యాంకులో ఉద్యోగాలు చేసే విజయ్ (శ్రీ విష్ణు), అరవింద్ (వెన్నెల కిషోర్) క్లోజ్ ఫ్రెండ్స్. స్కూల్ లైఫ్ నుంచి అమ్మాయిలకు ప్రపోజ్ చేసినా ప్రయత్నాలు ఫలించావు. జీవితంలో లవర్స్, పార్ట్‌నర్స్ లేకుండా సింగిల్‌గానే గడుపుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో పూర్వ (కేతిక శర్మ) అనే అమ్మాయిని చూసి విజయ్ వెంటపడుతాడు. కానీ విజయ్‌ను ప్రేమించిన హరిణి ( ఇవానా) అతడి లవ్ కోసం వెంటపడుతుంది. ఇదిలా ఉంటే.. గాయత్రి అనే అమ్మాయితో అరవింద్ కూడా ప్రేమలో పడుతాడు.

Single Movie Review

పూర్వ, హరిణి మధ్య విజయ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? తన వెంట పడుతున్న విజయ్‌ ప్రపోజల్‌కు పూర్వ ఎలా రియాక్ట్ అయింది? తన వెనుక పడుతున్న హరిణితో విజయ్ ఎలాంటి రియాక్షన్ ఇచ్చాడు? ఈ ట్రాయాంగిల్ లవ్ గేమ్‌లో ఎవరి ప్రేమను విజయ్ దక్కించుకొన్నాడు? సింగిల్ ట్యాగ్ నుంచి విజయ్, అరవింద్ ఎవరితోనైనా మింగిల్ అయ్యారా? జీవితంలో ఒక్క అమ్మాయితోనైనా ప్రేమలో పడాలనే లక్ష్యాన్ని విజయ్, అరవింద్ చేధించారా? అనే ప్రశ్నలకు ఫన్‌తో ఇచ్చిన సమాధానాలే సింగిల్ సినిమా కథ.

ఒక అమ్మాయి కోసం ఓ యువకుడు ప్రయత్నిస్తుంటే.. మరో అమ్మాయి ఆ యువకుడి వెంటపడటం అనే పాయింట్ చాలా రొటీన్, రెగ్యులర్ పాయింట్‌గానే కనిపిస్తుంది. కానీ దర్శకుడు కార్తీక్ రాజు ఈ పాయింట్‌కు ఇచ్చిన ట్రీట్‌మెంట్, రాసుకొన్న సన్నివేశాలు, అనుసరించిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు బలంగా నిలిచాయి. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ పాత్రల ద్వారా పండించిన వన్ లైనర్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ చాలా చోట్ల బ్రహ్మండంగా పేలాయి. సన్నివేశాలు అలా పరుగులు పెడుతుంటాయి. కానీ కథలో మాత్రం ఎలాంటి కదలిక లేకపోవడం కొంత టెస్టింగ్ టైమ్‌లానే ఉంటుంది. అయితే అలాంటి ఫీలింగ్ నుంచి సెకండాఫ్‌లో మూర్తి (రాజేంద్ర ప్రసాద్) క్యారెక్టర్‌ను తెరపైకి తెచ్చి ఎమోషనల్ కంటెంట్‌ను జొప్పించడంతో కథలో కొద్దిగా చలనం కనిపిస్తుంది. ఇక చివర్లో యంగ్ హీరో, హీరోయిన్ల గెస్ట్ అప్పీయరెన్స్‌తో స్టోరీలో జోష్ పుట్టించడం కొంత రిలీఫ్‌గా ఉంటుంది. చివరి 15 నిమిషాలు రొటీన్ ముగింపు లేకుండా డిఫరెంట్ టచ్‌తో ముగించడం సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చారని చెప్పవచ్చు.

ఇటీవల కాలంలో విభిన్న కథ, విలక్షణమైన పాత్రలతో విజయాలు సాధిస్తున్న శ్రీ విష్ణు మరోసారి డిఫరెంట్ క్యారెక్టర్‌లో చెలరేగిపోయాడు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా రాసిన సన్నివేశాల్లో మస్తుగా ఫన్ క్రియేట్ చేశాడు. శ్రీ విష్ణుకు వెన్నెల కిషోర్ తోడవ్వడంతో మరింత కామెడీ పండింది. సినిమాలో ఈ ఇద్దరు పోటాపోటీగా పంచ్ డైలాగ్స్ వేస్తూ సీన్లను వినోదభరితంగా మార్చారు. ఇక కేతిక శర్మ, ఇవానాకు ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు లభించడంతో వారు కూడా గ్లామర్‌తోపాటు యాక్టింగ్ కూడా బాగా చేశారు. కేతిక గ్లామర్‌తో ఆకట్టుకొంటే.. ఇవానా అదనంగా ఎమోషనల్‌గా ఆకట్టుకొన్నది. ఇక వీటీవీ గణేష్ కూడా తనదైన హాస్యాన్ని పండించాడు. రాజేంద్ర ప్రసాద్ మరోసారి భావోద్వేగమైన పాత్రలో గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు.

సింగిల్ సినిమాకు సంబంధించి టెక్నికల్ విషయాల్లోకి వెళితే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్స్. విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ కామెడీ సీన్లకు చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరింది. వెల్ రాజ్ చిత్రీకరించిన సీన్లు, వాటికి వాడుకొన్న కలర్ ప్యాటర్న్ కారణంగా సన్నివేశాలు బ్యూటిఫుల్‌గా కనిపించాయి. ప్రవీణ్ ఎడిటింగ్, ఆర్ట్స్ వర్క్ విభాగాల పనితీరు బాగున్నాయి. విద్యా కొప్పినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్‌గా సింగిల్ గురించి చెప్పాలంటే.. ఫుల్లుగా కామెడీ, కొంత ఎమోషనల్‌గా సాగే ట్రాయంగిల్ లవ్ స్టోరి. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ చేసిన ఫన్ హంగామా, ఇవానా, కేతిక శర్మ గ్లామర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కథ లేకుండా కామెడీ, స్క్రీన్ ప్లేపైనే ఆధారపడటం మైనస్‌గా అనిపిస్తాయి. థియేటర్‌లో కూర్చొనంత సేపు సరదా, కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు ఉంటాయి. బయటకు వచ్చాక చెప్పుకోవడానికి గొప్పగా ఏ అంశాలు ఉండవు. ఫన్, కామెడీ, లవ్ అంశాలతో ఉండే సినిమాలను ఇష్టపడే వారికి, ముఖ్యంగా యూత్‌కు ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. ఎక్కువగా అంచనాలు వేసుకోకుండా వెళితే.. మంచి ఎంటర్‌టైనర్ చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఫన్ రైడ్‌ను థియేటర్‌లోనే ఎంజాయ్ చేయండి..

More from Filmibeat

Read more about: single sree vishnu ketika sharma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X