twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆకట్టుకునే మాస్‌ చిత్రం

    By Staff
    |

    Simhadri
    -జలపతి గూడెల్లి
    చిత్రం: సింహాద్రి
    నటీనటులు: ఎన్టీఆర్‌, అంకిత, భూమిక, నాజర్‌,
    ముఖేష్‌ రుషి, సీత, భానుచందర్‌, శరత్‌ సక్సేనా
    సంగీతం: కీరవాణి
    నిర్మాత: వి.విజయ్‌ కుమార్‌ వర్మ
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి

    ఎన్టీఆర్‌ కున్న మాస్‌ ఇమేజ్‌ కు తగ్గ కథ, కథనంతో రూపొందిన చిత్రం - సింహాద్రి. సెంటిమెంట్‌, యాక్షన్‌ రెండింటినీ సరైన రీతిలో మేళవించుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి స్క్రీన్‌ ప్లే, టేకింగ్‌ లో చేపిన ప్రతిభ, వైవిధ్యం వల్ల సినిమా ఆకట్టుకుంటుంది. చిత్రం ప్రథమార్థంలో ఉన్నంత గ్రిప్‌, ద్వితీయార్థంలో లేకపోయినప్పటికీ ఈ సీజన్‌ లో వచ్చినవాటిన్నింటిలోనూ ఆకట్టుకునే చిత్రం ఇదే.

    'సమరసింహారెడ్డి' చిత్రంలో మాదిరిగా సెంటిమెంట్‌ ను కథకు, కథనానికి ఆద్యంతం ఉపయోగించుకుంటూ..మాస్‌ పద్దతిలో చిత్రీకరించారు. ప్రథమార్థం అంతా బాగుంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ ను నాజర్‌ దత్తత తీసుకునే ...సీన్‌ నుంచి ఇంటర్వెల్‌ వరకు దర్శకుడు రాజమౌళి చిత్రీకరించిన విధానం చాలా బాగుంది. స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ చిత్రం తర్వాత రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం..ఈ సీన్‌ లతో రాఘవేంద్రరావు 'ఛాయ' నుంచి పూర్తిగా బయటపడినట్లు రుజువు చేసుకున్నాడు. ఎన్టీఆర్‌ నటనలోనూ బాగా పరిణితి వచ్చింది. ముఖ్యంగా సెంటిమెంట్‌ దృశ్యాల్లోనూ, డైలాగ్స్‌ చెప్పే తీరులోనూ అతని నటన బాగా మెరుగుపడింది.

    కథ సింగిల్‌ పాయింట్‌ మీద నడుస్తుంది. తను నమ్ముకున్న వాళ్ళ కోసం చంపేదుకైనా, చచ్చేందుకైనా సిద్దపడడడం తప్పుకాదనే పాయింట్‌ మీద సినిమా తీశారు. ఒక గ్రామంలో పెద్ద రాజా టైప్‌ లో ఉండే నాజర్‌ దంపతులు అనాథ సింహాద్రి(ఎన్టీఆర్‌)ని చేరదీస్తారు. తన ఇంటిలో వాడిగా పెంచుతారు. నాజర్‌ మనవరాలు అంకిత ఎన్టీఆర్‌ ను లైన్‌ లో పెడుతుంది. ఎన్టీఆర్‌ ను పెళ్ళిచేసుకుంటానని మనవరాలు చెప్పడంతో అతన్ని దత్తత తీసుకునేందుకు నాజర్‌ ఏర్పాట్లు చేస్తాడు. అదే రోజు..ఎన్టీఆర్‌ కు, పిచ్చిపిల్ల భూమికకున్న సంబంధం బయటపడుతుంది. భూమికకు డబ్బిచ్చి వదిలేసుకోమని నాజర్‌ చెప్పినా వినకపోవడంతో సింహాద్రిని ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు.

    గోదావరి పుష్కరాలకు వెళ్ళిన సింహాద్రిని చంపేందుకు కేరళ నుంచి కొంతమంది మనుషులు వస్తారు. అక్కడ జరిగిన ఫైట్‌ లో..భూమికకు 'పిచ్చి' కుదురుతుంది. వెంటనే కసిగా వెళ్ళి సింహాద్రిని గొడ్డలితో పొడుస్తుంది. ఎన్టీఆర్‌ ను ఆసుపత్రిలో చేరుస్తారు. ఇక్కడ ప్లాష్‌ బ్యాక్‌. నాజర్‌ కూతురు సీత పాతికేళ్ళ క్రితం భానుచందర్‌ ను ప్రేమించి పెళ్ళిచేసుకొంటుంది. దీంతో నాజర్‌ భానుచందర్‌ ను కొడుతాడు.

    అప్పట్నుంచి వీరి రెండు కుటుంబాలకు రాకపోకలు బంద్‌. వీరు కేరళకి వెళుతారు. అక్కడే స్థిరపడుతారు. సో..వీరిని కలిపేందుకు సింహాద్రి నాజర్‌ కు తెలియకుండా కేరళ వెళుతాడు. అక్కడ తన పని ముగించుకునే..పరిస్థితుల్లో అనుకోకుండా..లోకల్‌ మాఫియాలీడర్‌ తమ్ముడు సీతను చంపుతాడు. దీంతో ఎన్టీఆర్‌ వాడిని చంపుతాడు. ప్రజలు అంతా సింహాద్రికి జేజేలు పలుకుతారు.

    అతన్ని తమ నాయకుడిగా భావిస్తారు. కానీ భూమిక, భానుచందర్‌ లకు ఇది ఇష్టం ఉండదు. వారు..ఎన్టీఆర్‌ ను కేరళలోనే వదిలి వేరే ప్రదేశానికి వెళుతుండగా...మాఫియాలీడర్‌ ముఖేష్‌ రుషి భానుచందర్‌ సూట్‌ కేసులో బాంబు పెడతాడు. ఈ విషయం ఎన్టీఆర్‌ కు తెలిసి...భానుచందర్‌ ను కాపాడేందుకు వెళుతాడు. అప్పటికే అతను ట్రెయిన్‌ ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటాడు.

    సో..వందలాది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఒక్కర్ని చంపినా తప్పులేదన్న నాజర్‌ వ్యాఖ్యను అక్షరాలా పాటించి భానుచందర్‌ ను కాల్చేస్తాడు. షాక్‌ తో భూమికకు పిచ్చిదవుతుంది. భానుచందర్‌ మరణిస్తాడు. మళ్ళీ..ప్లాష్‌ బ్యాక్‌ నుంచి బయటికి వస్తే..అందరికీ సింహాద్రి గొప్పతనం తెలిసి మురిసిపోతుండగా..విలన్‌ ఎంటర్‌ అవుతాడు కేరళనుంచి. ఎంతపెద్ద విలన్‌ అయినా క్లైమాక్స్‌ లో చావాల్సిందే కదా!. హీరో భూమిక, అంకితల ఇద్దరితో సెటిల్‌ అయిపోతాడు.

    కథ, తీసిన విధానం, ఎన్టీఆర్‌ నటన, పాటలు...అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌ బాగుంది. అయితే, కేరళకు వెళ్ళిన తర్వాత కథ గాడితప్పి కాస్తా చికాకును కలిగిస్తుంది. ద్వితీయార్థంలో ఉన్న సగం సీన్స్‌ అసంబద్దంగానే ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా హీరోను చంపేందుకు విలన్‌ వందలాది మంది ప్రజలను టార్చర్‌ చేస్తుంటాడు. దాన్ని కేరళలోని టెలివిజన్‌ లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తుంటుంది..అదేదో క్రికెట్‌ మ్యాచ్‌ లాగా. అయినా, అక్కడి అధికార యంత్రాంగం ఉలుకు, పలుకు లేకుండా కూర్చుంటే..హీరో ఈ లైవ్‌ టెలికాస్ట్‌ ను చూసి...వాడిని చంపేందుకు వెళ్ళడం ..చాలా అర్ధరహితం.

    కీరవాణి సంగీతం, రవీంద్ర ఫోటోగ్రఫీ సినిమాకు ముఖ్యంగా హైలెట్‌ అనే చెప్పవచ్చు. రమ్యకృష్ణ పాట అనవసరం. భూమిక, అంకితలిద్దరూ బాగానే అందాలు ఆరబోశారు. అంకిత ఇక గ్లామర్‌ గాల్‌ గా స్థిరపడవచ్చు. ఎన్టీఆర్‌ ఇమేజ్‌ కు తగ్గ చిత్రమిది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X