twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శూన్యరాశి!

    By Staff
    |

    Simha Rasi
    -జలపతి
    చిత్రం: సింహరాశి
    నటీనటులు: రాజశేఖర్‌, సాక్షిశివానంద్‌, విజయకుమార్‌,
    గిరిబాబు, అచ్యుత్‌, వర్ష.
    సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌
    సినిమాటోగ్రఫీ: శ్యాం.కె.నాయుడు
    మాటలు: పరుచూరి బ్రదర్స్‌
    నిర్మాత: ఆర్‌.బి.చౌదరి
    దర్శకత్వం: సముద్ర

    హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసేందుకు చేసిన ప్రయత్నం మినహా ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ అంశం ఏమీ లేదు. చిత్రం ప్రారంభం నుంచి క్లైమాక్స్‌ వరకు అంతా అదే. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి టైప్‌ లో ఈ చిత్రంలో 'హీరో'ను హీరోగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. సింహారాశిలో పుట్టిన రాజశేఖర్‌ 'గొప్పతనం' చిత్రం మొదటి సీన్‌ లోనే చెప్పుతారు. చివరి వరకూ అన్నీ సీన్స్‌ ఆ గొప్పతనాన్ని చెప్పేందుకు ఉన్నట్లుగా అనిపిస్తాయి. చిత్రంలో చివరికి మలుపు తిరిగే ఆధారం కూడా అలానే ఉండడం విశేషం. రాజులు, చౌదరిలు, నాయుడులు, రెడ్డిలు ఇలా అగ్రవర్గాల తోకలు తగిలించి ప్యూడల్‌ ధోరణులను పెంచి పోషిస్తోన్న తెలుగు సినిమాల జాబితాలో ఇదో మరో చిత్రం.

    తమిళ యువకుడు సముద్ర ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారాడు. 'సమ సమాజం' కావాలంటూ ద్రవిడ ఉద్యమం జరిపిన నేల నుంచి వచ్చిన ఇలాంటి యువకులు చివరికి వ్యక్తి పూజ గొప్పదని చాటే చిత్రాలు తీస్తున్నారు. నరసింహనాయుడు చిత్రంలో 'కంటి చూపుతో చంపుతా' వంటి డైలాగులు రాసిన పరచూరి బ్రదర్స్‌ ఇందులోనూ అలాంటి మాటలే రాసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. 'నిన్ను చంపేందుకు కత్తులు అవసరం లేదురా! గోళ్ళు చాలు' అని రాజశేఖర్‌ చేత పలికించారు. కానీ అది కథకు అనుగుణంగా లేకపోవడంతో పేలలేదు.

    నరసింహరాజు(రాజశేఖర్‌) తూర్పుగోదావరి జిల్లాలోని దేవునీపట్నం ప్రాంతంలో రారాజు. ఆయన చెప్పిన మాటను చుట్టుపక్కల 50 మండలాల్లో అందరూ వింటారు. ఆయన దేవుడులాంటి వ్యక్తి. ఎంత ఆస్తి ఉన్నా మామూలు బట్టలు ధరించి పూరి గుడిసెలోనే ఉంటాడు. ఇలాంటి మంచి వ్యక్తి అన్ని మంచి పనులు చేస్తూనే ఉంటాడు. ఇంతలో మరదలు వరసయ్యే సాక్షిశివానంద్‌ వస్తుంది ఊళ్ళోకి. ఈయన మంచితనం తెలుసుకొని ప్రేమిస్తుంది. కానీ ఆడవాళ్ళలో అమ్మలను, చెల్లెలను మాత్రమే చూసుకునే వ్యక్తి రసింహరాజు. అందుకని తన ప్రేమను మరిచిపొమ్మని సలహా ఇస్తాడు. కారణం ఏమిటంటే..ఓ ఫ్లాష్‌ బ్యాక్‌ చెప్పుతాడు.

    40, 50 ఏళ్ళ క్రితం నరసింహరాజు పుడుతాడు. అప్పుడు కుష్టువ్యాధికి మందులు ఉండేవి కావు. అందుకని ఈ రాజును వాళ్ళ అమ్మ ముట్టుకోదు. ముట్టుకుంటే ఈ వ్యాధి తన కొడుకుకు కూడా అంటుకుంటుందని భయపడుతుంది. చివరికి చనిపోతుంది. అమ్మ స్పర్శ, ముఖం కూడా ఎరుగని రాజు అమ్మకోసం తపిస్తుంటాడు. అందుకని అందరిలోనూ అమ్మనే చూసుకుంటాడు. చివరికి సాక్షిని చేసుకుంటాడా లేదా? అనేదే క్లైమాక్స్‌.

    హీరోయిజాన్ని చూపించేందుకు మధ్యలో ఎన్ని ఉపకథలున్నా మొత్తమ్మీద ఈ సినిమా కథ ఇది. రాజశేఖర్‌ గెటప్‌ బాగుంది. కాకపోతే ఇలాంటి నటనను ఎన్నోసార్లు చూశాం. సాక్షిశివానంద్‌ ఈ సినిమాలో చాలా అందంగా ఉంది. ఎమ్మెస్‌ నారయణ, బ్రహ్మనందం, కోవైసరళ కామెడీ ట్రాక్‌ నవ్వించినా అది అర్దాంతరంగా ఆగిపోతుంది. ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌ సంగీతం మరీ పేలవం. సముద్ర డైరక్షన్‌ ఫర్వాలేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X