Dhanush's Sir Review ‘ధనుష్’ సింపుల్ అండ్ సూపర్బ్.. కార్పోరేట్ ఎడ్యుకేషన్ మాఫియాపై ఎటాక్!

Rating:
3.0/5
Star Cast: Dhanush, Samyuktha, Hyper Aadi
Director: Venky Atluri

నటీనటులు: ధనుష్, సంయుక్త, సంయుక్త, సాయికుమార్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, హరీష్ పేరడి, ఆడుక్కాలమ్ నరేన్, మహేష్ తదితరులు
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, సౌజన్య
సినిమాటోగ్రఫి: జే యువరాజ్
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్
రిలీజ్ డేట్: 2023-02-17

సార్ కథ ఏమిటంటే?

సార్ కథ ఏమిటంటే?

త్రిపాఠి విద్యాసంస్థల అధినేత త్రిపాఠి (సముద్రఖని) కాలేజీలో బాల గంగాధర తిలక్ అలియాస్ బాలు (ధనుష్) లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. అయితే మధ్య తరగతి కుటుంబాలను టార్గెట్‌గా చేసి విద్యను వ్యాపారంగా భావించే త్రిపాఠి ప్రభుత్వ కళాశాలను తన ఆధీనంలోకి తీసుకొని.. అక్కడికి నాసిరకంగా లెక్చరర్లను నియమించి గ్రామీణ ప్రాంత విద్యార్థుల జీవితాలను నాశనం చేయాలని కుట్ర పన్నుతాడు. త్రిపాఠితో మీటింగ్ సందర్భంగా తనకు కేటాయించిన సిరిపురం కాలేజీలో విద్యార్థులందర్నీ పాస్ చేస్తే ప్రమోషన్ ఇస్తావా? అని ప్రశ్నిస్తాడు. దాంతో నీ కాలేజీలో విద్యార్థులందరిని పాస్ చేయిస్తే.. నా కార్పోరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్‌గా ప్రమోట్ చేస్తానని త్రిపాఠి సవాల్ విసురుతాడు,

సార్ కథలో ట్విస్టులు

సార్ కథలో ట్విస్టులు


సిరిపురం కాలేజీలో నియమించిన బాలుకు ఎదురైన సమస్యలు ఏమిటి? సిరిపురం గ్రామంలో చదువుకు దూరమైన విద్యార్థులను కాలేజీకి బాలు ఎలా రప్పించాడు? సిరిపురం కాలేజీలో బయోలాజి లెక్చరర్ మీనాక్షి (సంయుక్త)తో ఎలా ప్రేమలో పడ్డాడు? కాలేజీలో విద్యార్థులను పాస్ కాకుండా ఫస్ట్ క్లాస్‌లో పాస్ చేయించిన బాలుపై త్రిపాఠి విద్వేషం ఎందుకు పెంచుకొన్నాడు? త్రిపాఠి పన్నిన కుట్రకు బలైన బాలు ఎలా ప్రతిఘటించాడు? బాలు జీవితంలో కీలకమైన వ్యక్తి ఏఎస్ మూర్తి (సుమంత్) ఎవరు? సిరిపురం విద్యార్థులకు బాలు ఎలాంటి స్పూర్తిని అందించాడు అనే ప్రశ్నలకు సమాధానమే సార్ సినిమా కథ.

ఫస్టాఫ్‌ ఎనాలిసిస్

ఫస్టాఫ్‌ ఎనాలిసిస్

పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎలాంటి త్యాగాలకు పాల్పడుతారనే ఎమోషనల్ ఎపిసోడ్‌తో సార్ కథ మొదలవుతుంది. వీడియో లైబ్రరీలో దొరికిన క్యాసెట్స్ ఆధారంగా ఏఎస్ మూర్తిని వెతుక్కొంటూ వెళ్లిన సిరిపురం పిల్లలకు బాలు రూపంలో ట్విస్ట్ తెలుస్తుంది. అక్కడి నుంచి బాలు పాయింట్ ఆఫ్ వ్యూలో కథ భావోద్వేగంగా సాగుతుంది. ఫస్టాఫ్‌లో చాలా హర్ట్ టచింగ్ అంశాలు, ఎమోషనల్ పాయింట్స్, మధ్య తరగతి కుటుంబాలపై కార్పోరేట్ కళాశాల విధ్వంసం లాంటి అంశాలను టచ్ చేస్తూ సినిమా ఫస్టాఫ్ ముగుస్తుంది.

సెకండాఫ్‌ ఎలా సాగిందంటే?

సెకండాఫ్‌ ఎలా సాగిందంటే?

ఇక సెకండాఫ్‌కు వచ్చే సరికి ఎమోషనల్ పాయింట్ చుట్టే కథ తిరిగినా.. దర్శకుడు కథను మరో రెంజ్‌కు తీసుకెళ్లడంలో దర్శకుడు తడబాటు పడ్డాడు. అయితే స్క్రిప్టులో లోపాలు ఉన్నప్పటికీ.. వాటిని ట్రాక్‌లోకి లాగి ధనుష్ వాటిని తన ఫెర్ఫార్మెన్స్‌తో సవరించారని చెప్పవచ్చు. విద్యార్థులను మోటివేట్ చేసిన విధానం, వీడియో కాన్పరెన్స్ ద్వారా విద్యాబోధన ఆకట్టుకొనే అంశాలుగా కనిపిస్తాయి. అయితే ఎమోషనల్‌గా సాగే కథను మ్యాజిక్ చేసే మూమెంట్స్ లేకుండా ధనుష్ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ సినిమాను ముగించడం రొటీన్ క్లైమాక్స్ అనిపిస్తుంది.

ధనుష్ వన్ మ్యాన్ ఆర్మీ

ధనుష్ వన్ మ్యాన్ ఆర్మీ


ధనుష్ ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సార్ సినిమాకు కర్త, కర్మ, క్రియ అతడేనని చెప్పవచ్చు. కథ మొదలైనప్పటి నుంచి చివరి ఫ్రేమ్ వరకు సన్నివేశాలను తన మార్క్ నటనతో పరుగులు పెట్టించాడు. ఓవరాల్‌గా ఈ సినిమాకు వన్ మ్యాన్ ఆర్మీగా నిలిచారు. ఇక సంయుక్త కథకు బలంగా మారిన పాత్రలో తన వంతు సహకారం అందించింది. భీమ్లా నాయక్ తర్వాత మరోసారి మంచి పాత్రతో ఆకట్టుకొన్నది. సుమంత్ ఈ సినిమాలో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. సీతారామం తర్వాత మరో భావోద్వేగమైన పాత్రతో మెప్పించాడు.

మిగితా కారెక్టర్ల గురించి

మిగితా కారెక్టర్ల గురించి


సార్ సినిమాలో సాయికుమార్, తనికెళ్ల భరణి, హరీష్ పెరాడీ, అడుక్కాలమ్ నరేష్ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సాయికుమార్ మరో ఇంపార్టెంట్ పాత్రతో మెప్పించాడు. హైపర్ ఆది ఉన్నంత సేపు నవ్వులు పూలు పూయించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?


సాంకేతిక విభాగాల విషయానికి వస్తే... జీవి ప్రకాశ్ సంగీతం సార్ సినిమాకు స్ట్రాంగ్ పిల్లర్‌గా నిలిచారు. పలు సన్నివేశాలను బీజీఎంతో అద్బుతంగా పండించాడు. ఇక సినిమాటోగ్రాఫర్ యువరాజ్ మరోసారి సినిమాను అందంగా తీర్చిదిద్దారు. ఎడిటింగ్ విషయంలో నవీన్ నూలి తన పనిని సజావుగా ముగించారు. నాగవంశీ నిర్మాతగా సితార, ఇతర బ్యానర్లు అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

ఫైనల్‌గా సార్ ఎలా ఉందంటే?

ఫైనల్‌గా సార్ ఎలా ఉందంటే?


ప్రస్తుతం సమాజంలో విద్య అనే కుటుంబాల బలహీనతను ఆసరగా చేసుకొని కార్పోరేట్ కళాశాలలు సాగించే అక్రమ దందాలు, మాఫియా కార్యక్రమాలపై సంధించిన విమర్శనాస్త్రం సార్. ర్యాంకుల కోసం సాగించే అవినీతి బాగోతాలు, గ్రామీణ ప్రాంతాల్లో కులం, వివక్ష అంశాలను తెరపైన చక్కగా చూపించారు. నాగరిక ప్రపంచంలోని వ్యత్యాసాలను ఎండగడుతూ విద్య ప్రాముఖ్యతను చాటిచెప్పే చక్కటి సందేశాన్ని అందించిన చిత్రం సార్. ధనుష్ తప్ప మరొకరు ఈ రేంజ్‌లో చేయడం కష్టమనే విధంగా బాలు పాత్రను అద్బుతంగా పండిచారు. ప్రతీ కుటుంబం చూడాల్సిన చిత్రమని చెప్పవచ్చు. ఎమోషనల్ సీన్లతో గుండె బరువెక్కిస్తుంది.. మదిని ఊగిసలాటకు గురిచేస్తుంది. స్క్రిప్టు, టెక్నికల్‌గా కొన్ని లోపాలు ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పవచు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X