Sirai Twitter Review: సిరాయి తమిళ మూవీ ట్విట్టర్ రివ్యూ
తమిళంలో టాలెంటెడ్ యాక్టర్ విక్రమ్ ప్రభు హీరోగా నటించిన యాక్షన్, థ్రిల్లర్ సిరాయి. ఈ మూవీని సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సురేష్ రాజకుమారి తొలి చిత్ర దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఎల్‌కే అక్షయ్ కుమార్, ఆనంద తంబిరాజ, అనీషా అనిల్ కుమార్, హరీష్ శంకర్ నారాయణ్, రమ్య సురేష్, సిజు విల్సన్ తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే... మాదేష్ మాణిక్యం సినిమాటోగ్రఫిని, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్, జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ విభాగాలను పర్యవేక్షించారు. ఈ సినిమాకు తమిజ్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. వెంకట్ ప్రభుతో కలిసి తమిజ్ పనిచేయడం ఇది రెండోసారి. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్లు ఇటీవల చెన్నైలో ప్రదర్శించారు. ఈ సినిమా గురించి క్రిటిక్స్, నెటిజన్లు ఎలా స్పందించారనే విషయంలో వెళితే..

సిరాయ్ మూవీ గురించి క్రిటిక్ రమేష్ బాలా ట్వీట్ చేస్తూ.. ఈ సినిమా పవర్‌ఫుల్‌గా ఉంది. ఎమోషనల్‌గా కదిలించేస్తుంది. పోలీస్ దర్యాప్తు నేపథ్యంగా వచ్చిన ఎక్సలెంట్ థ్రిల్లర్, డ్రామా. దేశంలో ఖైదీల విచారణ గురించి స్పష్టంగా చెప్పిన చిత్రం. మతపరంగా మైనారిటీలను మన సమాజం, న్యాయవ్యవస్థ ఎలా చూస్తుందనే విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు. విక్రమ్ ప్రభు కానిస్టేబుల్‌గా జీవించాడు. అనిష్మా, అక్షయ్ కుమార్ యాక్టింగ్ బాగుంది. జస్టిన్ ప్రభాకర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు వెన్నుముకగా నిలిచాయి. ఈ సినిమాను తప్పకుండా చూడాలని నేను రికమెండ్ చేస్తున్నాను అని అన్నారు.
అధిక్ రవిచంద్రన్ ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. ఇంటెన్సిటీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే మూవీ సిరాయి. సినిమా మొదటి సన్నివేశం నుంచి చివరి సీన్ వరకు వెంకట్ ప్రభు అద్బుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. మీ కెరీర్‌లో 25వ చిత్రంగా నిలిచిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలబోతున్నందుకు కంగ్రాట్స్. ఈ ఇంటెన్స్ ఫిలింలో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి అని అన్నారు.
సిద్దార్థ్ శ్రీనివాసన్ ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. విపత్కర పరిస్థితుల్లో నిజాయితీ కూడిన పోలీస్ కానిస్టేబుల్, విచారణ ఖైదీ సంబంధించిన కాన్సెప్ట్ ఎక్సలెంట్‌గా ఉంది. ఖైదీ, కానిస్టేబుల్ మధ్య అనురాగాలు, ఆప్యాయత కట్టిపడేస్తుంది. థ్రిల్లింగ్ మూమెంట్స్, టెన్షన్‌తో కూడిన అంశాలు ఈ సినిమాకు బలంగా కనిపిస్తాయి. దర్శకులు సురేష్ రాజకుమారి ఈ సినిమాను తెరకెక్కించినందుకు ప్రశంసలు, అభినందనలు తెలియజేయాలి. ఆర్టిస్టుల నుంచి ప్రతిభను రాబట్టుకొన్న విధానం హైలెట్ అని తన సుదీర్ఘమైన ట్వీట్‌లో పేర్కొన్నారు.
సిరాయి చిత్రం గుండెను బరువెక్కించే, భావోద్వేగంతో కుదిపే సినిమా. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి పోలీస్ దర్యాప్తు చిత్రం. తప్పుకుండా ఈ సినిమాను థియేటర్‌లోనే చూడాలి. మీకు క్లారిటీతో కూడిన రివ్యూను త్వరలోనే అందిస్తాను అంటూ నెటిజన్ ట్వీట్ చేశాడు.
సిరాయి చిత్రంలో బ్యూటీ ఏమిటంటే.. ఓ ప్రేక్షకుడిలా ఆలోచించి దర్శకుడు కథను తెరకెక్కించిన విధానం. గొప్ప దర్శకుడిగా ఈ సినిమా కథను చెప్పాలనే ప్రయత్నం చేయలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ కథను తన మనసుకు హత్తుకొంటాడు. విక్రమ్ ప్రభు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలోని పాత్ర ద్వారా తన ప్రతిభకు నిలువెత్తు అద్దంలా నిలిచాడు అని క్రిటిక్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











