twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీత మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. కాజల్ అగర్వాల్ సోలో ఫెర్ఫార్మెన్స్‌తో

    |

    Recommended Video

    Sita Movie Review And Rating || సీత మూవీ రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

    Rating:
    2.0/5
    Star Cast: సాయి శ్రీనివాస్ బెల్లంకొండ, కాజల్ అగర్వాల్, మన్నార చోప్రా
    Director: తేజ

    అప్పట్లో చిత్రం, జయం మొన్నీ మధ్య నేనే రాజు నేనే మంత్రి లాంటి విభిన్నమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు తేజ, అందం, అభినయంతో మెప్పిస్తున్న కాజల్ అగర్వాల్, యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సీత. హీరోయిన్‌ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో వచ్చిన ఈ చిత్రం టైలర్లు, టీజర్లు సినిమాపై క్రేజ్‌ను పెంచాయి. రొటీన్‌కు భిన్నంగా హీరో సాయి శ్రీనివాస్ విభిన్నమైన పాత్రలో పోషించాడనే మాట వినిపించింది. ఈ క్రమంలో దర్శకుడు తేజకు ఈ చిత్రం మరో మంచి విజయాన్ని అందించిందా? హీరోయిన్ ఓరియెంటెడ్‌ మూవీతో కాజల్ ఆకట్టుకొన్నదా? యువ హీరో సాయి శ్రీనివాస్‌కు విభిన్నమైన పాత్రతో ఆకట్టుకొన్నారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమాను సమీక్షించాల్సిందే.

    సీత మూవీ కథ

    సీత మూవీ కథ

    సీత (కాజల్ అగర్వాల్) స్వతంత్ర భావాలు కలిగిన యువతి. డబ్బు సంపాదన తప్ప మరొకటి పట్టని అహంకారి. రామ్ (బెల్లంకొండ శ్రీనివాస్) భూటాన్‌లోని బౌద్దాహారంలో పెరిగిన యువకుడు. సీతకు మేనబావ అవుతాడు. డబ్బు సంపాదన ఆపేక్షతో ఊగిపోయే సీత కొన్ని కష్టాల్లో కూరుకుపోతుంది. ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి ఎమ్మెల్యే బసవరాజ్( సోను సూద్) సహాయాన్ని కోరుతుంది. అయితే నెలపాటు తనతో సహజీవనం చేస్తే సమస్యల నుంచి గట్టెక్కిస్తానని బసవరాజ్ షరతు పెట్టడంతో దానికి సీత సరే అంటుంది. ఆ విషయం బసవరాజ్‌, సీతకు మధ్య గొడవకు కారణమవుతుంది. దాంతో భూటాన్‌లో ఉన్న రామ్ సహాయం అవసరం అవుతుంది.

    సీత కథలోని మలుపులు

    సీత కథలోని మలుపులు

    భూటాన్‌లోని బౌద్దహారంలో రామ్ ఎందుకు పెరుగుతాడు? సీత, రామ్ వేర్వేరుగా ఎందుకు ఉంటారు? సహజీవనం విషయంలో బసవరాజ్, సీత మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? డబ్బు కోసం సీత ఎలాంటి కష్టాల్లో కూరుకుపోయింది. తన మామ (భాగ్యరాజ్)కు ఇచ్చిన మాటను రామ్ ఎలా నిలబెట్టుకొన్నాడు? సీత కళ్లలో ఆనందం చూడటానికి రామ్ ఎలాంటి త్యాగాలకు సిద్ధపడ్డాడు అనే ప్రశ్నలకు సమాధానమే సీ మూవీ కథ.

    ఫస్టాఫ్‌లో

    ఫస్టాఫ్‌లో

    అహంకారం, మొండితనం, లెక్కలేనితనం లాంటి మనస్తత్వంతో ఉన్న ఓ యువతి మంచి లక్షణాలు ఉన్న సీతగా ఎలా మారిందనే సింగిల్ పాయింట్ చుట్టు అల్లుకొన్న కథ ఇది. పెంకిపిల్లగా, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే దూకుడుతనం ఉన్న పాత్రను దర్శకుడు తన విజన్‌కు అనుకూలంగా ఎస్టాబ్లిష్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కాకపోతే కథ చెప్పే క్రమంలో పేలవమైన సన్నివేశాలు సినిమాకు అవరోధంగా మారాయి. సీరియస్‌ నోట్‌లో కథ చెప్పేటప్పడు బిత్తిరి సత్తి లాంటి ఎపిసోడ్స్ కథలో ఉండే ఇంటెన్సిటీని దెబ్బతీసే విధంగా మారాయి. ఇక సహజీవనం, కోరిక తీర్చే అంశాలను కథకు బలంగా మారకపోగా మరింత బలహీనం చేశాయి.

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    ఇక రెండో భాగంలో రామ్ పాత్రను హైలెట్ చేసేందుకు కమర్షియల్ వైపు మొగ్గడం.. అందుకోసం ఊహకు అందని ఫైట్లు పెట్టడం, సగటు ప్రేక్షకుడు జీర్ణించుకోలేని సన్నివేశాలను జొప్పించడం సినిమాకు ప్రతికూలంగా మారాయి. ఇక నెమ్మదిగా సినిమా కథ చెప్పే విధానం ప్రేక్షకుడిని సహనానికి పరీక్ష పెట్టింది. రామ్ క్యారెక్టర్ నిమిషానికో విధంగా ప్రవర్తించడం అంతు పట్టకుండా ఉంటుంది. సినిమా నిడివి ప్రేక్షకుడి ఓపికకు మరో పరీక్ష. ఇక క్లైమాక్స్ విషయంలో అసందిగ్థత వెంటాడినట్టు కనిపిస్తుంది.

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    బలమైన పాయింట్‌తో కథలను అల్లుకోవడంలో దర్శకుడు తేజది ప్రత్యేకమైన పంథా. అయితే కథను నడిపించేందుకు కావాల్సిన అంశాలను బలంగా రూపొందించలేకపోవడం ఈ సినిమాకు ప్రధానమైన ప్రతికూలంగా మారింది. అహంకారంతో ఉన్న యువతి, మంచి లక్షణాలున్న యువకుడు.. మధ్యలో ఓ దుష్టుడు ఇలాంటి ట్రాయంగిల్ కథను ప్రేక్షకుడిని కట్టిపడేసే విధంగా చెప్పలేకపోయాడనే చెప్పవచ్చు. కాకపోతే ప్రతీ పాత్రను వేర్వేరుగా చూస్తే బలంగా కనిపిస్తాయి. టోటల్‌గా వాటిని కలిపి సన్నివేశాలుగా చూస్తే పస కనిపించదు. కాకపోతే కథనంలో పస లేకపోవడం, అనవసరపు హంగులకు ప్రయత్నించడం వల్ల అసలుకే ఎసరు పెట్టినట్టుగా అనిపిస్తుంది. మంచి కథను సరిగా చెప్పలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది.

    కాజల్ అగర్వాల్ నటన

    కాజల్ అగర్వాల్ నటన

    తన కెరీర్‌లో కాజల్ అగర్వాల్‌‌కు పూర్తి స్థాయి నటనకు స్కోప్ ఉన్న చిత్రం సీత. సీత పాత్రలోని పలు రకాల షేడ్స్‌ను అవలీలగా పోషించారు. పొగరు, లెక్కలేనితనం లాంటి అంశాలతో కూడిన పాత్రకు కాజల్ న్యాయం చేసిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయి పాత్రను తన భుజాల మీద మోసే సామర్థ్యం సీత సినిమా ద్వారా గుర్తించవచ్చు. తన పాత్ర పరిధి మేరకు కాజల్ ఒకే అనిపించేలా నటించింది.

    సాయి శ్రీనివాస్ ఫెర్ఫార్మెన్స్

    సాయి శ్రీనివాస్ ఫెర్ఫార్మెన్స్

    సాయి శ్రీనివాస్‌ను ఇప్పటి వరకు కమర్షియల్ హీరోగానే చూశాం. కానీ సీత సినిమాలో ఓ విభిన్నమైన పాత్రలో కనిపించడానికి తీసుకొన్న నిర్ణయాన్ని అభినందించాలి. కాకపోతే ఆ పాత్రను పరిపూర్ణంగా మలచడంలో లోపాలకు అతడిని బాధ్యుడిని చేయడం సరికాదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఒకే రకమైన ఫీలింగ్‌తో తెరపైన కనిపించిన శ్రీనివాస్‌కు రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకొన్నాడు. ఈ పాత్ర విషయంలో మరింత జాగ్రత్త పడి ఉంటే శ్రీనివాస్ కెరీర్‌లో గొప్పగా నిలిచిపోయే పాత్ర అయి ఉండేదేమో.

    సోనూసూద్ యాక్టింగ్ గురించి

    సోనూసూద్ యాక్టింగ్ గురించి

    కామంతో రగిలిపోయే ఎమ్మెల్యే పాత్రలో సూనుసూద్ నటించాడు. అందవిహీనంగా ఉన్న భార్యతో ఇష్టంగా సంసారం చేయలేక.. అందగత్తె సీతతో ఎలాగైనా కోరిక తీర్చుకోవాలనే కసితో రగిలిపోయే పాత్రకు సోనుసూద్ న్యాయం చేశాడని చెప్పవచ్చు. కొన్నిసార్లు అతిగా నటింంచాడనిపిస్తుంది. కాకపోతే క్లైమాక్స్‌లో అతని పాత్ర కొంత ఓవరాక్షన్‌గా అనిపిస్తుంది.

     ఇతర పాత్రల్లో

    ఇతర పాత్రల్లో

    ఇక సీత చిత్రంలో మన్నారా చోప్రా, భాగ్యరాజ్, బిత్తిరి సత్తి, తనికెళ్ల భరణి లాంటి పాత్రలు కనిపిస్తాయి. మన్నారా చోప్రా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. భాగ్యరాజ్ పాత్ర కొంత సెంటిమెంట్ పడిస్తుంది. బిత్తిరి సత్తి కామెడీ వెగటు పుట్టిస్తుంది. ఇక తనికెళ్ల భరణి పాత్ర చాలా బాగుంది. సోనుసూద్‌కు సహాయకుడిగా నటించాడు. సోనుసూద్‌పై వేసే సెటర్లు, పంచ్‌లు ఆకట్టుకొంటాయి. కథకు న్యాయం చేసే పాత్రలో తనికెళ్ల భరణి నటించాడు. మహేష్ ఆచంట, అభిమన్యు సింగ్ ఫర్వాలేదనిపించారు.

    సినిమాటోగ్రఫి, ఇతర విభాగాలు

    సినిమాటోగ్రఫి, ఇతర విభాగాలు

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి బాగుంది. సిర్షా రే సినిమాటోగ్రఫి ఆకట్టుకొనేలా ఉంది. కాంబోడియా లాంటి లోకేషన్లను అద్భుతంగా తెరకెక్కించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. ఈ సినిమాకు నిడివి ప్రధానమైన లోపం. లక్ష్మీ భూపాల్ అందించిన మాటలు తూటల్లా పేలాయి. వాటికి తోడు బలమైన సన్నివేశాలు ఉంటే బాగుండేదేమో.

    మ్యూజిక్, ఫైట్స్

    మ్యూజిక్, ఫైట్స్

    మహానటి లాంటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన అనూప్ రూబెన్ మళ్లీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పాటలు వినగానే ఇష్టపడే విధంగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆర్ట్ వర్క్ ఫర్వాలేదు. కనల్ కన్నన్ ఫైట్స్ బాగున్నాయి. కానీ కథకు సరితూగే విధంగా లేకపోవడం, అతిగా ఉండటం మరో మైనస్. కథకు తగినట్టుగా ఫైట్స్ కంపోజ్ చేస్తే బాగుండేదేమో.

     ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ఎకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని రూపొందించారు. పాత్రలకు నటీనటుల ఎంపిక, లోకేషన్లు బ్యానర్ అభిరుచికి అద్దంపట్టాయి. సినిమా లుక్ వైజ్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది. కథ, కథనాలపై మరింత దృష్టిపెడితే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది.

    తుది తీర్పు

    తుది తీర్పు

    రామాయణం కథను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా తీర్చి దిద్దిన కథ అనిచెప్పవచ్చు. బలమైన పాయింట్‌ను స్క్రిన్ ప్లే, లెంగ్త్, మ్యూజిక్ ఇతర అంశాలు ప్రతికూలంగా మారాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను ఇష్ణపడే వారికి నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరితే సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కావడానికి అవకాశం ఉంది.

     బలం, బలహీనత

    బలం, బలహీనత

    ప్లస్ పాయింట్స్
    కాజల్ అగర్వాల్
    సినిమాటోగ్రఫి
    డైలాగ్స్

    మైనస్ పాయింట్స్
    కథనం
    నిడివి
    పాటలు

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    తెర ముందు, తెర వెనుక
    నటీనటులు: కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్, సోనుసూద్, మన్నారా సూద్, అభిమన్యు సింగ్, పాయల్ రాజ్‌పుత్ తదితరులు
    దర్శకత్వం: తేజ
    నిర్మాత: అనిల్ సుంకర
    మ్యూజిక్: అనూప్ రూబెన్
    సినిమాటోగ్రఫి: సిర్షా రే
    ఎడిటింగ్: వెంకటేశ్వర రావు కోటగిరి
    రిలీజ్: 2019-05-24

    English summary
    Bellamkonda Sreenivas latest movie is Sita. He has been paired second time after Kavacham. This movie directed by Teja. This movie set to release on May 24th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X