Sitaare Zameen Par Review: సితారే జమీన్ పర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: అమీర్ ఖాన్, జెనీలియా దేశ్‌ముఖ్, నిఖత్ ఖాన్ తదితరులు
దర్శకత్వం: ఆర్ఎస్ ప్రసన్న
రచన: దివ్య్ నిధి శర్మ
నిర్మాత: అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్
సినిమాటోగ్రఫి: జీ శ్రీనివాస్ రెడ్డి
ఎడిటింగ్: చారు శ్రీ రాయ్
మ్యూజిక్: శంకర్, ఎహసాన్, లాయ్, రామ్ సంపత్ (బీజీఎం)
బ్యానర్: అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2025-06-20

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. జీ శ్రీనివాస్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. బాస్కెట్ బాల్ ఆటకు సంబంధించిన సన్నివేశాలు చాలా సహజంగా, ప్రొఫెషనల్‌గా ఉన్నాయి. శంకర్, ఎహసాన్, లాయ్, రామ్ సంపత్ (బీజీఎం) మ్యూజిక్ కథ ఎంతైతే డిమాండ్ చేశాయో.. అంత మేరకు ఉన్నాయి. చారు శ్రీ ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.

Sitaare Zameen Par Hindi Movie Review

ఢిల్లీ బాస్కెట్ బాల్ జట్టుకు అసిస్టెంట్ కోచ్ గుల్షన్ కుమార్ (అమీర్ ఖాన్). ఓ టోర్నమెంట్ కొనసాగుతుండగా కోచ్‌తో గొడవపడి సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత ఓ తప్పు చేసి పోలీసులకు దొరికిపోవడం, ఆ నేరంలో కోర్టు జరిమానాతోపాటు ఓ శిక్ష విధిస్తుంది. ఆ శిక్ష ప్రకారం గుల్షన్.. బుద్ది మాంద్యం, మానసిక వికలాంగులు, దివ్యాంగుల బాస్కెట్ బాల్ జట్టుకు కోచ్‌గా నియమిస్తారు. ఈ క్రమంలో భార్య సునీత (జెనీలియా దేశ్‌ముఖ్) ‌తో అభిప్రాయ బేధాల కారణంగా కాపురంలో కలతలు చోటుచేసుకొంటాయి. వారిద్దరూ వేర్వేరుగా జీవిస్తుంటారు.

కోచ్‌తో గుల్షన్ ఏ విషయంలో గొడవపడి సస్సెండ్ అయ్యాడు? ఈ నేరం చేసి పోలీసులకు దొరికిపోయాడు? జడ్జి శిక్ష విధించకుండా సోషల్ సర్వీస్ కింద దివ్యాంగుల బాస్కెట్ బాల్ జట్టుకు కోచ్‌గా ఎందుకు నియమించింది? దివ్యాంగులు, బుద్ది మాంద్యంతో బాధపడే బాస్కెట్ బాల్ క్రీడాకారులను ఎలాంటి వ్యయప్రయాసాలకోర్చి గుల్షన్ తీర్చిదిద్దారు. నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ పోటీల కోసం తన జట్టును ఎలా ప్రిపేర్ చేశారు? జాతీయ పోటీల్లో గుల్షన్ తయారు చేసిన టీమ్ గెలిచిందా? తనపై పడిన సస్పెన్షన్ వేటు నుంచి గుల్షన్ విముక్తి పొందాడా? భార్య సునీతతో గొడవలను పరిష్కరించుకొని కాపురాన్ని సరిదిద్దుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే సితారే జమీన్ పర్ సినిమా కథ.

గతంలో వచ్చిన తారే జమీన్ పర్ సినిమా ప్రతీ ఒక్కరిని భావోద్వేగానికి గురి చేయడమే కాకుండా కంటతడిని పెట్టించేంత ఎమోషనల్ కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో, ఆ సినిమాను నిర్మించి, నటించిన అమీర్ ఖాన్‌పై భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో సితారే జమీన్ పర సినిమా రిలీజైంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మానసికంగా పరిపక్వత చెందని పిల్లలను జాతీయ బాస్కెట్ బాల్ పోటీలకు ఎలా సంసిద్ధం చేశాడనేది కీలకమైన పాయింట్. కోచ్‌గా ప్రొఫెషనల్ కంటెంట్.. భార్యతో ఎడబాటు, తండ్రి లేని బిడ్డగా తల్లి చాటును పెరిగిన అనుభవం లాంటి అంశాలను ఆ పాయింట్ చుట్టూ దర్శకుడు అల్లుకొన్నాడు.

అయితే ఈ కథలో ఊహించని మలుపులు లేకుండా రెగ్యులర్ ఫార్మాట్‌లో సాదాసీదాగా సాగిపోతుంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే ముగింపు ఏమిటో ప్రేక్షకుడికి ఓ అంచనా వచ్చేస్తుంది. అయితే స్టోరీ డెస్టినేషన్‌‌కు ప్రేక్షకుడిని ఎలా తీసుకెళ్లాడు? ఎలాంటి అనుభూతిని కలిగించడానేది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశంగా చెప్పుకోవచ్చు. ముందుగా చెప్పుకొన్నట్టు ఇందులో ట్విస్టుల లేకుండా, ఎలాంటి ప్రయోగాలకు తావు లేకుండా, భావోద్వేగానికి గురి చేసే అంశాలు లేకుండా చప్పగా సాగిపోతుంది. కాకపోతే అమీర్ ఖాన్, జెనీలియా యాక్టింగ్, ఇక ఎనిమిది తొమ్మిది మంది పిల్లల పెర్ఫార్మెన్స్‌ ఈ సినిమాను నిలబెట్టేలా చేసింది.

అమీర్ ఖాన్ నటన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనే చెప్పాలి. తన పాత్రకు వీలైనంత మేరకు పూర్తిగా న్యాయం చేశారనే చెప్పాలి. ఇందులో విశేషమేమిటంటే.. తాను పొట్టిగా ఉండటంపై తానే సెటైర్లు వేసుకొన్నాడు. మధ్య తరగతి వివాహిత సునీతగా జెనీలియా తన పాత్రను హుందాగా పోషించింది. సంప్రదాయంగా కట్టుబొట్టుతో కొత్తగా కనిపించింది. ఇక ఈ సినిమాలో కీలకంగా మారిన పిల్లలందరూ తమ పాత్రలను బాగా పోషించారు. తమ నటన, హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో సినిమాను అల్లరి అల్లరిగా మార్చేశారు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.

హాలీవుడ్‌లో రచయిత జేవియర్ ఫెసెర్ రచించిన ఛాంపియన్స్ అనే సినిమా కథ స్పూర్తిగా సితారే జమీన్ పర్ సినిమాను ఆర్ఎస్ ప్రసన్న రూపొందించారు. తారే జమీన్ మాదిరిగా గొప్పగా ఊహించుకొనేంత కథ లేదు. గుండెలను పిండేసే ఎమోషన్స్ లేవు. కట్టిపడేసే స్క్రిన్ ప్లే ఉండదు. కానీ రెండున్నర గంటలు సరదాగా టైమ్ పాస్ చేసే విధంగా సినిమా ఉంటుంది. అతిగా ఊహించుకొని వెళ్లకండి.. నిరాశపడే ఛాన్స్ ఉంటుంది. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి, పిల్లల కథా నేపథ్యంగా సాగే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. అమీర్ ఖాన్ ఫ్యాన్స్‌కు పైసా వసూల్ సినిమా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X