Sitaare Zameen Par First Review: సితారే జమీన్ పర్ ఫస్ట్ రివ్యూ
ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నటించడమే కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం సితారే జమీన్ పర్. 2007 సంవత్సరంలో రిలీజై భారీ విజయం అందుకొన్న తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా దేశ్ ముఖ్ కీలక పాత్రల్లో నటించింది. ఈ సినిమాకు అపర్ణ పురోహిత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా గురించి దుబాయ్‌కి చెందిన క్రిటిక్ తన రివ్యూను సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సినిమా గురించి, ఆ రివ్యూ గురించిన వివరాల్లోకి వెళితే..
అమీర్ ఖాన్ నిర్మించి దర్శకత్వం వహించిన తారే జమీన్ పర్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల వర్షం కురిపించింది. అలాంటి సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. హాలీవుడ్‌లో 2018 సంవత్సరంలో రిలీజైన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ సినిమా ఆధారంగా సితారే జమీన్ పర్ మూవీని రూపొందించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో ఎక్కువగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టెలివిజన్ ఆర్టిస్టులు, నూతన నటులు నటించారు. ఈ సినిమాకు జీ శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫి, మ్యూజిక్ శంకర్, ఎహసాన్, లాయ్, రామ్ సంపత్ తదితరులు అందించారు. ఈ సినిమాను దుబాయ్ సెన్సారింగ్ సమయంలో ఉమేర్ సంధూ చూసిన తర్వాత తన రివ్యూను వెల్లడిస్తూ..

సితారే జమీన్ పర్ సినిమాను సెన్సార్ బోర్డుకు ప్రదర్శించిన ప్రివ్యూ సందర్భంగా సితారే జమీన్ పర్ మూవీని చూశాను. ఆ సినిమా చూసిన తర్వాత అమీర్ ఖాన్ కెరీర్ ముగిసిపోయినట్టే అనిపించింది. హాలీవుడ్ సినిమాలను బ్యాక్ టూ బ్యాక్ కాపీ పేస్ట్‌లా అందిస్తున్నాడనిపించింి. ఈ సినిమా చూసిన తర్వాత మెంటల్ ఎక్కింది. ఈ సినిమా డిజాస్టర్ కావడం తథ్యం అంటూ ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు.
సితారే జమీన్ పర్ సినిమా మెంటల్లీ అన్ స్టేబుల్ డిజాస్టర్ మూవీ. ప్రస్తుతం ఇండియాలో చెత్త నటుల్లో అమీర్ ఖాన్ ఒకరని తేలిపిోయింది. సినిమాల్లో ఎలా యాక్టింగ్ చేయాలో మరిచిపోయాడు. సన్నివేశాల్లో చాలా సోమరిపోతులా, అసౌకర్యంగా నటిస్తూ కనిపించాడు. ఈ సినిమా హాలీవుడ్ సినిమా ఛాంపియన్‌కు కాపీ. ఇలా ఒక భాష నుంచి కథలను చౌర్యం చేయడానికి నేను పూర్తిగా వ్యతిరేకం అని ఉమేర్ సంధూ అన్నారు.
సితారే జమీన్ పర్ సినిమా గురించి దారుణంగా కామెంట్ చేసిన ఉమేర్ సంధూ ఈ సినిమాకు 2/5 రేటింగ్ ఇచ్చాడు. ఈ సినిమాకు పూర్తిగా దూరంగా ఉండాలనే హెచ్చరికలను తన రివ్యూ ద్వారా వెల్లడించారు. అయితే ఉమేర్ సంఁధూ రివ్యూలు కొన్నిసార్లు తేడాగా ఉంటాయి. బాగా లేవని ఆయన చెప్పిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. బాగా ఉన్నది.. సూపర్ అంటూ చెప్పిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. కాబట్టి ఆయన రివ్యూపై పూర్తిగా ఆధారపడి జడ్జిమెంట్‌కు రాకండి. ఈ సినిమాపై ఫిల్మీబీట్ ఎక్స్‌క్లూజివ్ రివ్యూ అందిస్తుంది. మరిన్నీ రివ్యూల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











