For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Doctor Movie Review అదరగొట్టిన శివ కార్తీకేయన్, మైండ్ గేమ్‌తో నెల్సన్

  |

  Rating: 3/5

  రెమో, సీమ రాజా, శక్తి లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అటు తమిళ, తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో శివ కార్తికేయన్. కామెడీ ప్రధానమైన సినిమాలతో ఆలరిస్తున్న ఆయన తాజాగా ఓ ఎమోషనల్ కథాంశంతో వరుణ్ డాక్టర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో బీస్ట్ రూపొందిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ డాక్టర్ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాయి. అక్టోబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన హ్యూమన్ ట్రాఫికింగ్ (అమ్మాయిల అక్రమ రవాణా) చిత్రం ఎలా ఉందో అనే విషయం తెలుసుకోవాలంటే కథ, కథనాలు సమీక్షించుకొందాం..

  డాక్టర్ సినిమా కథ

  డాక్టర్ సినిమా కథ

  ఆర్మీలో డాక్టర్‌గా పనిచేస్తున్న వరుణ్‌ (శివ కార్తీకేయన్) పద్మినీ (ప్రియాంక అరుళ్ మోహన్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే ఎమోషన్స్ లేవనే కారణంతో వరుణ్‌ను పద్మినీ పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పద్మిని సోదరుడి కూతురు చిన్నును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. దాంతో పద్మినీ కుటుంబ సభ్యులు టెన్షన్‌లో పడిపోతారు.

  డాక్టర్ కథలో ట్విస్టులు

  డాక్టర్ కథలో ట్విస్టులు

  పద్మిని తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే వరుణ్ రియాక్షన్ ఏమిటి? పద్మిని అన్న కూతురును ఎవరు కిడ్నాప్ చేశారు? చిన్నును ఎవరు కిడ్నాప్ చేశారు? ఆర్మీ నేపథ్యం ఉన్న వరుణ్ కిడ్నాపర్ల ఆచూకిని ఎలా తెలుసుకొన్నాడు? పద్మిని ఫ్యామిలికి వరుణ్ ఎలాంటి సపోర్ట్‌ను అందించారు. పద్మిని కుటుంబం కోసం వరుణ్ ఎలాంటి రిస్క్ తీసుకొన్నారు? ఇందులో యోగి బాబు, ఇతర నటీనటులు పాత్రలు ఏమిటి? వారు కథకు ఎలా బలంగా మారారు అనే ప్రశ్నలకు సమాధానమే డాక్టర్ సినిమా కథ.

  కథ ఎమోషనల్‌గా, ఫన్‌తో

  కథ ఎమోషనల్‌గా, ఫన్‌తో

  డాక్టర్ సినిమా కథ.. దేశ సరిహద్దులో ఓ యాక్షన్, ఎమోషనల్ సీన్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత పద్మినితో పెళ్లిచూపులు ఎపిసోడ్‌ ఫన్నీగా, సరదాగా, హాస్యంతో ఆకట్టుకొనేలా ఉంటుంది. పద్మిని, వరుణ్ బ్రేకప్‌ తర్వాత ఏం జరుగుతుందని ఆలోచించే లోపే చకచకా కిడ్నాప్ సంఘటనను తెచ్చి కథలో వేగాన్ని, కథనంలో జోష్‌ను పెంచాడు. ఇక యోగిబాబు, ఇతర కమెడియన్లు కథలోకి రావడంతో సినిమా మరింతగా ఫన్, హ్యూమర్‌తో నిండిపోయింది. కిడ్నాప్ అనే సీరియస్ టాపిక్‌ను వినోదంగా చెప్పడానికి ప్రయత్నించడం దర్శకుడు నెల్సన్ ప్రతిభకు అద్దం పట్టింది. పస్టాఫ్‌లో యోగిబాబు బృందం చేసిన కామెడీ సినిమాను మరో లెవెల్‌కు వెళ్తుంది. ఫస్టాఫ్‌లో మెట్రో ట్రైన్ ఫైట్‌ను ఫన్‌గా చిత్రీకరించిన తీరు నెల్సన్ టాలెంట్‌కు సాక్ష్యంగా నిలిచింది.

  సెకండాఫ్‌లో మైండ్ గేమ్

  సెకండాఫ్‌లో మైండ్ గేమ్

  డాక్టర్ కథలో పెద్దగా మలుపులు లేకపోవడం వల్ల సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకెళ్లడం కారణంగా కథనం కాస్త నెమ్మదించినట్టు కనిపిస్తుంది. అయితే ఆ లోపాన్ని సవరించి సినిమాను కామెడీ ట్రాక్ గాడిలో పెట్టడం ఫీల్‌గుడ్‌గా మారుతుంది. గోవాలోని సన్నివేశాల్లో మైండ్ గేమ్ ప్రేక్షకుడిని కథలో లీనం చేసేలా మారుతుంది. కిడ్నాప్ గురైన అమ్మాయిని ఫ్యామిలీ మెంబర్స్‌కు పరిచయం చేసే సీన్ భావోద్వేగానికి గురిచేస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా అనిపించినప్పటికీ.. చక్కటి ఫీలింగ్‌తో కథను ముగించడం సినిమా చక్కటి అనుభూతిని మిగులుస్తుంది.

  శివ కార్తీకేయన్ అద్బుతంగా

  శివ కార్తీకేయన్ అద్బుతంగా


  డాక్టర్ సినిమాలో శివ కార్తీకేయన్ వన్ మ్యాన్ షో ఫెర్ఫార్మెన్స్. వరుణ్‌ పాత్ర భారాన్నే కాకుండా సినిమా భారాన్ని మొత్తం తన భుజాల మీద వేసుకొన్నాడని చెప్పవచ్చు. భావోద్వేగాలను పండిస్తూ.. తొణకని, బెణకని డాక్టర్‌గా తెర మీద ఆకట్టుకొన్నాడు. డాక్టర్ సినిమాతో మరింత మంది ప్రేక్షకులను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడం గ్యారెంటి. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన శివ కార్తీకేయన్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇక ప్రియాంక అరుళ్ మోహన్ పాత్ర కథలో ఇంపార్టెంట్. కానీ దాని ప్రభావం సినిమా మీద పెద్దగా కనిపించదు. సన్నివేశాలతోపాటు ఆమె కూడా అలా సాగిపోయింది.

  టెక్నికల్‌గా ఎలా ఉందంటే..

  టెక్నికల్‌గా ఎలా ఉందంటే..

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు లేకపోవడం వల్ల సంగీత ప్రియులకు కాస్త నిరాశపరిచే అంశం. పలు సన్నివేశాలను తన మ్యూజిక్‌తో అనిరుధ్ మరో లెవెల్‌కు తీసుకెళ్లారని చెప్పవచ్చు. విజయ్ కార్తీక్ కుమార్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. గోవా సన్నివేశాల చిత్రీకరణ బాగుంది. ఆర్ నిర్మల్ ఎడిటింగ్‌ విషయానికి వస్తే.. ఇంకాస్త పని ఉందని అనిపిస్తుంది.

   ఫైనల్‌గా డాక్టర్ ఎలా ఉందంటే..

  ఫైనల్‌గా డాక్టర్ ఎలా ఉందంటే..

  డాక్టర్ సినిమాకు కర్త, కర్మ, క్రియ నెల్సన్ దిలీప్ కుమార్. పక్కాగా స్క్రీన్ ప్లేతో పలు సన్నివేశాల్లో మ్యాజిక్ క్రియేట్ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. సీరియస్‌గా సాగే కథను వినోదంగా చెప్పవచ్చని తన ప్రతిభను చాటుకొన్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా శివకార్తికేయన్ మంచి చిత్రాన్ని అందించారు. ఇటీవల కాలంలో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌తోపాటు ఫన్‌తో కూడిన చక్కటి చిత్రం ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మంచి అనుభూతిని ఈ సినిమా అందిస్తుంది. ఈ వీకెండ్ డాక్టర్ మూవీ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు


  నటీనటులు: శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగి బాబు, మిలింద్ సోమన్ తదితరులు
  దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
  నిర్మాత: శివకార్తికేయన్
  సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కణ్ణన్
  మ్యూజిక్ డైరెక్టర్: అనిరుధ్ రవిచందర్
  ఎడిటర్: ఆర్ నిర్మల్
  బ్యానర్స్: గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌, కేజేఆర్‌ స్టూడియోస్‌
  రిలీజ్ డేట్: 2021-10-09

  English summary
  Actor Sivakarthikeyan comes as producer with doctor movie. Nelson Dilip Kumar narrated the story brilliantly on screen. Here is the Doctor Movie Exclusive movie revew for Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X