twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రీమోడల్ చేసి,మెరుగులు దిద్దిన పాత కథ (దిల్ రాజు 'రెమో' రివ్యూ)

    అబ్బాయి అమ్మాయి వేషం వేసుకోవడం, అదే అవతారంలో హీరోయిన్ కి దగ్గరవ్వడం అనే కాన్సెప్టు తో వచ్చిన రెమో ఈ రోజు విడుదలైంది.

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    దిల్ రాజు బ్యానర్ అనగానే కథలో సమ్ ధింగ్ ...ఏదో విషయం లేకుండా సినిమా చేయడని మనకు తెలుసు. అలాంటిది వేరే భాషలో సినిమా రైట్స్ తీసుకుని డబ్ చేసి మరీ వదులుతున్నాడంటే అందులో అంతకు మించి విషయం ఉంటుందని అంచనా వేస్తాం. దానికి తోడు అప్పట్లో వచ్చి హిట్టైన చిత్ర భళారే విచిత్రం, భామనే సత్యభామనే, మేడమ్ చిత్రల తరహాలో హీరోనే ఆడవేషం వేసాడు వంటి కథ అంటే...ఇంక ఆ అంచనాలుకు లోటేముంటుంది.

    చిరంజీవి-పవన్ కళ్యాణ్ దత్తన్న కూతురు పెళ్లి వేడుకలో (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

    అదే జరిగింది దిల్ రాజు తాజా చిత్రం రెమోకు. మరి ఆ అంచనాలను అందుకుందా...ఈ సారి హీరో ..స్త్రీ వేషం వెయ్యటానికి కారణం ఏమిటి...కొత్తగా ఉందా..పాత బొమ్మనే మళ్లీ చూసినట్లుందా వంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

    అయితే ఈ కథ చెప్పుకునేముందు ఓ విషయం మాట్లాడుకోవాలి. ఇది కొత్త సీసాలో పోసిన పాత సారానే. ఫక్తు ఫార్ములా స్టోరీనే. అయితేనేం ఆ ఫార్ములాని కూడా కొత్త సీన్లతో చెప్పి, మెప్పించాడు. అందుకే తెలిసిన సీన్స్ అయినా ఫ్రెష్ గా ఉన్నాయి. కాస్సేపు నవ్వుకోవటానికి ఈ సినిమా పనికొచ్చేలా ఉంది. ఇంతకు మించి డబ్బింగ్ సినిమాని చెప్పుకునేదేముంది.

    ప్రేమలో పడ్డ కాబోయే స్టార్

    ప్రేమలో పడ్డ కాబోయే స్టార్

    సినిమా పిచ్చోడు...తెరపై స్టార్ హీరోగా వెలిగిపోవాలని కోరిక ఉన్నవాడు శివ (శివకార్తికేయన్‌). అందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్న అతను సాధ్యమైనంతగా అమ్మాయిలకు దూరంగా ఉంటూంటాడు. కానీ ఓ రోజు కావ్య (కీర్తి సురేష్‌)ని చూసి ఇష్టపడతాడు. ఆమెకి తెలియకుండా ఆమెని ప్రతి క్షణం నీడలా వెంటాడుతుంటాడు.

    ప్రేమకు అడ్డం...

    ప్రేమకు అడ్డం...

    ధైర్యం చేసి తన ప్రేమ విషయం చెప్పుదామని ఆమె ప్లాట్ కు వెళ్లేసరికి...అక్కడ .. కావ్యకు సంబంధించిన ఓ విషయం తెలుస్తుంది. అదేమిటంటే...విశ్వ అనే డాక్టర్ తో ఆమెకు నిశ్చితార్దం. దాంతో నిరాశలో కూరుకుపోయి తన ప్రేమ బయటపెట్టడు.

    నో చెప్తాడు డైరక్టర్

    నో చెప్తాడు డైరక్టర్

    ఆ తర్వాత దర్శకుడు కె ఎస్ రవికుమార్ ...నర్స్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసి... నర్సు వేషంలో అక్కడికి వెళ్తాడు. అయితే లవ్ యాక్ట్ చేయమంటే చేయలేకపోతాడు శివ. దాంతో దర్శకుడు నో చెప్పి వెళ్లిపొమ్మంటాడు.

    నర్స్ గెటప్ లో లవర్ తో ..

    నర్స్ గెటప్ లో లవర్ తో ..

    అలా సినిమా ట్రైల్స్ లో భాగంగా అనుకోకుండా ఓసారి నర్సు వేషం వేస్తూ... ఆ గెటప్ లోనే బస్ ఎక్కిన అతనికి కావ్య కనపడుతుంది. కావ్యకు .. రెమోగా పరిచయం చేసుకొంటాడు. రెమో అమ్మాయే అనుకొని తనతో చనువుగా ఉంటుంది కావ్య. బాగా మాట్లాడుతుంది.

    ఆమెకు దగ్గరవ్వాలనే..

    ఆమెకు దగ్గరవ్వాలనే..

    అంతేకాకుండా కావ్య ...తన ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం కూడా ఇప్పిస్తుంది. కేవలం కావ్యకు దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో అదే వేషం కొనసాగిస్తాడు. ఆ తరవాత ఏమైంది? ఆడ వేషంలో కావ్యకి దగ్గరైన శివ.. తన ప్రేమని బయటపెట్టాడా, లేదా? సినిమాలో హీరో అయ్యాడా లేదా అనేదే 'రెమో' కథ.

    ఫార్ములా

    ఫార్ములా

    మొదటే చెప్పుకున్నట్లుగా..ఈ సినిమా కథ కొత్తదేమీ కాదు. కాకపోతే కొత్తగా ప్రయత్నించాడు అంతే. అబ్బాయి..అమ్మాయి వేషం వేసి, తను ప్రేమించిన అమ్మాయి ప్రేమను పొందడమే కాకుండా తన సమస్యలు పరిష్కరించుకోవటం ఎవర్ గ్రీన్ ఫార్ములా అని ప్రూవ్ చేసారు.

    ఇది ప్లస్ అయ్యింది

    ఇది ప్లస్ అయ్యింది

    నిజానికి లేడీ గెటప్ వేస్తే ఎవరు పడితే వారు సూట్ కారు. అప్పట్లో కమల్, నరేష్, రాజేంద్రప్రసాద్ నప్పారు. కాని తర్వాత మరికొందరు ప్రయత్నించినా ఎవరికీ గుర్తు లేకుండా ఆ సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. అయితే శివకార్తికేయన్ లేడి గెటప్ లో చక్కగా ఇమిడిపోవటం హైలెట్ గా మారింది. అక్కడే సినిమాకు సగం మార్కులు పడిపోయాయి. ఇక రెమోగా, నర్స్ పాత్రలో హీరోయిన్ కంటే అందంగా కనిపించాడు. నర్స్ గెటప్ తనకు బాగా సెట్ అయింది.

    స్పీడు తగ్గింది

    స్పీడు తగ్గింది

    తన ప్రేమని సంపాదించడానికి హీరో చేసే ప్రయత్నాలు గమ్మత్తుగా, ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు వరకూ సినిమా చాలా సరదా సరదాగా సాగుతుంది. పాటలు, ఫైట్స్ కూడా ఆకట్టుకొంటాయి. కానీ నర్సు వేషం వేసిన తర్వాత కథలో మరింత వేగం రావాల్సింది. కానీ రివర్స్ గేర్ లో కాస్త నెమ్మదించింది.

    ఇదీ ఒకటి

    ఇదీ ఒకటి

    ఇంటర్వల్ బ్యాంగ్ సినిమా హైలైట్స్ ఒకటని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రేమలో ఫెయిల్ అయిన కుర్రాడిగా హీరో చెప్పే డైలాగ్స్, నటించే తీరు ఆడియన్స్‌ను కట్టి పడేస్తాయి, కనెక్ట్ అవుతాయి. ఇక శివకార్తికేయన్‌కు తల్లిగా నటించిన శరణ్యకు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. అలాగే హీరో అవ్వాలనుకున్న కొడుకుని చూసి తల్లి తిట్టే తిట్లు చాలా నాచురల్ గా అనిపిస్తాయి.

    కేర్ తీసుకుని

    కేర్ తీసుకుని

    రెమో పాత్ర కోసం దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని అర్దమవుతుంది. ఎందుకంటే రెమో అంటే ఎవరో కాదు హీరోనే అని హీరోయిన్ కు ఎక్కడా డౌట్ రాకూడదు. ఆ విషయంలో డైరక్టర్ చాలా కేర్ తీసుకుని సీన్స్ అల్లుకున్నాడు. అంతేకాకుండా రెమో వేషంలో ఉన్న హీరోని విలన్ టీజ్ చేసే సీన్స్ ని అసభ్యత లేకుండా తెరకెక్కించాడు.

    క్లైమాక్స్ హైలెట్

    క్లైమాక్స్ హైలెట్

    ఈ సినిమాకు హైలెట్స్ క్లైమాక్స్, ఇంటర్వెల్. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో డైరక్టర్ ..ఒక్కసారిగా గ్రాఫ్ లేచేలా ప్లాన్ చేసాడు. ఈ కథకు సరైన ముగింపు ఇచ్చాడని ఫీలయ్యలా చేసాడు. అలాగే సినిమాలో కొంతమంది సినిమా స్టార్స్ గెస్ట్ పాత్రల్లో కనిపించడం ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

    హీరోయిన్ కేక పెట్టించింది

    హీరోయిన్ కేక పెట్టించింది

    ఈ సినిమాకి ఇక మరో ముఖ్యమైన ప్లస్ పాయింట్ హీరోయిన్ కీర్తి సురేష్ అని చెప్పాలి. రామ్ తో చేసిన నేను..శైలజ సినిమాతో తెలుగువారికి బాగా దగ్గరైన ఆమె మరోసారి తనలోని నటనా టాలెంట్ తో మెప్పించింది. ముఖ్యంగా శివకార్తికేయన్ తో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. సినిమాలో...హీరో... హీరోయిన్ కు తన లవ్ ప్రపోజ్ చేసే సన్నివేశం సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది.

    ఇవి బోర్ కొట్టించాయి

    ఇవి బోర్ కొట్టించాయి

    సినిమా అంతకంతకు వేగం తగ్గటం విసిగిస్తుంది. అలాగే కథ,కథనం మనం ఊహించేయగలగటం కూడా మైనస్. దీనికి తోడు ఒక పాట తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ పాటలు లేవు. ఇలాంటి సినిమాలకు పాటలే హైలెట్ గా నిలవాలి నిజానికి. కానీ ఆ విషయంలో ఫెయిలైందీ సినిమా.

    ఆయనుంటే అంతే

    ఆయనుంటే అంతే

    ఇక ఈ చిత్రం టెక్నికల్ విషయాల్లోకి వెళితే..ముందుగా మాట్లాడుకోవాల్సింది పిసి శ్రీ రామ్ సినిమాటోగ్రఫీ గురించి. ఆయన ప్రతి సన్నివేశాన్ని విజువల్ వండర్ లా...కలర్ ఫుల్ గా అందంగా తీర్చిదిద్దారు. అలాగే హీరో శివకార్తికేయన్ కు లేడీ గెటప్ వేసిన మేకప్ ఆర్టిస్టుల టాలెంట్ ని కూడా మెచ్చుకోవాల్సిందే. లేడీ గెటప్ లో శివకార్తికేయన్ ను పర్ఫెక్ట్ గా ఫిట్ చేసేసారు.

    ఈ సినిమాకి పనిచేసిన టీమ్

    ఈ సినిమాకి పనిచేసిన టీమ్

    బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, 24 ఏఎమ్‌ స్టూడియోస్‌
    నటీనటులు: శివకార్తికేయన్, కీర్తి సురేష్, స్వామినాథన్, సతీష్‌, రాజేంద్రన్‌, యోగిబాబు, శరణ్య తదితరులు
    సంగీతం: అనిరుథ్‌
    ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్‌
    కూర్పు: రూబెన్‌
    నిర్మాత: దిల్‌రాజు
    దర్శకత్వం: బక్కియరాజ్‌ కన్నన్‌
    విడుదల తేదీ: 25-11-2016

    ఫైనల్ గా ఈ డబ్బింగ్ చిత్రం..ఇది డబ్బింగ్ చిత్రమే అని పదే పదే గుర్తు చేస్తూ తమిళ నేటివిటితో సాగుతుంది. అయినా కామెడీ సినిమా కదా...ఎన్ని డబ్బింగ్ సినిమాలు చూసి ఎంజాయ్ చేయలేదు అందులో ఇది ఒకటి అంటారా..ఖచ్చితంగా మీకు నచ్చుతుంది..హ్యాపీగా సనిమాకు వెళ్లచ్చు. ఫైనల్ గా రెమో అంటే..అపరిచితుడులోని విక్రమ్ క్యారక్టర్ కు సంభంధం లేదని మనవి.

    English summary
    Tamil successful hero Siva Karthikeyan is making his entry into Tollywood now with his new film Remo. Today Remo released with hit talk. Dil Raju has got the dubbing rights for the film and he is producing the film in Telugu now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X