twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శివమణి' బాగున్నాడు!

    By Staff
    |

    Shivamani
    -జలపతి గూడెల్లి
    చిత్రం: శివమణి
    నటీనటులు: నాగార్జున, ఆషిన్‌, రక్షిత, ప్రకాష్‌ రాజ్‌, ఆలీ
    సంగీతం: చక్రి
    సహనిర్మాతలు: భగవాన్‌, దానయ్య
    కథ, స్క్రీన్‌ ప్లే, నిర్మాత, దర్శకత్వం: పూరీ జగన్నాథ్‌

    దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఇప్పటివరకు నాలుగు హిట్‌ చిత్రాలు ఇచ్చినప్పటికీ, అవి పూర్తిగా ప్రోటాగనిస్ట్‌ (కథానాయకుడు)ని అధికంగా ఎలివేట్‌ చేయడంపైనే దృష్టి సారిస్తూ వచ్చాడు. కానీ 'శివమణి' చిత్రంలో హీరోను ఎలివేట్‌ చేయడం కన్నా కథకు, కథనానికి అధికంగా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సినిమా ఆకట్టుకుంటుంది. స్క్రీన్‌ ప్లే చక్కటి పట్టును ప్రదర్శించాడు. ఒక హాలీవుడ్‌ సినిమా (పేరు గుర్తుకు రావడం లేదు)లోని పాయింట్‌ ను తీసుకొని చక్కగా కథను అల్లుకున్నాడు.

    ఇక 'సింహాద్రి' టైఫ్‌ లో కేరళ టచ్‌, హీరోయిన్‌ కు చివర్లో 'వైకల్యం' అందించడంతో..సినిమా బాగా వర్కవుట్‌ అయింది. అయితే, సెకండాఫ్‌ సరిగా తీయలేకపోయాడు. క్లైమాక్స్‌ లో హీరో, హీరోయిన్లు కలుసుకున్న తీరు కూడా పేలవంగానే ఉంది. నాగార్జున 'క్యాజ్‌ వల్‌' నటన ఈ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌.

    పల్లవి (రక్షిత) ఆంధ్రజ్యోతి ఛీఫ్‌ ఎడిటర్‌. ఆమె ఒకరోజు బీచ్‌ లో జాగింగ్‌ చేస్తుండగా ఓ బాటిల్‌ దొరుకుతుంది. ఆ బాటిల్‌ లో ఓ ప్రేమలేఖ ఉంటుంది. ఆ ప్రేమలేఖలోని వివరాలను ఆరాతీసేందుకు ఆమె కొచ్చిన్‌ వెళుతుంది. అక్కడ శివమణిని కలుసుకొని ఆయన కథను తెలుసుకుంటుంది. ఫ్లాష్‌ బ్యాక్‌..శివమణి వైజాగ్‌ లో సి.ఐగా పనిచేస్తుంటాడు.

    గుండాలను, రౌడీలను చితకబాది అందర్నీ బొక్కలో వేస్తాడు. ఎవరికీ భయపడని శివమణి రౌడీనాయకుడు దత్తు (ప్రకాష్‌ రాజ్‌) ఆటలు కూడా కట్టిస్తాడు. కొచ్చిన్‌ నుంచి వచ్చిన వసంత (ఆషిన్‌), శివమణి ప్రేమించుకుంటారు. వసంత ఎవరో కాదు దత్తు మేనకోడలు. పక్షవాతం వచ్చిన తన తల్లిని బాగుచేయించేందుకు కొచ్చిన్‌ వచ్చిన శివమణిపై పగతీర్చుకునేందుకు దత్తు ప్రయత్నిస్తుంటాడు. శివమణి, వసంతలిద్దరూ ఒక ఐలాండ్‌ కు షికారుకు వెళ్ళగా, అక్కడికి దత్తు, ఆయన బావ వచ్చి శివమణిని చావబాదుతారు.

    ఆ ఐలాండ్‌ లో శివమణి కట్టివేసి, వసంతను తీసుకెళుతారు. శివమణి తల్లిని చంపేస్తారు. కొందరి సాయంతో శివమణి కొచ్చిన్‌ కు తిరిగిరాగా, అక్కడ వసంతగానీ, వాళ్ళు గానీ ఎవరూ ఉండరు. ఇక శివమణి వసంత కోసం అక్కడే ఉండి రెండేళ్ళుగా వెతుకుతుంటాడు. విషయం అంతా విన్న పల్లవి తిరిగి వైజాగ్‌ వెళ్ళి వసంత కోసం వెతుకుతుంది. పల్లవి వసంతను కలుసుకోగలుగుతుంది. చివరికి పల్లవి వీళ్ళద్దర్ని ఎలా కలిపిందనేది క్లైమాక్స్‌.

    సినిమాలో చాలావరకు ఎక్స్‌ ట్రా సైడ్‌ ట్రాక్స్‌ పెట్టకుండా కేవలం కథపైనే పూరీ దృష్టిపెట్టడం వల్ల సినిమా కొత్తగా తీసినట్లు అన్పిస్తుంది. శ్యాం.కె.నాయుడిని సరియైన రీతిలో ఉపయోగించుకుంటూ సినిమాను స్టైల్‌ గా నడిపించాడు. శ్యాం ఈ సినిమా ద్వారా పెద్ద సినిమాటోగ్రాఫర్‌ గా ఎదిగినట్లే. రక్షిత పాత్ర కొంచెం సినిమాటిక్‌ గా అన్పిస్తుంది.

    ఒక ఛీఫ్‌ ఎడిటర్‌ అలా నాగార్జునతో సెక్సీగా బిహేవ్‌ చేయడం, ఏ న్యూస్‌ ఐనా దినపత్రికల్లో బ్యానర్‌ హెడ్డింగ్‌ కావడం, ఫలానా వార్త పేరు చెప్పి పత్రికలను అమ్మే దృశ్యాలు పెట్టడం అచ్చం సినిమాటికే. వాస్తవానికి ఆమడదూరం. ఇవన్నీ సినిమా బాగుండడం వల్ల కొట్టుకుపోతాయి. నాగార్జున, ఆషిన్‌ ల నటన బాగుంది. ప్రకాష్‌ రాజ్‌ తన పాత ధోరణిలోనే చేశాడు. చక్రి తొలిసారిగా రీరికార్డింగ్‌ పై బాగా శ్రద్ద కనబరిచినట్లు కన్పించింది. మొత్తమ్మీద చూడదగ్గ చిత్రం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X