డిష్యూం..డిష్యూం...'శివన్న'

By Staff

Sivanna
-సౌమిత్‌
చిత్రం: శివన్న
నటీనటులు: సాయికుమార్‌, కోటశ్రీనివాసరావు, రామిరెడ్డి, మాన్య
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నిర్మాత: సాయిరత్నం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.ఎస్‌.నాగేశ్వరరావు

పక్కా యాక్షన్‌ చిత్రమిది. కథ, కథనానికి సంబంధం లేకుండా డిష్యూం, డష్యూంలకే ప్రాధాన్యం తప్ప ఇందులో చెప్పుకోదగ్గ అంశమేదీ లేదు. ఎంత మాస్‌ చిత్రాల అభిమానులకైనా ఈ చిత్రం బోరుకొడ్తుంది. యాక్షన్‌ చిత్రాల దర్శకుడిగా పేరున్న కె.ఎస్‌.నాగేశ్వరరావు స్క్రిప్ట్‌ మీద దృష్టి సారించలేదు.

కోట శ్రీనివాసరావు కోర్టులో బంట్రోతు. తన కుమారుడు సాయికుమార్‌ పెద్ద లాయరై కోర్టుల్లో పేదవాళ్ళకు జరుగుతోన్న అన్యాయాల్ని అరికట్టాలని కోరుకుంటాడు. రామిరెడ్డి పెద్ద గుండా. అతని తమ్ముడు సూర్య బలాదూర్‌ గా తిరుగుతూ సిటీలోని మహిళలని ఏడిపిస్తుంటాడు. ఒక సందర్భంలో సాయికుమార్‌ సూర్య అనుచరులను కొడుతాడు. దాంతో కక్ష పెంచుకున్న సూర్య సాయికుమార్‌ చెల్లెల్ని రేప్‌ చేస్తాడు. సూర్య మీద కేసు పెట్టేందుకు ప్రయత్నించిన కోటకు చుక్కెదురవడంతో ఆమె చనిపోతుంది. దీంతో సూర్యను హీరో చంపేస్తాడు.

తమ్ముడు మరణాన్ని తట్టుకోలేని రాంరెడ్డి సాయికుమార్‌ తల్లితండ్రులను చంపేస్తాడు. దహన సంస్కారంలో పాల్గొన్నప్పుడు సాయికుమార్‌ ను చంపాలని రామిరెడ్డి ప్లాన్‌ వేస్తాడు. కానీ చివరికి హీరోదే పైచేయి కావాలి కాబట్టి-సాయికుమార్‌ రామిరెడ్డిని, నగరంలోని అరాచక శక్తులను మట్టుబెడుతాడు. నిర్దోషిగా విడుదలవుతాడు. చిత్రం ముగుస్తుంది.

పచ్చి విలన్‌ గా రామిరెడ్డి డైలాగ్‌ లు తప్ప సినిమాలో విశేషమేమీ లేదు. తండ్రి పాత్రలో కోటశ్రీనివాసరావు నటన బావుంది. మిగిలిన పాత్రలన్నీ పేరుకే. దాసం వెంకట్రావు మాటల్లో పదను ఉన్నా, ఈ సినిమాలో పస లేకపోవడం వల్ల ఎలివేట్‌ కాలేదు. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం, కెమెరామెన్‌ విజయ్‌ కుమార్‌ పనితనం చిత్రానికి ఎస్సెట్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X