Slum Dog Husband Review ఫన్ ఎలిమెంట్స్‌తో ఎమోషనల్ కోర్టు రూమ్ డ్రామా.. స్లమ్ డాగ్ హస్పెండ్ రివ్యూ

Rating: 2.5/5

నటీనటులు: సంజయ్ రావు, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి, యాదమ్మ రాజు, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ తదితరులు
రచన, దర్శకత్వం: డాక్టర్ ఏఆర్ శ్రీధర్
నిర్మాతలు: అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
సహ నిర్మాతలు: చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల, ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం
ఎడిటర్: వైష్ణవ్ వాసు,
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ జె రెడ్డి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి
పీఆర్వో: జీఎస్కే మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ కైగురి
బిజినెస్ హెడ్: రాజేంద్ర కొండ
రిలీజ్ డేట్: 2023-07-29

పాతబస్తీలో కళ్లజోడు అమ్ముకొనే కుర్రాడు లక్ష్మణ్ అలియాస్ లచ్చి (సంజయ్ రావు) జీవితంలో తనకు నచ్చినట్టు బతుకుతుంటాడు. మౌనిక (ప్రణవి మానుకొండ) అనే అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ఇరు కుటుంబాలను ఒప్పించి లచ్చి, మౌనిక పెళ్లి చేసుకోవాలని అనుకొంటారు. కానీ కొన్ని కారణాల వల్ల బేబీ అనే కుక్కతో పెళ్లి జరిపించి ఆ తర్వాత మౌనికతో పెళ్లికి సిద్దమవుతారు. కానీ బేబీని పెళ్లి చేసుకొన్నందున విడాకులు తీసుకోకుండా మౌనికను పెళ్లి చేసుకోవద్దని లచ్చికి కుక్క యజమాని (వేణు పోల్సాని)లీగల్ నోటీసులు పంపుతాడు.

Slum Dog Husband Telugu Movie Review and Rating: Pranavi Manukonda, Brahmajis fun loving emotional dog drama

మౌనిక, లచ్చి ప్రేమ కథ ఎలా సాగింది? మౌనికతో పెళ్లికి ముందు వారిద్దరి మధ్య రొమాన్స్ ఎలా జరిగింది? మౌనికతో పెళ్లికి ముందు లచ్చికి ఎందుకు కుక్కతో పెళ్లి చేయాలని అనుకొన్నారు? మౌనిక పెళ్లికి ముందు కుక్క యజమాని ఎందుకు లీగల్ నోటీసులు పంపాడు? లీగల్ నోటీసుల అందుకొన్న తర్వాత కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? కుక్కతో లచ్చికి విడాకుల విషయంలో కోర్టు ఎలా స్పందించింది? విడాకుల కేసు నేపథ్యంలో మౌనిక తీసుకొన్న నిర్ణయం ఏమిటి? కుక్కతో లచ్చికి విడాకులు దొరికాయా? మౌనిక‌ను లచ్చి పెళ్లి చేసుకోవడానికి ఎందుకు నిరాకరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే స్లమ్ డాగ్ హస్పెండ్ (Slum Dog Husband) సినిమా కథ.

స్లమ్ డాగ్ హస్పెండ్ (Slum Dog Husband) మూవీ పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ఇంట్రెస్టింగ్‌గానే మొదలవుతుంది. మౌనిక, లక్ష్మణ్ మధ్య నాటు రొమాన్స్ మంచి ఫన్ క్రియేట్ చేసింది. కుక్కతో పెళ్లి అంశం మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసి సరదాగా సాగిపోయేలా చేసింది. ఫస్టాఫ్‌లో కామెడీ సీన్లు వర్కువట్ అయ్యాయి. యాదమ రాజు, సంజయ్ రావు పాత్రల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.

Slum Dog Husband Telugu Movie Review and Rating: Pranavi Manukonda, Brahmajis fun loving emotional dog drama

ఇక సెకండాఫ్‌లో కోర్టు సీన్లు సినిమాను నెక్ట్స్ లెవెల్ తీసుకెళ్లడంలో కొంత తడబాటు కనిపించింది. కానీ Human Beings are social animals, Same Sex marriage లాంటి అంశాలపై చర్చించిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ ఎమోషనల్‌గా కథ చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు శ్రీధర్‌ను అభినందించాల్సిందే. ప్రీ క్లైమాక్స్ ముందు యాదమ రాజు క్యారెక్టర్ ఇచ్చిన ట్విస్టుతో కథ మరో రేంజ్‌కు వెళ్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్‌ నుంచి ఎండ్ టైటిల్ వరకు ఎమోషన్స్ పండించిన తీరుతో స్లమ్ డాగ్ హస్పెండ్ (Slum Dog Husband) ఫీల్‌గుడ్ మూవీగా మారిందని చెప్పవచ్చు.

స్లమ్ డాగ్ హస్పెండ్ (Slum Dog Husband) మూవీలో నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ కొత్త వాళ్లైనా సినిమాను తమ నటన, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొన్నారు. ప్రణవి వెర్బల్ రొమాన్స్‌తో కేక పెట్టించింది. రొమాంటిక్ సీన్లతో చూపించిన హవభావాలతో ప్రణవి పూర్తి మార్కులు కొట్టేసింది. క్లైమాక్స్ సీన్లలో ఎమోషనల్ నటనతో సంజయ్ ఆకట్టుకొన్నాడు. కథను మలుపు తిప్పే పాత్రలో కుక్క యజమానిగా నటించిన వేణు పోల్సాని మంచి నటనను ప్రదర్శించాడు. థియేటర్ బ్యాక్ గ్రౌండ్‌ ఉన్న వేణు పోల్సానీ తన పాత్రలో ఒదిగిపోయారు. కోర్టులో లాయర్ సల్మాన్ ఖాన్ పాత్రలో బ్రహ్మాజీ, దావిద్ మత్తయ్యగా సప్తగిరి మంచి కామెడీని పండించారు. పోటాపోటీగా వాదనలు వినిపిస్తూ తమదైన శైలిలో హాస్యాన్ని పండించారు.

స్లమ్ డాగ్ హస్పెండ్ (Slum Dog Husband) సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..ఈ సినిమాకు భీమ్స్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. మాస్ ఎలిమెంట్స్ తగినట్టుగా మాసీ పాటలతో కేక పెట్టించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో భీమ్స్ అదరగొట్టాడు. పాటల సాహిత్యం కూడా ఊరమాస్‌గా ఉండటంతో బయటనే కాకుండా సినిమాలో కూడా మంచి కిక్ ఇచ్చాయి. శ్రీనివాస్ జె రెడ్డి సినిమాటోగ్రఫి, వైష్ణవ్ వాసు ఎడిటింగ్ చక్కగా కుదిరాయి. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

Slum Dog Husband Telugu Movie Review and Rating: Pranavi Manukonda, Brahmajis fun loving emotional dog drama

స్వార్ధంతో కూడిన మనుషుల కంటే ప్రేమ, విశ్వాసం చూపించే జంతువులే మిన్న అనే పాయింట్‌తో మానవ విలువలు, లవ్, మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందించిన చిత్రం స్లమ్ డాగ్ హస్పెండ్. కథను మరో లెవల్‌కు తీసుకెళ్లి బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అంశాలు ఉన్నప్పటికీ.. ఆ దిశగా కసరత్తు జరుగలేదా? అనే సందేహం కలుగుుతంది. సెకండాఫ్‌లో కోర్టు రూమ్ డ్రామాను మరింత ఎమోషనల్‌గా చెప్పాల్సి ఉందనిపిస్తుంది.

స్లమ్ డాగ్ హస్పెండ్ (Slum Dog Husband) కథను లచ్చి పాయింట్ ఆఫ్ వ్యూలో కంటే.. మౌనిక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి ఉండే డబుల్ ఇంపాక్ట్ ఉండేదనిపిస్తుంది. కుక్కతో లచ్చికి బదులు, మౌనికతో పెళ్లి చేసి.. విడాకుల డ్రామా నడిపి ఉండే క్యారెక్టర్లపై సింపతీ, ఎమోషన్స్ బాగా పండి ఉండేదనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే.. రెండు గంటలపాటు మనస్పూర్తిగా నవ్వుకొనే.. నవ్వించే చిత్రం ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. పైసా వసూలు చిత్రం. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X