ఫర్వాలేని సినిమా

By Staff

Snehamante Idera
- జలపతి
చిత్రం: స్నేహమంటే ఇదేరా!
నటీనటులు: నాగార్జున, సుమంత్‌, భూమిక, ప్రత్యూష, సుధాకర్‌
సంగీతం: శివశంకర్‌
కథ: సిద్ధిక్‌
నిర్మాత: ఆర్‌.బి.చౌదరి
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: బాలశేఖరన్‌

స్నేహమంటే ఇదేరా- ఈ సినిమా కేవలం సుమంత్‌ కోసం రూపొందించారేమో అనిపిస్తుందీ చిత్రం మొత్తం చూశాక. నాగార్జున, సుమంత్‌ లు ఫ్రెండ్స్‌ గా నటించిన చిత్రంలో మెలోడ్రామా ఎక్కవ. అతిసాధారణంగా తీసిన సినిమాలో చూడదగ్గ సీన్స్‌ అన్ని ఫస్ట్‌ హాఫ్‌ లోనే ఉన్నాయి. ప్రథమార్థం అంతా హాస్యం. అదీ కూడా బ్రహ్మనందం మీదే నడుస్తుంది. ఈ చిత్రంలో హాయిగా చూడదగ్గ సీన్స్‌ అన్నీ బ్రహ్మనందంతోటే ఉండడం విశేషం. సినిమా నవ్వుతూ సాగి సీరియస్‌ గా మారుతుంది. ఆ తర్వాత సెంటిమెంట్‌ సీన్స్‌ శ్రుతిమించి- కొంచెం బోర్‌ కలుగుతుంది. ఓవర్‌ ఆల్‌ గా సాధారణ చిత్రం.

నాగార్జున, సుమంత్‌, సుధాకర్‌ ఫ్రెండ్స్‌. నాగ్‌, సుమంత్‌ లు జాన్‌ జిగిరీ దోస్త్‌ లు. నాగ్‌ చెల్లెలు ప్రత్యూష సుమంత్‌ ను ప్రేమిస్తుంది. కానీ ఫ్రెండ్‌ చెల్లెలను ప్రేమించడం తప్పు అనుకుంటాడు సుమంత్‌. ప్రత్యూష నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నాగ్‌, సుమంత్‌ లు ఓ గొడవలో ఇరుక్కుంటారు. ఈ గొడవల నుంచి దూరంగా ఉండాలని- హైదరాబాద్‌ వెళ్తారు. హైదరాబాద్‌ లో ఓ పెద్ద బంగాళాకు పెయింట్స్‌ వేసే కాంట్రాక్ట్‌ కు బ్రహ్మనందంకు దొరుకుతుంది. అక్కడ సుధాకర్‌ పనిచేస్తుంటాడు.ఇక్కడికి వీరు నాగ్‌, సుమంత్‌ చేరుకుంటారు. ఇక, ఈ బిల్గింగ్‌ లో వీరు వేసే పెయింట్స్‌ వేసే ప్రయత్నంలో జరిగే సంఘటనలన్నీ కడుపుబ్బ నవ్విస్తాయి. ఈ ఇంటి యువరాణే- భూమిక. భూమికను నాగ్‌ ప్రేమిస్తాడు. భూమిక కూడా ప్రేమిస్తోంది అనుకుంటాడు.

భూమిక మీద కోపంతో ఆమె చెల్లెలు- నాగ్‌ కు లవ్‌ లెటర్స్‌ పంపిస్తుంటుంది. భూమిక పంపిస్తోందని అనుకొని అతను ఆమెను ప్రేమిస్తాడు. కానీ భూమికకు వేరే అబ్బాయితో సంబంధం కుదురుతుంది. అప్పుడు సుమంత్‌ రెచ్చిపోయి, ఆ సంబంధ చెడిపోయేలా చేస్తాడు. దాంతో భూమిక- సుమంత్‌ మీద కక్ష తీర్చుకునేందుకు నాగ్‌ ను పెళ్ళి చేసుకుంటుంది. కానీ ప్రత్యూష మీద మనసు పారేసుకున్న వాళ్ళ బావ సుమంత్‌ ను నాగ్‌ నుంచి దూరం చేసేందుకు ప్రయత్నిస్తాడు. వాడు ఆ ప్రయత్నంలో సక్సెస్‌ అవుతాడు. చివరకు వీళ్ళు ఇద్దరూ మళ్ళీ ఎలా కలుసుకుంటారనేది క్లైమాక్స్‌.

సినిమాలో సుమంత్‌ ను ఎలివేట్‌ చేయాలనేందుకు బాగా ప్రయత్నించాడు దర్శకుడు బాలశేఖరన్‌. సుమంత్‌ ఈ చిత్రంలో బాగానే నటించాడు. కానీ ఇప్పటికీ డిక్షన్‌ మారలేదు. ఎమోషనల్‌ సీన్స్‌ లో ఎఎన్‌ ఆర్‌ ను అనుకరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక నాగార్జున నటన పేలవంగా ఉంది- ఒక్క క్లైమాక్స్‌ సీన్‌ లో తప్ప. కోమాలోకి వెళ్ళిన వాడిలాగా బాగా నటించాడు. ఇక భూమిక ఫర్వాలేదు. అందరికన్నా బ్రహ్మనందం బాగా ఎలివేట్‌ అయ్యాడు. బ్రహ్మనందం ఉన్న 40 నిమిషాలు నవ్వులే నవ్వులే. శివశంకర్‌ సంగీతం మరీ యావరేజ్‌. టైటిల్‌ సాంగ్‌ తో పాటు మరో పాట మాత్రమే బాగుంది. బాలశేఖరన్‌ దర్శకత్వం ఓకే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X