twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాత...'స్నేహితుడే'

    By Staff
    |
    Snehituda
    Rating
    సంస్థ: సత్యం ఎంటర్టైన్మెంట్స్
    నటీనటులు: నాని, మాధవీ లత, నాజర్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం,
    యం.యస్.నారాయణ, కిన్నెర, సౌమ్యా రాయ్ తదితరులు...
    సంగీతం: శివరామ్ శంకర్
    దర్శకత్వం: సత్యం బెల్లంకొండ
    నిర్మాతలు: జెమిని ఫిల్మ్ సర్య్కూట్స్

    స్నేహితుడా చిత్రం ఇద్దరి మధ్య వున్న స్నేహబంధం...ఆపై ఆ స్నేహం ఎలా ప్రేమగా మారిందన్న రొటీన్ కథాంశాన్నే తీసుకొనే తీసారు. ఇక కథ విషయానికి వస్తే సాయి(నాని) కి ఎవ్వరూ వుండరు. ఎలాంటి బాధ్యతలు లేకుండా బిందాస్ గా వుంటాడు. ఇలాంటి సాయి ఓ సారి సావిత్రి(మాధవీ లత )ని కలుస్తాడు. వీరిద్దరికీ క్షణం పడదు...ఎప్పుడూ గొడవ పడుతుంటారు. అలాంటిది సావిత్రి ఓ రోజు వాళ్ల నాన్నతో గొడవపడి ఇంట్లోంచి బయటకొచ్చేస్తుంది, సాయిని సాయం కోరుతుంది. సాయి తనకి సాయపడతాడు...దీంతో వారిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. ఇక మిగిలిన కథ సావిత్రి ఇంట్లో నుంచీ బయటకు రావడానికి దారితీసిన పరిస్థితులేంటి....ఎలా సాయి, సావిత్రిల స్నేహం ప్రేమగా మారిందనేది.

    ఇక నాని ఈ చిత్రం మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. చక్కటి నటనను ప్రదర్శించాడు. ఇతర ప్రాంతాల నుండీ హీరోయిన్లు దిగుమతి అవుతున్న ఈ రోజుల్లో మన తెలుగు అమ్మాయి మాధవీ లత తన నటనతో వారందరి కంటే ఎంతో నయం అనిపించుకొంది. నచ్చావులే చిత్రం ద్వారా పరిచయమైన మాధవి నటనకు అవకాశం వున్న పాత్రలో చక్కగా నటించింది. నాజర్, తనికెళ్ల భరణి తమ పాత్రలకు న్యాయం చేసారు. బ్రహ్మానందం, యం.యస్.నారాయణ ల కామెడీ ఫర్వాలేదనిపించుకుంది. ఇక మిగితా పాత్రధారులు తమ పరిధిమేర బాగానే నటించారు.

    దర్శకుడు సత్యం బెల్లంకొండ కథను చెప్పిన తీరు బాగుంది. కాకపోతే స్క్రీన్-ప్లే పై కొంచం శ్రద్ధ పెట్టుంటే సినిమా ఇంకా బాగుండేది. ఈ చిత్రానికి నాని, మాధవిలత ల నటన తర్వాత మెయిన్ హైలెట్ సంగీతం. 'ప్రియమైన నీకు' ఫేం శివరామ్ శంకర్ అందించిన పాటలు సంధర్భోచితంగా వుండి ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. మొత్తానికి కథ రొటీనే అయినా నటీనటుల ప్రతిభ, సంగీతం ప్రభావం చూపుతాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X