Sodara Movie Review : సోదరా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సంజోష్, ఆర్తీ గుప్తా,ప్రాచీ భన్సాల్,బాబు మోహన్, బాా భాస్కర్ తదితరులు
దర్శకత్వం: మన్మోమోహన్ మేనంపల్లి
నిర్మాత: చంద్ర చగన్లా
ఎడిటింగ్: శివ శ్రావణి
సంగీతం: సునీల్ కశ్యప్
బ్యానర్: క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్: 2025-04-25

వరంగల్ జిల్లాలో గోళిసోడాల వ్యాపారం చేసుకొనే కుటుంబానికి చెందిన చిరంజీవి (సంపూ), పవన్ (సంజోష్) అన్నాదమ్ములు. తమ్ముడు అంటే అన్నకు, అన్న అంటే తమ్ముడికి ప్రాణం. సోడాల వ్యాపారం చేసుకొంటూ పట్నంలో తమ్ముడిని ఉన్నత చదువులు చదివిస్తాడు. అయితే చిరంజీవికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడం ఫ్యామిలీకి బాధకు గురి చేస్తుంటుంది. దాదాపు 99 పెళ్లి చూపులు జరిగిన తర్వాత తన ఎదురింట్లోకి దివి (ఆర్తీ గుప్తా) ఫ్యామిలీ వస్తుంది. ఆర్తీని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. కానీ ఓ కారణంగా దివి ఫ్యామిలీకి, చిరంజీవి కుటుంబానికి పెద్ద గొడవ జరుగుతుంది. దాంతో దివీ ఆ ఊరు విడిచి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా, భువీ (ప్రాచీ భన్సాల్)తో పవన్ పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. అయితే చిరంజీవికి భువీకి పెళ్లి సంబంధం ఖాయం చేసి నిశ్చితార్థం కూడా పూర్తి చేస్తారు.

Sodara Movie Review in Telugu  Sampoornesh Babu comedy Entertainer

అయితే చిరంజీవికి పెళ్లి కుదరకపోవడానికి కారణం ఏమిటి? చిరంజీవికి దివికి మధ్య లవ్ ట్రాక్ ఎలా నడిచింది. ఏ కారణంగా దివి కుటుంబానికి చిరు ఫ్యామిలీకి గొడవ జరిగింది? పవన్ ప్రేమించి భువీతో చిరంజీవికి ఎంగేజ్ జరగడం ఏమిటి? తాను ప్రేమించిన అమ్మాయికి అన్నయ్యకు పెళ్లి కుదిరితే పవన్ రియాక్షన్ ఏమిటి? భువీని ఎవరు పెళ్లి చేసుకొన్నారు? దివితో చిరంజీవి ప్రేమకు ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే సోదరా సినిమా కథ.

సోదరా సినిమా కథలో ఎలాంటి కొత్తదనం, కాన్ ఫ్లిక్ట్ లేని రెగ్యులర్ కథ. కానీ సంపూ, సంజోష్ పాత్రలను డిజైన్ చేసిన విధానం కొత్తగా ఉంది. తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని అన్నయ్య నిశ్చితార్థం చేసుకోవడమేనేది కొత్తగా ఉంటుంది. దర్శకుడు మన్మోహన్ ఫస్టాఫ్‌ను సాదాసీదాగా నడిపించాడనిపిస్తుంది. కానీ క్లిష్టమైన పాయింట్‌ను సెకండాఫ్‌లో డీల్ చేసిన తీరు ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. ఇక సెకండాఫ్‌లో రాసుకొన్న కొన్ని బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ సీన్లు సినిమాకుప ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంపూ పెర్ఫార్మెన్స్ పూర్తి బలంగా కనిపిస్తుంది. రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రను చాలా సహజంగా, తనదైన శైలిలో నటించి మెప్పించాడు. సంజోష్ క్యారెక్టర్ చుట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటం, వాటిని చక్కగా ఆయన మరో రేంజ్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం బాగుంది. ఆర్తీ గుప్తా,ప్రాచీ భన్సాల్ బ్యూటీతోనే కాకుండా ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. బాబు మోహన్, ఇతర నటీనటులు గుర్తుండిపోయే పాత్రలను పోషించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్స్. గ్రామీణ వాతావరణంలోని పంట పొలాల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. ప్రాపర్‌గా రూరల్ సెటప్ వేసిన తీరు బాగుంది. ఆర్ట్ విభాగం పనితీరు చాలా బాగుంది. ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ ఇంకాస్త వర్క్ చేయాల్సి ఉండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. క్యాన్ నిర్మాణ సంస్థ అనుసరించిన విలువల్లో స్టాండర్స్ కనిపించాయి. అన్నాదమ్ముల మధ్య ఉండే ఎమోషన్స్‌తో రూపొందిన సినిమా ఇది. కథ పరంగా రెగ్యులర్‌గా అనిపించినా.. స్క్రీన్ ప్లే, టేకింగ్ పరంగా ఆకట్టుకొంటుంది. రూరల్ డ్రామాలను ఎంజాయ్ చేసే వారికి ఈ సినిమా నచ్చడానికి చాలా అంశాలు ఉన్నాయి.

More from Filmibeat

Read more about: sampoo babu mohan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X