Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సోకులెక్కువ-విషయం తక్కువ
సినిమా: సోగ్గాడు
నటీనటులు: తరుణ్, ఆర్తి అగర్వాల్, జుగుల్ హంసరాజ్,
కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుబ్బరాజు, కవిత,
విజయ్, దేవీ చరణ్, కల్పనా రాయ్, కవితా కృష్ణమూర్తి
అతిధి నటులు: వెంకటేష్, శ్రీయ, శ్రీకాంత్, సుమంత్
స్క్రీన్‌ప్లే: పరుచూరి బ్రదర్స్
మాటలు: నివాస్
పాటలు: భాస్కరభట్ల
సంగీతం: చక్రి
సమర్పణ: డి.రామానాయుడు
నిర్మాత: డి.సురేష్‌బాబు
కథ, దర్శకత్వం: రవిబాబు
కథలేకుండా సినిమా తీయడం ఎలా అని రిసెర్చి చేస్తున్న తెలుగు సినిమా పరిశ్రమ తాజాగా చేసిన మరో ప్రయోగం 'సోగ్గాడు'. చిన్న లైన్ తీసుకుని కథగా సాగదీయడంతో అది తెరపై తేలిపోయింది. సెకండాఫ్ డ్రాగాన్ అయి, పూర్తి స్ధాయి విసుగు కలిగిస్తుంది.
ఈ కథ కాని కథ చెప్పుకుంటే.... రవి (తరుణ్) సెవెన్ సీటర్ ఆటోవాలా కోట శ్రీనివాసరావు కొడుకు. పదో తరగతి పాస్ కాలేక బలాదూరుగా తిరిగే రవి ప్రేమ విషయాలు సెటిల్ చేస్తుంటాడు. అతనికి అయిదుగురు మిత్రులు. ఒకరోజు అందరూ సినిమాకు వెళ్తారు. అక్కడ స్వాతి (ఆర్తి అగర్వాల్) రవి కంట్లో పడుతుంది. ఆమెను వెంబడించి అడ్రసు తెలుసుకుంటాడు. ఆమె సిటీ గూండా సుబ్బరాజు చెల్లెలు. ఆమె వైపు ఎవరూ చూసినా సుబ్బరాజు సహించడు. రవి ఆమెను కలిసి ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు. ఇంతలో ఒకరోజు ఆమె ఎంగేజ్‌మెంట్ అని తెలుసుకుంటాడు. పెళ్ళి సమయంలో ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను ఎత్తుకొస్తాడు. ఆమె థాంక్స్ చెప్పి, 'చందు'ను కలుసుకోవాలంటుంది. రవిని ప్రేమించలేదంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్.
ఇంతకీ చందూ ఎవరు? ఆమె ప్రియుడు. ఇంతకీ రవి ఏమవుతాడు? తెరపై చూడాల్సిందే.
టెక్నికల్‌గా మంచి స్టాండర్డ్స్‌తో తీసిన ఈ సినిమా కెమెరా పనితనం బాగుంది. 'మధుమాసం'అనే పాట వినడానికి చూడడానికి బాగుంది. ఫస్టాఫ్‌లో ఉన్న కుక్కల మధ్య లవ్ ట్రాక్, సెకండాఫ్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ బాగున్నాయి. ఇంటర్వల్ బ్యాంగ్ మంచి ఆసక్తి కలుగజేసింది. డైలాగులు అక్కడక్కడ పేలాయి. ఇంటర్వెల్ వరకు ఆర్తి అగర్వాల్‌కు పెద్దగా డైలాగులు లేకపోవడం ప్రయోగం.
ఈ సినిమాలో తరుణ్ క్యారెక్టర్ 'ఎమోషన్ ఏదైనా ఎక్స్‌ప్రెషన్ ఒక్కటే' అన్నట్టు ఉంటుంది. ఇంటర్వల్ వరకు తరుణ్ చుట్టూ తిరిగిన కథ సెకండాఫ్‌లో ఆర్తి అగర్వాల్‌ను చుట్టుకుంటుంది. ఆ తర్వాత రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూది పైచేయి అవుతుంది. ఆర్తి అన్న సుబ్బరాజు క్యారెక్టర్ పండలేదు. తరుణ్ క్యారెక్టర్ చివరి వరకు పాసివ్‌గా ఉండడం పెద్ద లోపం. స్క్రీన్‌ప్లే సినిమాను దెబ్బ తీసింది.