Solo Boy Movie Review: సోలో బాయ్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు
దర్శకత్వం: పీ నవీన్ కుమార్
నిర్మాత: సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
సినిమాటోగ్రఫి: త్రిలోక్ సిద్ధు
మ్యూజిక్: జుడా సాండీ
లిరిక్ రైటర్స్: శ్యామ్ కాసర్ల, పూర్ణా చారి, చైతన్య ప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి
కొరియోగ్రాఫర్: ఆటా సందీప్
కాస్ట్యూమ్స్: రిషిక, వీణాధరి
బ్యానర్ - సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2025-07-04
మధ్య తరగతి కుటుంబానికి చెందిన కృష్ణమూర్తి (గౌతమ్ కృష్ణ) ఇంజనీరింగ్ చదువుతుంటాడు. కాలేజీ ఫ్రెషర్స్ డేలో ప్రియ (రమ్య పసుపులేటి)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఇష్టాఇష్టాలు ఒకటిగా ఉండటంతో ఇద్దరు ప్రేమించుకొంటారు. పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చే సమయంలో కృష్ణమూర్తికి ప్రియ బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన జీవితంలోకి వచ్చిన శృతి (శ్వేత అవస్థి)ని వివాహం చేసుకొంటాడు. తండ్రి హఠాన్మరణంతో కృష్ణమూర్తి లైఫ్ తలకిందులవుతుంది. అలాంటి సమయంలో కృష్ణమూర్తికి శృతి విడాకులు నోటీసులు ఇస్తుంది.

కృష్ణమూర్తితో పెళ్లిపీటల వరకు వచ్చిన లవ్ అఫైర్‌కు ప్రియ ఎందుకు బ్రేకప్ చెబుతుంది. ప్రియతో బ్రేకప్ తర్వాత కృష్ణమూర్తి పరిస్థితి ఏమైంది? బ్రేకప్ నుంచి తేరుకొని శృతిని ఎలా పెళ్లి చేసుకొన్నాడు? తనను ప్రాణంగా చూసుకొనే తండ్రి (పోసాని కృష్ణమురళి) మరణానికి కారణం ఏమిటి? తండ్రి మరణం తర్వాత పరిస్థితులు ఎలా తలకిందులయ్యాయి? కృష్ణమూర్తి తీవ్రమైన అప్పుల్లో ఎలా కూరుకుపోయాడు? భర్త కృష్ణమూర్తికి శృతి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకొన్నది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదురించి కృష్ణమూర్తి సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా ఎలా మారాడు అనే ప్రశ్నలకు సమాధానమే సోలోబాయ్ సినిమా కథ.
సమాజంలో జరుగుతున్న సంఘటనలు, వాటి వలన యువతకు ఎదురవుతున్న చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు నవీన్ కుమార్ రాసుకొన్న హార్ట్ టచింగ్‌గా ఉందనిపిస్తుంది. మిడిల్ క్లాస్ జీవితంలో ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండే బంధాలు, అనుబంధాలు, ప్రేమ అంశాలను ఆధారంగా చేసుకొని మంచి ఫీల్ గుడ్ సినిమాను అందించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. నేటి సమాజంలో ప్రేమికుల మధ్య కమర్షియల్ అంశాలు చక్కగా చూపించారు. తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వాళ్లు.. నా వాళ్లు అనుకొనే వారు వదిలేసి వెళ్లిన సమయంలో.. ఆ కష్టాల నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన కథ ఇన్సిపిరేషన్‌గా ఉంటుంది.
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా అశ్వత్థామగా భారీగా అభిమానులు సంపాదించుకొన్న గౌతమ్ కృష్ణ సోలో బాయ్‌గా తన పాత్రలో ఒదిగిపోయాడు. బరువైన, భారమైన రకరకాల ఎమోషన్స్ ఉన్న పాత్రను అవలీలగా పోషించాడు. పరిణతితో కూడిన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ప్రియగా రమ్య పసుపులేటి, శృతిగా శ్వేత అవస్థి తమ పాత్రలకు న్యాయం చేశారు. గ్లామర్ పరంగానే కాకుండా పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. తల్లితండ్రులుగా పోసాని, అనితా చౌదరీ గుర్తుండిపోయే నటనను ప్రదర్శించారు. ఆనంద చక్రపాణి, కమెడియన్ భద్రం, షఫీ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సోలో బాయ్ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. ఎమోషనల్ కథకు, యూత్‌పుల్ సాంగ్స్‌కు జుడా సాండీ అందించిన మ్యూజిక్ హైలెట్‌గా చెప్పుకోవచ్చు. త్రిలోక్ సుద్దు సినిమాటోగ్రఫి బాగుంది. డిఫరెంట్ ఎపిసోడ్స్‌కు ఉపయోగించిన లైటింగ్ సినిమాను రిచ్‌గా మార్చింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. ఇక బట్టల రామస్వామి బయోపిక్ లాంటి ఫీల్‌గుడ్ సినిమాను అందించిన సెవెన్ హిల్స్ సతీష్.. తన మూడో చిత్రంగా సోలోబాయ్‌ని అందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీ పడని ఆయన ఈ సినిమాను కూడా క్వాలిటీతో, టెక్నికల్ వాల్యూస్‌తో తీర్చిదిద్దిన విధానం చూస్తే.. సినిమాపై ఆయనకు ఉన్న తపన ఏమిటో అర్ధమవుతుంది.
మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్, రైతుల కథను బేస్‌గా చేసుకొని రూపొందించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సోలో బాయ్. ఈ సినిమాకు నిర్మాణ విలువలు స్పెషల్ ఎట్రాక్షన్. అలాగే గౌతమ్ కృష్ణ పెర్ఫార్మెన్స్, రమ్య, శ్వేత గ్లామరస్ కంటెంట్ యూత్‌కు కనెక్ట్ అవుతుంది. అయితే ఇంకా కొంత కథ, కథనాలు, సన్నివేశాలపై దృష్టిపెట్టాల్సింది. యూత్‌ఫుల్ కంటెంట్, ఇన్సిపిరేషన్ జర్నీతో రూపొందే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











