twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోలో బ్రతుకే సో బెటర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: సాయిధరమ్ తేజ్, నభా నటేష్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్
    Director: సుబ్బు

    నటీనటులు: సాయిధరమ్ తేజ్, నభా నటేష్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్, వెన్నెల కిషోర్, అజయ్, సత్య, కల్యాణి నటరాజన్ తదితరులు
    దర్శకత్వం: సుబ్బు
    నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
    మ్యూజిక్: ఎస్ థమన్
    సినిమాటోగ్రఫి: వెంకట్ సీ దిలీప్
    ఎడిటింగ్: నవీన్ నూలీ
    బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
    రిలీజ్: 2020-12-25

    సోలో బ్రతుకే సో బెటర్‌ కథ

    సోలో బ్రతుకే సో బెటర్‌ కథ

    ప్రేమలు, పెళ్లిళ్లు, బంధాలు, అనుబంధాలంటే పట్టని విరాట్ (సాయిధరమ్ తేజ్) వైజాగ్‌లోని ఓ కాలేజీలో విద్యార్థి. లవ్, మ్యారేజ్, ఎమోషన్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సోలో బ్రతుకే సో బెటర్ అనే పుస్తకాన్ని రచిస్తాడు. తనకు బ్రహ్మచారులుగా ఎంతో ఖ్యాతి సంపాదించిన మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయ్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సంఘ సేవకురాలు మదర్ థెరిస్సా, లతా మంగేష్కర్, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తిని ఆదర్శంగా భావిస్తాడు. అలా బ్రహ్మచారిగా ఉండాలని, పెళ్లికి విరుద్ధంగా ఉండాలనుకొంటున్న సమయంలో ఓ సంఘటన తన జీవితంలో ఊహించని మార్పు తెస్తుంది. ఈ క్రమంలో తన సిద్దాంతాలను, భావాలను ఇష్టపడే అమృత (నభా నటేష్) తన జీవితంలోకి వస్తుంది.

    సోలో బ్రతుకే సో బెటర్‌ ట్విస్టులు

    సోలో బ్రతుకే సో బెటర్‌ ట్విస్టులు

    పెళ్లి చేసుకోవద్దని శపథం చేసిన విరాట్ జీవితంలో చోటుచేసుకొన్న మార్పు ఏమిటి? తనను అమితంగా ఇష్టపడే అమృత విరాట్ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. మామ వేణు (రావు రమేష్) విరాట్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాడు. ఏ పరిస్థితుల్లో తన సిద్దాంతాన్ని మార్చుకోవడానికి విరాట్ సిద్ధపడ్డాడు అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం.

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    జీవిత ఆశయాలకు, లక్ష్యాలకు పెళ్లి, ఫ్యామిలీ బంధాలు అడ్డుపడుతాయనే పాయింట్‌ను దర్శకుడు సుబ్బు ఎంచుకొన్న తీరు బాగుంది. తన బలంగా నమ్మిన పాయింట్‌ను తొలిభాగంలో ఒడిదుడుకుల మధ్య ముందుకు తీసుకెళ్లాడు. ఇక విరాట్ తన సిద్దాంతం విషయంలో యూటర్న్ తీసుకొన్న తర్వాత దర్శకుడు కాస్త తడబాటుకు గురయ్యాడనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే రావు రమేష్‌ పాత్రతో చెప్పించిన డైలాగ్స్, చేయించిన భావోద్వేగమైన సీన్లు కథలోని తడబాటును కొంచెం తగ్గించడానికి ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు. కథను మరో మలుపు తిప్పడానికి రావు రమేష్ పాత్రను ఎఫెక్టివ్‌గా వాడుకోవడం దర్శకుడి పనితీరుకు అద్దం పట్టింది. సత్య, వెన్నెల కిషోర్‌తో నడిపించిన కామెడీ రిలీఫ్‌గా ఉంటుంది.

    విరాట్‌గా సాయిధరమ్ తేజ్

    విరాట్‌గా సాయిధరమ్ తేజ్

    ఇక విరాట్‌ పాత్రలోకి సాయిధరమ్ తేజ్ ఒదిగిపోయాడు. ఎప్పటిలానే ఫైట్స్, డ్యాన్సులతో అలరించాడు. సినిమా తొలి భాగంలో జోష్‌తో కనిపిస్తాడు. ఇక సెకండాఫ్‌లో భావోద్వేగాలతో నలిగిపోయే పాత్రలో తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటాడు. జీవితంలో తాను అనుసరించిన విధానాలకు పశ్చాత్తాపం చెందిన తర్వాత తల్లిదండ్రలుకు, తన మామకు చేరువయ్యే క్రమంలో వచ్చే సీన్లలో సాయిధరమ్ చాలా మెచ్యురిటీగా కనిపిస్తాడు.

    నభా నటేష్ గురించి

    నభా నటేష్ గురించి

    ఇక సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంలో నభా నటేష్ పాత్ర పరిమితంగా ఉంటుంది. కాకపోతే కథ, కథనంలో కీలకమని చెప్పవచ్చు. కథ గమనాన్ని మార్చే పాత్రకు నభ నటేష్ న్యాయం చేశారు. రొటీన్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా, గ్లామర్‌కు పెద్దగా స్కోప్ పాత్రలో కనిపించారు. ఇక ఈ చిత్రంలో సత్య, వెన్నెల కిషోర్ పాత్రలు ఆకట్టుకొంటాయి. వెన్నెల కిషోర్ కొత్త తరహా డైలాగ్ డెలివరీ, గెటప్‌తో అలరించాడు.

    రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ గురించి

    రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ గురించి

    ఇక సోలో బ్రతుకే సో బెటర్‌ చిత్రంలో భావోద్వేగం నింపే పాత్రలో సీనియర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కనిపించారు. ముఖ్యంగా రావు రమేష్ పాత్ర ప్రేక్షకులను ఎమోషనల్‌గా మార్చేస్తాయి. రావు రమేష్ నటించిన వేణు పాత్రకు కొన్ని సీన్లే ఉన్నప్పటికీ ప్రేక్షకుల మనసులో బలంగా నాటుకుపోతాయి. కథను మరో మలుపు తిప్పే పాత్రలో రావు రమేష్ మరోసారి సత్తా చాటారు.

    సాంకేతిక విభాగాల పనితీరు..

    సాంకేతిక విభాగాల పనితీరు..

    ఇక సాంకేతిక విభాగాల్లో మ్యూజిక్ విషయానికి వస్తే కథ యాప్ట్‌గా ఉండే విధంగా రీరికార్డింగ్‌ను ఎస్ థమన్ అందించారు. నో పెళ్లి, హేయ్ ఇది నేనేనా అనే పాటలు బాగున్నాయి. ఇక వెంకట్ సీ దిలీప్ కెమెరా పనితనం బాగుంది. వైజాగ్ అందాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది.

    నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయంటే

    నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయంటే

    సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమాను ఓ ఫీల్‌గుడ్‌గా మార్చేందుకు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ చేసిన ప్రయత్నాలు అభినందనీయం. ఎప్పటిలానే శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర అనుసరించే నిర్మాణ విలువలు పుష్కలంగా కనిపిస్తాయి. ఈ సినిమా పాయింట్ బాగున్నా.. పూర్తి స్థాయిలో కథగా మలచకపోవడం, ఎమోషనల్‌గా మార్చకపోవడం కొంత లోపంగా కనిపిస్తుంది.

    Recommended Video

    Anil Ravipudi Hilarious Fun With Vennela Kishore | Solo Brathuke So Better Interview
    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    జీవితంలో ఒంటరి జీవితంలో ఉండే మజా.. వైవాహిక జీవితంలో ఉండదంటూ విరాట్ చేసే ప్రచారంతో కథ మొదలవుతుంది. అయితే కథనంలో వేగం లేకపోవడంతో సినిమా ప్రథమార్థం రొటీన్‌గా సాగుతుంది. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు కథా ముడిసి సరుకు మారిన తర్వాత కొంత జోష్ కనిపిస్తుంది. కానీ మరో లెవెల్‌కు చేరేంతగా లేకపోవడం లోపంగా మారినట్టు కనిపిస్తుంది. కాకపోతే రావు రమేష్ ఎమోషనల్ సీన్లు కథలోకి వచ్చిన తర్వాత సినిమా ఫీల్‌గుడ్‌గా మారినట్టు కనిపిస్తుంది. లాక్‌డౌన్ కాలంలో థియేటర్లకు దూరమైన ప్రేక్షకులకు సినిమాటిక్ అనుభూతిని, ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌ను తప్పకుండా పొందే చిత్రంగా సోలో బ్రతుకే సో బెటర్‌ రూపొందిందని చెప్పవచ్చు. యూత్ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్న రొమాంటిక్, కామెడీ, ఎంటర్‌టైనర్ అని చెప్పవచ్చు.

    English summary
    Solo Brathuke So Better is romantic comedy film directed by Subbu and produced by BVSN Prasad. Sai Dharam Tej and Nabha Natesh in lead roles. It was scheduled to release on 1 May 2020,but was postponed due to the COVID-19 pandemic. It is set to be released theatrically on 25 December 2020, through Zee Studios.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X