Blind Review: పెళ్లి తర్వాత సోనమ్ కపూర్ చేసిన సినిమా 'బ్లైండ్' రివ్యూ.. ఎలా ఉందంటే?
రేటింగ్: 2/5
టైటిల్: బ్లైండ్ (హిందీ)
నటీనటులు: సోనమ్ కపూర్, పురబ్ కోహ్లి, వినయ్ పాఠక్, శుభమ్ సరాఫ్, దనేష్ రజ్వి, లిలిత్ దూబే తదితరులు
సినిమాటోగ్రఫీ: గైరిక్ సర్కార్
సంగీతం:క్లింటన్ సెరెజో, బ్రియాంక గోమ్స్
నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, కనాయి, ఏవీఎమ్ఏ అండ్ క్రాస్ పిక్చర్స్
నిర్మాత సుజయ్ ఘోష్
దర్శకత్వం: షోమ్ మఖిజ
ఓటీటీ విడుదల తేది: జూలై 7, 2023
ఓటీటీ వేదిక: జియో సినిమా
హిందీ చిత్ర పరిశ్రమలో కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ముద్దగుమ్మ సోనమ్ కపూర్ (Sonam Kapoor). బాలీవుడ్ సీనియర్ అండ్ హ్యాండ్సమ్ యాక్టర్ అనిల్ కపూర్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సోనమ్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటి తాజాగా నటించిన చిత్రం 'బ్లైండ్' (Blind 2023). 2011లో విడుదలైన కొరియన్ మూవీ 'బ్లైండ్'ను అదే పేరుతో హిందీలో రీమేక్ చేసి రిలీజ్ చేశారు. జియో సినిమా (Jio Cinema) డిజిటల్ ప్లాట్ ఫామ్ పై జూలై 7 నుంచి ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న సోనమ్ కపూర్ బ్లైండ్ (Blind Review Telugu) సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:జియా సింగ్ ప్రతిభావంతురాలైన పోలీస్ ఆఫీసర్. రాత్రి పార్టీలో ఎంజాయ్ చేస్తున్న తమ్ముడు అడ్రియాన్ పెరైరా (దనేష్ రిజ్వి)ని బలవంతంగా ఇంటికి తీసుకెళ్తుంది. ఈ క్రమంలో కారు యాక్సిడెంట్ అయి తమ్ముడిని, తన కంటి చూపు పోగొట్టుకుంటుంది. దీంతో జియా ఉద్యోగం కూడా పోతుంది. మరోవైపు సిటీలో వరుసగా అమ్మాయిల కిడ్నాప్స్ జరుగుతుంటాయి. కిడ్నాపర్ (పురబ్ కోహ్లి)కు సంబంధించిన తనకు తెలిసిన విషయాలను పోలీసు అధికారి పృథ్వీ ఖన్నా (వినయ్ పాఠక్) చెప్పి నిందితుడిని పట్టుకునేందుకు హెల్ప్ చేస్తుంది.

ట్విస్టులు: జియా సింగ్ సహాయంతో కిడ్నాపర్ ను పృథ్వీ ఖన్నా పట్టుకున్నాడా? జియా సింగ్ కు ఎదురైన సంఘటనలు ఏంటీ? ఆమె ఏం పోగొట్టుకుంది? జియా సింగ్ వెంట కిడ్నాపర్ ఎందుకు పడ్డాడు? జియా సింగ్ తోపాటు పోలీసులకు హెల్ప్ చేసే నిఖిల్ సరాఫ్ (శుభమ్ సరాఫ్) పాత్ర ఏంటీ? అసలు కిడ్నాపర్ ఏం చేస్తుంటాడు? అమ్మాయిలను ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు? అనే విషయాల సమ్మేళనమే బ్లైండ్ (Blind Movie).

విశ్లేషణ:బ్లైండ్ మూవీ ఒక సైకో క్రైమ్ థ్రిల్లర్. ఇలాంటి జోనర్ సినిమాల్లో ఓ సైకో, మర్డర్స్, కిడ్నాప్స్ జరగడం.. చివరి వరకు విలన్ ను చూపించడం.. లేదా రివీల్ చేసిన సైకోను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయడం అంతా కామన్ గానే ఉంటుంది. కానీ దాన్ని ఎలా చిత్రీకరించారు, సన్నివేశాలు ఎంగేజింగ్ గా ఉన్నాయనేదే మనల్ని కన్నర్పకుండా చూపించేది. ఈ విషయంలో డైరెక్టర్ ఘోరంగా విఫలమయ్యాడనే చెప్పాలి. సినిమా స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయినా తర్వాత నిరాశజనకంగా, ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకుండా కథ సాగుతుంది.

ఇవే ప్లస్సులు: సైకో కిడ్నాప్స్, పోలీసుల ప్రయత్నాలు ఎక్కడ కొత్తగా అనిపించవు. అలా ప్లాట్ గా, చాలా బోరింగ్ గా సాగుతుంది. అమ్మాయిలను సైకో ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఏం చేస్తున్నాడు? అనే విషయాలను వదిలేశారు.కానీ సైకోతో జియా చెప్పే రెండు మూడు డైలాగ్స్ తన ధైర్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేలా బాగున్నాయి. పృథ్వీ ఖన్నాకు కిడ్నాపర్ గురించి జియా క్లూస్ ఇచ్చే సీన్ ఆకట్టుకుంటుంది. అలాగే సైకోకు తన వ్యక్తిత్వం చేసే ఫోన్ కన్వర్జేషన్ కూడా బాగుంది. సినిమా బిగినింగ్, ఎండింగ్ లో వచ్చే ర్యాప్ సాంగ్స్ బాగున్నాయి. బీజీఎమ్ పర్వాలేదనిపిస్తుంది. ఇంతకన్న సినిమా గురించి పెద్దగా చెప్పుకునే అంశాలు ఏం లేవు. ఎక్కువ చెప్పిన సినిమా స్పాయిలర్ అవుతుంది.
ఎవరెలా చేశారంటే?: బ్లైండ్ అమ్మాయిగా, ధైర్యవంతురాలైన జియాగా సోనమ్ కపూర్ బాగానే చేసింది. సైకోగా పురబ్ కోహ్లి నటన బాగుంది. కానీ ఆ పాత్ర ఎఫెక్టివ్ గా చూపించలేదు. కేవలం పోలీసుల అసమర్థతతోనే పురబ్ క్యారెక్టర్ ఎలివేట్ చేసినట్లుగా అనిపించింది. వినయ్ పాఠక్ బాగా చేశారు. మిగతా వాళ్లంతా పాత్ర పరిధిమేర నటించారు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే 2 గంటల అతి తక్కువ సమయం ఉన్న ఈ సైకో థ్రిల్లర్ బోర్ కొట్టిస్తుంది. ఎలాగు ఫ్రీ స్ట్రీమింగ్ కాబట్టి వీకెండ్ లో ఖాళీగా ఉంటే ఓ లుక్కెయొచ్చు (Blind Movie Review).


Click it and Unblock the Notifications











