Sound Party Review క్లీన్ కామెడీతో ఫన్ రైడ్.. సౌండ్ పార్టీ మూవీ రివ్యూ
Rating: 2.75/5
నటీనటులు: వీజే సన్నీ, శివన్నారాయణ, ఆలీ, సప్తగిరి, చలాకీ చంటీ, 30 Years పృథ్వీ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, రేఖ పర్వతాల తదితరులు
రచన, డైరెక్టర్: సంజయ్ శేరి
నిర్మాతలు: రవి పొలిశెట్టి, మహేంద్ర గజేందర్, శ్రీ శ్యామ్ గజేంద్ర
సమర్పణ, షో రన్నర్: పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్
మ్యూజిక్: మోహిత్ రెహమానిక్
సినిమాటోగ్రఫి: శ్రీనివాస్ రెడ్డి
ఎడిటర్: జీ అవినాష్
రిలీజ్ డేట్: 2023-11-24
తాతలు, ముత్తాతలు కాలం నుంచి కష్టపడకుండా సంపన్నులై పోవాలని డాలర్ కుమార్ (వీజే సన్నీ) కలలు కంటుంది. తండ్రి కుబేర్ కుమార్ (శివన్నారాయణ)తో కలిసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి ప్లాన్స్ వేస్తుంటారు. చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతారు. ఈ క్రమంలో 2 నెలలు జైలులో ఉంటే 2 కోట్ల డబ్బు ఇస్తానని ఎమ్మెల్యే వర ప్రసాద్ ఆఫర్ ఇస్తే దానికి కుబేర్, డాలర్ ఒప్పుకొంటారు. కానీ మానభంగం కేసులో ఇద్దరికి ఉరిశిక్ష పడుతుంది.
అప్పనంగా డబ్బు సంపాదించాలనే ఆశ వల్ల కుబేర్, డాలర్ కుమార్‌లకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తండ్రి కొడుకులను ఎమ్మెల్యే ఎలా మోసం చేశాడు? రేప్ కేసులో ఉరిశిక్ష పడిన తర్వాత వారి పరిస్థితి ఏంటి? జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఉరిశిక్ష నుంచి కుబేర్, డాలర్ తప్పించుకొన్నారా? 2 కోట్ల రూపాయలతో వారి జీవితం మారిందా? కుబేర్, డాలర్ ఫ్యామిలీతో బిట్ కాయిన్ అంశం ఎలాంటి డ్రామాను క్రియేట్ చేసిందనే ప్రశ్నలకు సమాధానమే సౌండ్ పార్టీ (Sound Party) కథ.

తండ్రి, కొడుకుల బాండింగ్ బ్యాక్ డ్రాప్‌తో ఫన్, ఎమోషన్స్, రొమాన్స్ అంశాలను కలిపి దర్శకుడు సంజయ్ శేరి రాసుకొన్న కథ, దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంది. ఫస్టాఫ్ కొంత స్లోగా, రొటీన్‌గా సాగినప్పటికీ.. సెకండాఫ్‌ను గ్రిప్పింగ్‌గా, ఎంగేజ్ నడిపించిన విధానంతో మూవీ ఫీల్‌గుడ్‌గా మారిందనిపిస్తుంది. సెన్సిబుల్, క్లీన్ కామెడీ సీన్ల కారణంగా మూవీ మంచి ఫన్ రైడ్‌గా మారిందని చెప్పవచ్చు. తొలి సినిమాతో సంజయ్ శేరి క్లీన్ కామెడీ చిత్రాన్ని అందించి తనకు తాను నిరూపించుకొన్నారు.
నటీనటుల విషయానికి వస్తే.. బిగ్‌బాస్ విన్న విజే సన్నీ స్క్రీన్ మీద మంచి ఈజ్‌తో కనిపించాడు. శివన్నారాయణ లాంటి సీనియర్ యాక్టర్‌తో కలిసి మంచి హ్యూమర్‌ను, ఫన్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఎమోషనల్ సీన్లలోను, రొమాంటిక్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. ఫృథ్వీ, సప్తగిరి, మాణిక్ రెడ్డి, చలాకీ చంటీ తదితరులు తమ పాత్రల మేరకు కామెడీని పండించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాలు పనితీరు బాగుంది. మోహిత్ రెహామానిక్ బీజీఎం, పాటలు బాగున్నాయి. శ్రీనివాస్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి సన్నివేశాలను రిచ్‌గా మార్చింది. ఫస్టాఫ్‌లో ఎడిటింగ్ పరంగా కొంత వర్క్ ఉందనిపిస్తుంది. ఓవరాల్‌గా అవినాష్ ఎడిటింగ్ కారణంగా సన్నివేశాలు పరుగులు పెట్టాయి.
పేపర్ బాయ్ మూవీతో డైరెక్టర్‌గా మారిన జయశంకర్ ఈ సినిమాకు షో రన్నర్‌గా, ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చడంలో ఆయన తన ప్రతిభ, అనుభవం సినిమాకు తోడ్పాటునందించిందనే చెప్పాలి. నిర్మాతగా మారి తొలి సినిమాతోనే రవి పొలిశెట్టికి క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ మూవీని నిర్మించిన విధానం, నటీనటుల ఎంపికను పరిశీలిస్తే.. రవి పొలిశెట్టికి సినిమాపై ఉన్న అభిరుచి తెలియజెప్పింది.

కామెడీ, ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. సింపుల్ కథ, క్లీన్ కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కథ, సన్నివేశాలపై మరింత కసరత్తు చేసి ఉంటే.. ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చి ఉండేవనిపిస్తుంది. నిర్మాత, దర్శకుల తొలి ప్రయత్నం మెప్పించేలా ఉంది. అంచనాలు లేకుండా వెళ్తే నిరాశ పరచదు. రెండు గంటలపాటు నవ్వుకొని బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓ సారి ఈ సినిమాపై లుక్కేయండి.


Click it and Unblock the Notifications











