Spider Man: Brand New Day Censor Review: స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సెన్సార్ రివ్యూ

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లో భాగంగా వస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ సినిమా ఇండియాలో సెన్సార్ బోర్డు కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్, సన్నివేశాలపై సెన్సార్ కత్తెర్లు వేసింది. ఈ చిత్రాన్ని రివ్యూ చేసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) భారతీయ సినిమా చట్టాల ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి ఈ మూవీని విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా గురించిన వివరాలు, సెన్సార్ వ్యవహారాల వివరాల్లోకి వెళితే..

అమెరికన్ సూపర్ హీరో ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న మరో స్పైడర్ మ్యాన్ చిత్రం స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (Spider-Man: Brand New Day). స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో ఇది నాలుగోది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాకు డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించారు. స్టాన్ లీ, స్టీవ్ డిటికో రచించిన స్పైడర్ మ్యాన్ పుస్తకం ఆదారంగా ఈ చిత్రాన్ని కెవిన్ ఫీజ్, ఆమీ పాస్కల్, అవి అరద్ నిర్మించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, జెండ్యా, సాదీ సింక్, జాకబ్ బాటాలాన్, జాన్ బెర్నథాల్ తదితరులు నటించారు.

Spider Man  Brand New Day Censor Review

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: బ్రెట్ పావ్లాక్, ఎఢిటింగ్: నాట్ సాండర్స్, జినా సన్సామ్, మ్యూజిక్: మైఖేల్ జియాచినో తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. మార్వెల్ స్టూడియోస్. పాస్కల్ పిక్చర్స్, సోని భాగస్వామ్యంలో ఈ చిత్రం జూలై 30వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సెన్సార్ చేసిన మార్పులు, చేర్పుల వివరాల్లోకి వెళితే..

ఈ సినిమా సెన్సార్ రివ్యూ సందర్భంగా మద్యపాన, ధూమపాన నిరోధం గురించిన మెసేజ్ చెప్పే విజువల్‌ను అదనంగా యాడ్ చేశారు. ఈ వ్యవహారం ప్రతీ సినిమాకు జరుగుతుండే తంతే అనే విషయం తెలిసిందే. సినిమా టైటిల్స్‌కు ముందు వచ్చే ఈ విజువల్స్‌ను చేర్చినట్టు సెన్సార్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు.

సినిమా నిడివిలో 11.45 నిమిషాలు, 1.45 నిమిషాలు, 1.53 నిమిషాల సమయంలో వచ్చే అసభ్య పదజాలం, అశ్లీల సన్నివేశాలకు సంబంధించిన ఆడియో, సబ్ టైటిల్స్‌ నుంచి తొలగించారు అనేది సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు.

ఇక ఇదిలా ఉండగా, ఈ చిత్రంలోని సుదీర్ఘ కాలం స్క్రీన్ పై సాగే లిప్‌లాక్ సన్నివేశాలను తొలగించారు. 44 నిమిషం, 57 నిమిషంలో వచ్చే ముద్దు సీన్లను తొలిగించారు. దాదాపు 8 సెకన్ల నిడివిపై కత్తెర వేశారు అని సెన్సార్ రిపోర్ట్ తెలిపింది. ఇక ఈ సినిమాకు మొత్తంగా యూఏ (UA13+) సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే 13 ఏళ్లకు పైబడిన వారు ఈ సినిమాను ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈ సినిమాను చూడొచ్చు అని సెన్సార్ మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X