For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్పైడర్ మ్యాన్: ఇంటూ ది స్పైడర్ వెర్స్ మూవీ రివ్యూ

  |

  Rating:
  3.5/5
  Star Cast: షామిక్ మూర్, జేక్ జాన్సన్, హెయిలీ స్టెయిన్ ఫెల్డ్, నికోలాస్ కేజ్
  Director: బాబ్ పెర్సిచెట్టి, పీటర్ రామ్ సే, రోడ్నీ రాథ్‌మాన్

  స్పైడర్ మ్యాన్ సినిమాలంటే చిన్న పిల్లలకే కాదు, పెద్ద వారికి చెప్పలేనంత ఇష్టం. భాష, ప్రాంతం అనే తేడా లేకుండా స్పైడర్ మ్యాన్ సిరీస్ సినిమాలను ఇప్పటి వరకు ఆదరించారు. స్పైడర్ మ్యాన్ సినిమాలపై ప్రేక్షకులకు ఉండే ఆకర్షణను దృష్టిలో ఉంచుకొని ఓ కలర్ ఫుల్ యానిమేటెడ్ సినిమాను సోని పిక్చర్స్ యానిమేషన్ రూపొందించింది. తాజాగా సోని నిర్మాణ సారథ్యంలో రూపొందిన స్పైడర్ మ్యాన్: ఇంటూ ది స్పైడర్ వెర్స్ మూవీని ఏడో స్పైడర్ మ్యాన్ మూవీగా పేర్కొంటున్నారు. అనేక రకాలైన స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్లతో రూపొందిన స్పైడర్ మ్యాన్ చిత్రం డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఎలాంటి అనుభూతికి గురిచేసిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

   స్పైడర్ మ్యాన్ కథ ఏమిటంటే..

  స్పైడర్ మ్యాన్ కథ ఏమిటంటే..

  ఆఫ్రికన్-అమెరికన్ జాతీయుడికి, పుయర్టో రికో దేశస్తురాలికి పుట్టిన బాలుడు మైల్స్ మోరేల్స్. ఓ దశలో రేడియాక్టివ్ స్పైడర్ కాటుకు గురవుతాడు. దాంతో గతంలో పీటర్ పార్కర్ (స్పైడర్ మ్యాన్) ఉన్న కొన్ని శక్తులు మైల్స్‌కు సంక్రమిస్తాయి. తనకు కొత్తగా వచ్చిన శక్తితో పీటర్ పార్కర్‌తోపాటు మరికొన్ని స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్లతో మైల్స్ జతకలుస్తాడు. ప్రస్తుత ప్రపంచానికి భిన్నంగా మరో విశ్వాన్ని సృష్టించాలనే దుష్ట పన్నాగానికి పాల్పడిన కింగ్ పిన్ (లీవ్ స్క్రైబర్)ను ఎదురించడానికి సిద్దపడుతాడు.

  స్పైడర్ మ్యాన్‌లొ ట్విస్టులు

  స్పైడర్ మ్యాన్‌లొ ట్విస్టులు

  తనకు కొత్తగా వచ్చిన శక్తితో మైల్స్ ఎలాంటి మ్యాజిక్ చేశాడు. కింగ్ పిన్ దుష్ట పన్నాగాన్ని ఎలా ఎదుర్కొన్నాడు. మిగితా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్లతో కలిసి ఎలాంటి సందడి చేశాడు? కలర్ ఫుల్‌గా, పక్కాగా యానిమేషన్‌తో రూపొందిన ఈ చిత్రం సాంకేతికంగా ఎలాంటి మ్యాజిక్ చేసిందనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర కథ.

  ఫస్టాఫ్‌లో

  ఫస్టాఫ్‌లో

  సాధారణ బాలుడైన మైల్స్‌ మోరేల్స్ తమ అంచనాలకు తగినట్టుగా స్టడీస్‌పై దృష్టిపెట్టకపోడంతో తల్లి దండ్రులు అతడిని బోర్డింగ్ స్కూల్‌కు తరలిస్తారు. అక్కడ క్లాస్ మేట్ వండాకు దగ్గరవుతాడు. తనకు ఇష్టమైన గ్రాఫిటీ ఆర్ట్‌ను ఓ రైల్వే స్టేషన్‌లో వేసే క్రమంలో స్పైడర్ కాటుకు గురవుతాడు. ఆ తర్వాత మరో విశ్వాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేసే కింగ్ పిన్ ల్యాబ్‌ను చూస్తాడు. ల్యాబ్‌లో సీక్రెట్‌ను తెలుసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం లాంటి అంశాలు తొలి భాగంలో కనిపిస్తాయి.

  సెకండాఫ్‌లో

  సెకండాఫ్‌లో

  సెకండాఫ్‌లో కింగ్ పిన్‌తో పోరాటాలు, ల్యాబ్ సీక్రెట్‌లను తెలుసుకొనే క్రమంలో జరిగే ఫైట్స్ చూడ ముచ్చటగా ఉంటాయి. క్లైమాక్స్‌లో వేనోమ్ బ్లాస్ట్ చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. కింగ్ పిన్‌ను ఎదురించడానికి పార్కర్ లాంటి స్పైడర్ మ్యాన్‌లతో కలిసి చేసే సందడి థియేటర్లలో పిల్లలు పెద్దల చేత విజిల్స్ వేయించే విధంగా ఉంటాయి.

   మైల్స్ హావభావాలు

  మైల్స్ హావభావాలు

  సాధారణ బాలుడైన మైల్స్‌ అమాయకత్వం, చిలిపి పనులు ఆకట్టుకొనేలా ఉంటాయి. స్పైడర్ మ్యాన్ గెటప్‌లో కనిపించనపుడు యానిమేషన్‌లో పలికించిన హావభావాలు పిలల్ని విశేషంగా ఆకర్షించేలా ఉంటాయి. ఇక స్పైడర్ మ్యాన్ మారిన తర్వాత న్యూయార్క్ సిటీలోని ఎత్తైన భవనాలు, మెట్రో ట్రైన్ మీద చేసే విన్యాసాలతో ఫిదా కావాల్సిందే.

  స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్లకు వాయిస్ ఓవర్

  స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్లకు వాయిస్ ఓవర్

  మైల్స్ మోరెల్స్‌కు షామిక్ మూర్ గళాన్ని అందించగా, పీటర్ బీ పార్కర్‌కు జేక్స్ జాన్సన్, స్పైడర్ ఉమెన్ వెన్ స్టాసీకి హెయిలీ స్టెయిన్ పెల్డ్, స్పైడర్ మ్యాన్ నేయిర్ (పీటర్ పార్కర్) నికోలాస్ కేజ్, కింగ్ పిన్‌కు లెవ్ స్క్రెబర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  తాజా స్పైడర్ మ్యాన్ చిత్రంలో యానిమేషన్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. త్రీడీ టెక్నాలజీలో గ్రాఫిక్స్, యానిమేషన్ వర్క్‌ కొత్త అనుభూతికి గురిచేసేలా ఉంటుంది. పిల్లలతోపాటు పెద్దలు వీకెండ్‌లో ఆస్వాదించడానికి, వినోదించానికి స్పైడర్ మ్యాన్ చిత్రం కేరాఫ్ అడ్రస్. యానిమేషన్ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: షామిక్ మూర్, జేక్ జాన్సన్, హెయిలీ స్టెయిన్ ఫెల్డ్, నికోలాస్ కేజ్ తదితరులు
  డైరెక్టర్లు: బాబ్ పెర్సిచెట్టి, పీటర్ రామ్ సే, రోడ్నీ రాథ్‌మాన్
  నిర్మాతలు: అవి అరాడ్, అమీ పాస్కల్, ఫిల్ లార్డ్, క్రిస్టఫర్ మిల్లర్, క్రిస్టియాన స్టెయిన్ బెర్గ్
  స్క్రీన్ ప్లే: ఫిలా లార్డ్
  మ్యూజిక్: డేనియల్ పెంబెర్టన్
  నిడివి: 120 నిమిషాలు
  బడ్జెట్: 90 మిలియన్ల డాలర్లు
  రిలీజ్: 2018-12-14

  English summary
  Spider-Man: Into The Spider-Verse, the multidimensional mind-trip from Sony Pictures Animation, feels less like the seventh Spider-Man movie to hit the big screen and more like a one-of-a-kind, wall-crawling experience. It deserves top ranking among Spider-Man's greatest cinematic achievements, live-action or otherwise.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X