Spy Review నిఖిల్ మెప్పించాడా? స్పై మూవీ ఎలా ఉందంటే?

Rating:
2.5/5

నటీనటులు: నిఖిల్ సిద్దార్థ్, ఐశ్వర్య మీనన్, అభినవ్ గోమటం, సన్యా థాకూర్, ఆర్యన్ రాజేశ్, రానా దగ్గుబాటి, జిషుసేన్ గుప్తా, మకరంద్ దేశ్‌పాండే, రవివర్మ, దయానంద్ రెడ్డి, తదితరులు
దర్శకత్వం: గ్యారీ బీహెచ్
రచన: అనిరుధ్ కృష్ణ మూర్తి, కే రాజశేఖర్ రెడ్డి (కథ)
నిర్మాతలు: కే రాజశేఖర్ రెడ్డి
సీఈవో: చరణ్ తేజ్ ఉప్పలపాటి
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫి: మార్క్ డేవిడ్, వంశీ పచ్చిపులుసు
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
ఆర్ట్: అర్జున్ సురిశెట్టి
స్టంట్స్: రాబర్ట్ లేనెన్
రిలీజ్ డేట్: 2023-06-28

విజయ్ అలియాస్ జయ్ (నిఖిల్ సిద్దార్థ్) రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో పనిచేసే ఏజెంట్. జయ్ సోదరుడు సుభాష్ (ఆర్యన్ రాజేష్) రా ఏజెంట్‌గా పనిచేస్తూ శత్రువుల చేతిలో మరణిస్తాడు. సోదరుడి మరణం ఓ పక్క వెంటాడుతుండగా.. మరో వైపు దేశం కోసం తన కొలిగ్ కమల్ (అభినవ్ గోమటం) పలు మిషన్స్‌లో పాల్గొంటుంటాడు. ఈ క్రమంలో వైష్ణవి (ఐశ్వర్య మీనన్)తో ప్రేమలో పడుతాడు. భారత్‌లో విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్న ఖాదర్ () ప్లాన్స్ విచ్ఛిన్నం చేయడానికి కమల్, వైష్ణవితో కలిసి జోర్డాన్‌కు వెళ్తాడు.

Spy Telugu Movie Review and Rating: Nikhil Siddharths unimpressive action drama

సుభాష్ ఎలా చనిపోయాడు? చనిపోయాడనుకొన్న ఖాదర్ ఎలా బతికి వచ్చాడు? తన సోదరుడు మరణం వెనుక కారణాలను తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నించాడు? నేతాజీ ఫైల్స్‌కి ఈ సినిమా కథకు సంబంధం ఏమిటి? జయ్‌తో ప్రేమలో పడిన వైష్ణవి ఎవరు? తన సోదరుడి మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు? ఖాదర్‌ ప్లాన్స్ ఎలా భగ్నం చేశాడు? జయ్ పాల్గొనే మిషన్‌కు సపోర్ట్ చేసిన అర్జున్ రోల్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే స్పై సినిమా కథ.

ఖాదర్‌ను చంపేందుకు విదేశాలకు వెళ్లిన సుభాష్ ఎలా చనిపోయాడనే సీన్‌తో మూవీ ఎమోషనల్‌‌గా మొదలవుతుంది. కానీ అదే ఎమోషన్స్‌ను కొనసాగిస్తూ కథ ముందుకు తీసుకుపోవడంలో ఆదిలోనే తడబాటు కనిపిస్తుంది. సీరియస్ యాక్షన్ ఎపిసోడ్‌తో నిఖిల్ ఎంట్రీ చాలా పేలవంగా, చాలా కామెడీగా ఉంటుంది. కథ సాగే తీరు చాలా నిరసంగా, అతుకులు అతుకులుగా ఉంటుంది. నేతాజీ ఫైల్స్ అని చెప్పడంతో వచ్చిన సీరియస్ ఆడియెన్స్‌ ఈ సినిమా చూస్తున్నంత సేపు నిరాశ, అసంతృప్తి కలుగుతుంది. కంటెంట్ లేకుండా సినిమాను నాసిరకంగా చూపించే ప్రయత్నం చేశారనే చెప్పాలి.

Spy Telugu Movie Review and Rating: Nikhil Siddharths unimpressive action drama

దర్శకుడు గ్యారీ బీహెచ్ కథను నమ్ముకోవడం కంటే.. స్టైలిష్‌గా మేకింగ్‌పైనే దృష్టిపెట్టినట్టు అనిపిస్తుంది. సినిమాలో సరుకు లేకపోవడంతో స్టైలిష్‌ మేకింగ్ కూడా ఆకట్టుకోలేకపోయింది. ఎడిటర్‌గా సినిమాను ఓ పద్దతిగా చూపించే ప్రయత్నం చేసినట్టు అనిపించదు. ఇటీవల వచ్చిన పఠాన్, ఏజెంట్ సినిమాల సీన్లనే మళ్లీ చూసిన ఫీలింగ్ కలిగేలా స్పై మూవీని తీశాడనే ఫీలింగ్ కలుగుతుంది.

నిఖిల్ కొత్తగా చేయడానికి స్కోప్ లేకపోయింది. జయ్ పాత్ర పరంగా చూస్తే బాడీ లాంగ్వేజ్ కూడా బాగాలేదు. రా ఏజెంట్‌లో ఉండే చురుకుదనం లేకుండా నీరసంగా కనిపించాడనిపిస్తుంది. కార్తీకేయ 2 తర్వాత అంచనాలతో వచ్చిన ప్రేక్షకులకు నిరాశనే కలిగించాడని చెప్పవచ్చు. యాక్షన్ సీన్లలో ఫర్వాలేదనిపించాడు.

Spy Telugu Movie Review and Rating: Nikhil Siddharths unimpressive action drama

మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. వైష్ణవి పాత్రలో ఐశ్వర్య మీనన్ పర్వాలేదనిపిస్తుంది. గ్లామర్ కంటెంట్‌కు స్కోప్ లేకపోవడంతో ఐశ్వర్య తన ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం దాక్కలేదనే చెప్పాలి. కథలో సరస్వతి (సన్య థాకూర్)కు పెద్దగా ఛాన్స్ లేకపోయింది. విలన్ పాత్రకు తక్కువ కమెడియన్‌కు ఎక్కువ అనే విధంగా థాకూర్ పాత్ర ఉంది. కమల్ పాత్రలో అభినవ్ గోమటం కామెడీ అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. పాపం ఆర్యన్ రాజేష్‌కు మొక్కుబడిగా రెండు సీన్లు వేశారు. రానా దగ్గుబాటిది కూడా అదే పరిస్థితి. పోసాని, తనికెళ్ల భరణి, సచిన్ ఖేడ్కర్ లాంటి నటులు ఉన్నా వారికి తగిన ప్రాధ్యాన్యత కనిపించదు. మిగితా పాత్రల్లో నటించిన ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు కొంత బలంగా మారాయి. మార్క్ ఫెడ్, వంశీ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. పాటలకు స్కోప్ లేకపోయింది. ఉన్న ఒక్క పాట కాస్త ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది. శ్రీ చరణ్ పాకాల బీజీఎంతో మరోసారి ఆకట్టుకొన్నాడు. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు అంతంత మాత్రమే అని చెప్పాలి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

Spy Telugu Movie Review and Rating: Nikhil Siddharths unimpressive action drama

శతృదేశాల భారత్‌పై పన్నే కుట్రల నేపథ్యంగా యాక్షన్, ఎమోషనల్ డ్రామా స్పై. యాక్షన్ ఉంది కానీ ఎమోషన్ మిస్ అయింది. క్వాలిటీ ఉంది కానీ కంటెంట్ కనిపించదు. మొత్తంగా రొటీన్, రెగ్యులర్ కమర్షియల్ మూవీగా మిగిలిపోతుంది. ఇక సుభాష్ చంద్రబోస్ కొటేషన్స్, నేతాజీ ఫైల్స్ అంటూ డంబ ప్రచారం చేసిన యూనిట్.. ఆ దిశగా కథపై కసరత్తు చేసినట్టు కనిపించదు. కథకు సపోర్ట్‌గా రెండు డైలాగ్స్ చెప్పిస్తే సరిపోతుందా అనే ఫీలింగ్ కలుగుతుంది. మంచి అంచనాలతో వెళ్తే భారీ అసంతృప్తి మిగులుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఓకే అనుకొంటు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. నిఖిల్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో.

బిల్డప్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X