For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్పైడర్ మూవీ రివ్యూ: మహేశ్‌బాబు మరో'సారీ'..

  By Rajababu
  |

  Rating:
  2.0/5
  Star Cast: మహేశ్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, ప్రియదర్శి దర్శకుడు: ఏఆర్ మురుగదాస్
  Director: ఏఆర్ మురుగదాస్

  స్పైడర్ పబ్లిక్ టాక్ Spyder Public Talk

  శ్రీమంతుడు బ్లాక్ బస్టర్.. బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ తర్వాత మహేశ్ బాబు నటించిన చిత్రం స్పైడర్. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో తొలిసారి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా మహేశ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. దర్శకుడు ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా నటించడం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా మారింది అగ్రహీరోలతో జత కట్టి మంచి జోష్ మీద ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్ర కథానాయిక. ఇలాంటి రేర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  కథ సాగిందిలా..

  కథ సాగిందిలా..

  శివ (మహేశ్ బాబు) ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ప్రమాదాలు జరుగకముందే వాటిని ఆదుకోవాలన్న లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలో చేరుతాడు. కొత్త సాఫ్ట్‌వేర్లు కొనుగొని ఆపదలను ముందే పసిగట్టి వాటిని నివారిస్తుంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీలో జంట హత్యలు జరుగుతాయి. వాటి వెనుక ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి వేట ప్రారంభిస్తాడు. జంట హత్యలకు భైరవ (ఎస్‌జే సూర్య) కారణమని తెలుసుకొంటాడు. భైరవ ఎందుకు హత్యలు చేస్తుంటాడు? భైరవ వికృత క్రీడకు శివ ఎలా ముగింపు పలికాడు. భైరవను తుదముట్టించే క్రమంలో శివ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఈ కథలో ఛార్లీ ( రకుల్ ప్రీత్) పాత్ర ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే స్పైడర్.

  విశ్లేషణ..

  విశ్లేషణ..

  చావు కేకలు, ఏడుపులతో మహానందం పొందే ఓ దుష్టుడి పాత్ర చుట్టూ అల్లుకొన్న కథ స్పైడర్. చిన్నతనంలో సమాజంలో ఎదురైన పరిస్థితుల వల్ల ఓ బాలుడు దుష్టుడుగా ఎలా మారాడనే పాయింట్ పాయింట్ చుట్టూ దర్శకుడు మురుగదాస్ ఆసక్తిగానే అల్లుకొన్నారు. ఆ పాత్ర చుట్టూ ఉండే మిగితా పాత్రలను డిజైన్ చేయడంలో తడబాటు గురైనట్టు అనిపిస్తుంటుంది. సామాజిక అంశాల ఎక్కువగా సృశించే మురుగదాస్ మరోసారి అదే ప్రయత్నం చేశారు. గ్లామర్ ఇమేజ్ ఎక్కువ ఉన్న మహేశ్‌ను ఈ కథకు ఎంపిక చేసుకొని సాహసానికే ఒడిగట్టాడని చెప్పవచ్చు.

  స్క్రీన్ ప్లేతో మెరుగులు..

  స్క్రీన్ ప్లేతో మెరుగులు..

  చిత్ర ప్రారంభంలో ప్రేమ పేరుతో మోసపోయే ఓ అమ్మాయిని రక్షించే ఎపిసోడ్‌తో కథలోకి తీసుకెళ్లే విధానం మురుగదాస్ ప్రతిభకు అద్దం పట్టింది. ఆ తర్వాత కూడా అదే పంథాను కొనసాగించి బలమైన సన్నివేశాలను రాసుకొంటే సినిమా మరింత బాగుండేది. సాధారణమైన, రొటీన్ కథకు విభిన్నమైన స్క్రీన్ ప్లేతో మెరుగులు దిద్దాడు. ఎస్ జే సూర్య ఎంటీ తర్వాత సినిమా చాలా వేగం పుంజుకుంటుంది. ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. సెకండాఫ్‌లో మురుగదాస్ స్క్రీన్ ప్లే మ్యాజిక్‌లా ఉంటుంది. చివరల్లో మహేశ్‌తో చెప్పించిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపచేస్తాయి.

  ఫస్టాఫ్‌‌లో..

  ఫస్టాఫ్‌‌లో..

  మహేశ్ బాబు క్యారెక్టర్‌ ఎస్టాబ్లిష్ చేయడానికే తొలిభాగంలో ఎక్కువ సమయాన్ని తీసుకొన్నాడు. సీరియస్‌గా సాగే కథలో రకుల్‌తో ప్రేమ వ్యవహారాన్ని జొప్పించి ప్రేక్షకులక కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు ఎస్ జే సూర్య కారెక్టర్ ఎంట్రీతో కథ మరింత ఆసక్తిగా మారుతుంది. భైరవ తమ్ముడిగా నటించిన ప్రేమిస్తే ఫేం భరత్ మహేశ్ తుదముట్టించడంతో కథలో మరో ట్విస్ట్.

  సెకండాఫ్‌లో..

  సెకండాఫ్‌లో..

  రెండో భాగంలో విలన్, హీరో మధ్య క్యాట్ మౌస్ గేమ్ సాగుతుంది. సెకండాఫ్‌లో విలన్ బారిన పడిన తల్లి, తమ్ముడిని రక్షించుకొనే సన్నివేశానికి ప్రేక్షకులు థ్రిల్ గురి అవుతారు. మహేశ్ చేతిలో తుపాకీ తూటాలకు గురై ఓ ఇంట్లో దాక్కొన్న ఎస్ జే సూర్యపై మహిళలు ఎటాక్ చేసే సీన్ ఓ కొత్త ప్రయోగంగా కనిపిస్తుంది. విడుదలకు ముందు గొప్పగా చెప్పుకొన్న క్లైమాక్స్ సీన్లు మాత్రం ఆసక్తిని కలిగించలేకపోయాయి.

  మురుగదాస్ డైరెక్షన్ గురించి..

  మురుగదాస్ డైరెక్షన్ గురించి..

  గజనీ, కత్తి, తుపాకీ లాంటి సూపర్ హిట్లు అందించిన దర్శకుడు మురుగదాస్ ఈసారి మాత్రం స్క్రీన్ ప్లేను నమ్ముకొని స్పైడర్‌ను తీశాడనే అనుమానం కలుగుతుంది. కథపై మరింత కసరత్తు చేసి ఉంటే తన గత చిత్రాలకు మించిన విజయం దక్కేది. సామాజిక అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కథ బలహీనంగా మారిందనే భావన కలుగుతుంది. ఈ చిత్రంలో తెలుగు సినిమా కంటే ఎక్కువగా తమిళ వాసన కనిపించే విధంగా స్క్రిప్టును రాసుకోవడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది.

  తెరపై మహేశ్ మ్యాజిక్

  తెరపై మహేశ్ మ్యాజిక్

  మహేశ్ విషయానికి వస్తే కథ ఎలా ఉన్నా తన మార్కును చూపించడం అతని నైజం. ఈ చిత్రంలో మహేశ్ అదే చేశాడు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కొత్త లుక్‌లో కుర్రాడిలా కనిపించాడు. కీలక సన్నివేశాల్లో మహేశ్ తన నటనా ప్రతిభకు మరోసారి పదునుపెట్టాడు. సినిమా భారాన్ని మొత్తంగా తన భుజాలపైనే మోసాడు. పాటల్లో చురుకుగా స్పెప్పులు వేస్తూ ప్రేక్షకులు ఆకట్టుకొన్నాడు. ప్రేమ సన్నివేశాల కంటే యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉండటం కారణంగా లవర్ బాయ్‌గా అలరించలేకపోయాడు.

  పవర్ ఫుల్ పాత్రలో

  పవర్ ఫుల్ పాత్రలో

  భైరవ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్‌తో ఎస్ జే సూర్య అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. శాడిస్టుగా సూర్య కనబరిచిన నటన ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది. చాలా సన్నివేశాల్లో భైరవ పాత్ర హావభావాలు అబ్బురపరుస్తాయి. స్పైడర్‌కు సూర్య వెన్నముకగా నిలిస్తూ సినిమాను ఓ స్థాయికి చేర్చే ప్రయత్నం చేశాడు. గతంలో తెరపైన హీరోగా కనిపించిన సూర్యకు విలన్‌గానే మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రానికి సూర్య యాక్టింగ్ ప్లస్ పాయింట్.

  రకుల్ సాదాసీదాగా.

  రకుల్ సాదాసీదాగా.

  రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ స్టూడెంట్. ఈ చిత్రంలో చాలా సాదాసీదా పాత్ర. పెళ్లికి ముందే సెక్స్ ఎంజాయ్ చేయాలన్న కోరికతో రగిలిపోతుంటుంది. అలా రకుల్, మహేశ్ మధ్య కొన్ని సన్నివేశాలు ఇంట్రస్టింగానే ఉంటాయి. కథ కోసమే రకుల్ పాత్రను ఇరికించారా అనే ఫీలింగ్ కలుగుతుంది.

  హ్యారీస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  హ్యారీస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  సాంకేతిక విభాగానికి వస్తే ముందుగా సంగీత దర్శకుడు హ్యారీస్ జై రాజ్ గురించి చెప్పుకోవాలి. మోస్తారు సన్నివేశాలకు హ్యారీస్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. స్పైడర్ చిత్రానికి నేపథ్యం సంగీత హైలెట్. హ్యారీస్ జైరాజ్ పనితీరు స్పైడర్ మరో మెట్టును ఎక్కించింది. అయితే పాటలు బయట ఆకట్టుకోలేకపోయాయనేది సత్యం. కానీ తెర మీదైనా మ్యాజిక్ చేస్తాయా అని ఎదురు చూసిన ప్రేక్షకులకు కొంత నిరాశే మిగిలింది.

   సంతోష్ శివన్ కెమెరా

  సంతోష్ శివన్ కెమెరా

  అనుక్షణం యాక్షన్ పంథాలో సాగే సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ చాలా బాగా తెరకెక్కించారు. మహేశ్ బాబు, ఎస్ జే సూర్యల మధ్య సాగే సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచాడు. గ్రాఫిక్ వర్క్ చాలా నాసిరకంగా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ తీరుపై మరింత శ్రద్ధపెడితే విజువల్‌గా ఆకట్టుకునేవి.

  పీటర్ ఫైట్లు..

  పీటర్ ఫైట్లు..

  యాక్షన్ పార్ట్‌కు వస్తే రోడ్డుపై ఛేజింగ్ సీన్లు, బండరాయి ఎపిసోడ్, హాస్పిటల్ సీన్లను ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ మంచిగా డిజైన్ చేశాడు. ఎక్కువ మంది జనాల మధ్య తీసిన ఫైట్ సీన్లు పీటర్ ప్రతిభకు ఓ ఉదాహరణ అని చెప్పవచ్చు.

  చివరి మాట..

  చివరి మాట..

  కథతో కాకుండా కథనంతో దర్శకుడు మురుగదాస్ చేసిన కసరత్తు స్పైడర్. మహేశ్ బాబు ఇమేజ్ కాకుండా తన ఆలోచనలను నమ్ముకొని చేసిన సినిమా ఇది. కేవలం రెండు పాత్రలపై చేసిన వృధా ప్రయాణమిది. మిగితా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, తెలుగుదనం కంటే ఎక్కువ తమిళ వాసనే కనిపించడం ఓ ప్రతికూలత. తెలుగులో విజయవకాశాలు ఎలా ఉన్నా.. తమిళంలో భారీ హిట్‌గా మారే అవకాశం ఉంది. లాంగ్ వీకెండ్ కావడంతో భారీ కలెక్షన్లు మహేశ్ స్టామినాకు అద్దం పట్టడం ఖాయం.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్

  మహేష్‌, ఎస్‌జే సూర్య నటన

  మురుగదాస్ స్క్రీన్ ప్లే

  హ్యారీస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  సెకండాఫ్

  మైనస్ పాయింట్స్

  కథ

  ఫస్టాఫ్

  బలమైన సన్నివేశాలు లేకపోవడం

  తెర వెనుక, తెర ముందు..

  తెర వెనుక, తెర ముందు..

  నటీనటులు: మహేశ్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, ప్రియదర్శి తదితరులు

  దర్శకుడు: ఏఆర్ మురుగదాస్

  నిర్మాత: ఎన్వీ ప్రసాద్, టాగూర్ మధు

  సినిమాటోగ్రాఫర్: సంతోష్ శివన్

  మ్యూజిక్: హ్యారీస్ జైరాజ్

  ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌

  బ్యానర్‌: ఎన్‌వీఆర్‌ సినిమా ఎల్‌ఎల్‌పీ, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

  రిలీజ్ డేట్: 27 సెప్టెంబర్ 2017

  English summary
  Only two days away from one of the biggest releases of 2017 SPYDER starring Mahesh Babu, Rakul Preet Singh and SJ Suryah and directed by AR Murugadoss. It’s one of the biggest action films of this year. After stylish first look posters, an intriguing teaser and an action packed trailer, fans are now eager for the release. This is exclusive review for filmibeat viewers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X