For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SR Kalyana Mandapam Review: కిరణ్ అబ్బవరం వన్ మ్యాన్ షో!

  |

  Rating: 2.75/5

  టాలీవుడ్‌లోని యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం తన ప్రతిభతో విశేషంగా ఆకట్టుకొంటున్నారు. తన తొలి చిత్రం రాజా వారు రాణి గారు చిత్రంతో నటనపరంగా మంచి మార్కులు కొట్టేసిన యువ హీరో తన రెండో చిత్రం SR కల్యాణమండపంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అవుతూ శ్రీధర్ గాదే ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకొని ద్వితీయ విఘ్నాన్ని అధిగమించారా అనే విషయం తెలుసుకోవాలంటే కథ, కథనాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరును రివ్యూ చేయాల్సిందే.

  SR కల్యాణమండపం కథ ఇలా..

  SR కల్యాణమండపం కథ ఇలా..

  రాయలసీమలోని రాయచోటిలోని ధర్మ (సాయి కుమార్) అనే పెద్ద మనిషి ఎస్ఆర్ కల్యాణ మండపాన్ని నిర్వహిస్తుంటారు. ఆ ప్రాంతంలో ఏ పెళ్లి జరిగినా అదే ఫంక్షన్ హాల్‌లో జరిగాల్సిందనే గొప్ప పేరు ఉంటుంది. తండ్రి వారసత్వంగా వచ్చిన ఆ ఫంక్షన్‌ను సరిగా నడపలేకపోతాడు. కొన్ని కారణాల వల్ల ఆ ఫంక్షన్ హాల్‌ పరిస్థితి దారుణంగా మారుతుంది. ధర్మ కుమారుడు కల్యాణ్ (కిరణ్ అబ్బవరం), అతడి తల్లి (తులసి)కి తండ్రి నిర్వాకం నచ్చదు. పదేళ్లుగా తండ్రి, కొడుకుల మధ్య మాటలు ఆగిపోతాయి. ఇదిలా ఉండగా, తన కాలేజీలో తోటి విద్యార్థిని సింధూ (ప్రియాంక జవాల్కర్) ప్రేమిస్తుంటాడు కానీ ఆమె కిరణ్‌ను పట్టించుకోకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య తమ కుటుంబానికి ప్రతిష్టగా మారిన ఆ ఫంక్షన్ హాల్‌ను నిర్వహించేందుకు కల్యాణ్ ముందుకు వస్తాడు.

  కథ, కథనాల్లో ట్విస్టులు

  కథ, కథనాల్లో ట్విస్టులు

  SR కల్యాణ మండపం వెనుక ఉన్న అసలు కథేంటి? కల్యాణ మండపాన్ని నడిపించడంలో ధర్మ ఎందుకు విఫలమయ్యారు? తన తండ్రితో కిరణ్ ఎందుకు మాట్లాడకుండా ఉంటాడు? కిరణ్ ప్రేమను సింధూ ఎందుకు నిరాకరిస్తుంది? తమ కుటుంబానికి ప్రతిష్టగా మారిన కల్యాణ మండపానికి పూర్వ వైభవం సంపాదించారా? ధర్మ, కిరణ్ మళ్లీ కలుసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనే ప్రశ్నలకు సమాధానం SR కల్యాణ మండపం సినిమా కథ.

   ఫస్టాఫ్ కామెడీ టచ్‌తో

  ఫస్టాఫ్ కామెడీ టచ్‌తో

  SR కల్యాణమండపం యజమాని ధర్మ కోణంలో కథ ఎమోషనల్‌గానే ప్రారంభమవుతుంది. కానీ కథ చెప్పడంలో అక్కడక్కడ తడబాటు, ఒడిదుడుకులు, అస్పష్టత కనిపిస్తుంది. కానీ కల్యాణ్‌గా కిరణ్ అబ్బవరం ఎంట్రీతో మాస్ ఎలిమెంట్స్ ఊపందుకొంటాయి. అయితే సింధూ నడుము ఎపిసోడ్ ఆరంభంలో ఫన్ క్రియేట్ చేసినా.. పోను పోను కాస్త అతిగానే అనిపిస్తుంది. అయితే ఆ రేంజ్‌లో సింధూ ఒంపు సొంపులు లేకపోవడం వల్ల ఆ ఎపిసోడ్‌కు ఎక్కువ కనెక్ట్ కాలేకపోయామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే తాను ప్రాణంగా ప్రేమించే సింధూకు మధ్య చిన్న బ్రేకప్ జరగడం, అలాగే తన తండ్రి నడిపే SR కల్యాణ మండపం బాధ్యతను తన భుజాల మీద వేసుకోవడంతో కథ ఓ మలుపు తిరగడమే కాకుండా ప్రథమార్థం ముగస్తుం

   సెకండాఫ్ ఎమోషనల్‌గా

  సెకండాఫ్ ఎమోషనల్‌గా

  ఇక సెకండాఫ్‌లో SR కల్యాణమండపం బాధ్యతలను, పెళ్లి వ్యవహారాలను నిర్వహించే కల్యాణ్.. జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనవుతుంది. తన ప్రేమించే సింధుకు మరో వ్యక్తితో పెళ్లి జరగడం, అదీ తన SR కల్యాణ మండపంలోనే ఆ పెళ్లికి ఏర్పాట్లు చేయడమనేది కథలో ఆసక్తికరమైన పాయింట్‌గా మారుతుంది. తన ప్రియురాలిని పెళ్లిని ఎలా అడ్డుకొన్నాడు.. SR కల్యాణ మండపానికి మళ్లీ పూర్వవైభవం రావడానికి, తండ్రికి చేరువ అయ్యే అంశాలు సినిమాను మరింత ఎమోషనల్‌గా మారుస్తాయి. దాంతో సినిమా ఫీల్‌గుడ్ నోట్‌తో ముగుస్తుంది.

   దర్శకుడు ప్రతిభ గురించి

  దర్శకుడు ప్రతిభ గురించి

  దర్శకుడు శ్రీధర్ గాదే రాసుకొన్న పాయింట్ బాగుంది. కథగా కూడా బాగానే మలిచాడు. కానీ స్క్రీన్ ప్లే విషయంలోనే తడబాటుకు గురయ్యాడని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో రెండు సీన్లు హైలెట్ అయితే.. మరో సీన్లు నీరు గార్చే విధంగా ఉంటాయి. కథలోకి వెళ్లడానికి కాస్త ఎక్కువగానే సమయం తీసుకొన్న డైరెక్టర్ సెకండాఫ్‌లో కథపై పట్టు సాధించి సినిమాను పరుగులు పెట్టించాడనిపిస్తుంది. కిరణ్ అబ్బవరంతో చేయించిన మాస్ సీన్లు బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు గ్యారంటీగా నచ్చేలా జాగ్రత్తలు తీసుకొన్నాడని చెప్పవచ్చు. ఓవరాల్‌గా ఈ సినిమాతో దర్శకుడి మంచి మార్కులు సంపాదించుకొని ప్రమోట్ అయ్యాడనే చెప్పవచ్చు.

  నటీనటులు ఫెర్పార్మెన్స్

  నటీనటులు ఫెర్పార్మెన్స్

  SR కల్యాణమండపం చిత్రంలో కిరణ్ అబ్బవరం ఫెర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షోగా చెప్పవచ్చు. నటుడిగానే కాకుండా రచయితగా, మాటలు కూడా అందించి ఆకట్టుకొన్నారు. మాస్ సీన్లలో రెచ్చిపోయి నటించాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమాను తన భుజాలపైనే మోసాడని చెప్పవచ్చు. టాక్సీవాలా చిత్రంతో ఆకట్టుకొన్న ప్రియాంక జవాల్కర్ గ్లామర్ పరంగా ఆకట్టుకోలేకపోయింది. మంచి రొమాంటిక్ ఎలిమెంట్స్ ఉన్న పాత్రను సరిగా పోషించలేకపోయిందని చెప్పవచ్చు. కాకపోతే నటన పరంగా అక్కడక్కడా రాణించింది. ఇక సాయి కుమార్ మరోసారి ఎమోషనల్ పాత్రలో నటించారు. సెకండాఫ్‌లో సాయికుమార్ నటన హై నోట్‌లో కనిపిస్తుంది. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ఆకట్టుకొన్నారు. కిరణ్ ఫ్రెండ్స్ బ్యాచ్‌లోని వారు కామెడీ పరంగా ఆకట్టుకొలేకపోయారు.

   టెక్నికల్ డిపార్ట్‌మెంట్ పనితీరు

  టెక్నికల్ డిపార్ట్‌మెంట్ పనితీరు


  సాంకేతిక విభాగాల పని తీరుకు వస్తే.. విశ్వాస్ డేనియల్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె వాతావరణానికి సంబంధించిన సీన్లు చాలా నేచురల్‌గా కనిపిస్తాయి. ఈ సినిమాకు దర్శకుడు శ్రీధర్ గాదే స్వయంగా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అందుకే సినిమాలో అవసరం లేదనిపించే లెంగ్తీ సీన్లను వదులుకోవడానికి ఇష్టపడలేదేమో అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో మరింత క్రిస్పీగా ఉంటే కథలో ఫీల్ పెరిగి ఉండేదనిపిస్తుంది. ప్రమోద్, రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమాను రిచ్‌గా, ఫీల్‌గుడ్‌గా అందించడంలో సక్సెస్ అయ్యారు. ఉత్తమ, నాణ్యమైన నిర్మాణ విలువలు పాటించారు.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  SR కల్యాణమండపం సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. కమర్షియల్ విలువలు, కామెడీ టచ్‌, ఎమోషనల్ అంశాలతో రూపొందించిన పక్కా నేటివిటి చిత్రం. గ్రామీణ ప్రాంతంలో ఉండే ఆ మట్టివాసన నటీనటుల్లో కనిపిస్తుంది. కాకపోతే పక్కాగా స్క్రీన్ ప్లేను రాసుకోకపోవడం వల్ల కథ సాగే విధాణంలో చిన్న అసంతృప్తి అనిపిస్తుంది. థియేటర్లలో ఫుల్‌గా ఎంజాయ్ చేసే సినిమాగా SR కల్యాణమండపం రూపొందింది. వారాంతంలో ఎంజాయ్ చేయడానికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టించే తీరే ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం తేలుతుంది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  సాయి కుమార్ క్యారెక్టరైజేషన్
  తండ్రి, కొడుకుల మధ్య సన్నివేశాలు
  మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొనే డైలాగ్స్
  టెక్నికల్ అంశాలు
  కిరణ్ అబ్బవరం ఫెర్ఫార్మెన్స్

  మైనస్ పాయింట్స్

  మైనస్ పాయింట్స్

  స్క్రీన్ ప్లే
  స్లో నేరేషన్
  నటీనటులు ఎంపిక

  Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
  SR కల్యాణమండపంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  SR కల్యాణమండపంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయి కుమార్, తులసి, గంగవ్వ, అనీల్ గీలా, రాజశేఖర్ అనింగి తదితరులు
  ఎడిటింగ్, దర్శకత్వం: శ్రీధర్ గాదే
  నిర్మాతలు: ప్రమోద్, రాజు
  సినిమాటోగ్రఫి: విశ్వాస్ డేనియల్
  మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
  బ్యానర్: ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్
  రిలీజ్ డేట్: 2021-08-06

  English summary
  SR Kalyana Mandapam Movie Review And Rating: SR Kalyana Mandapam is hits the screen on August 6th. Kiran Abbavaram and Priyanka Jawalkar are lead pair. In this occassion, Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X