twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Arjuna Phalguna review.. ప్రేక్షకుడికి అర్జున.. ఫాల్గుణే.. ఏపీ సర్కారుపై సెటైర్లు అలా

    |

    Rating:
    2.0/5
    Star Cast: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, వీకే నరేష్, సుబ్బరాజు, మహేష్ ఆచంట
    Director: సుధీర్ వర్మ పీ

    నటీనటులు: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, వీకే నరేష్, సుబ్బరాజు, మహేష్ ఆచంట, దేవీ ప్రసాద్, దయానంద్ రెడ్డి తదితరులు
    కథ, దర్శకత్వం: తేజా మార్ని
    డైలాగ్స్: సుధీర్ వర్మ పీ
    నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
    మ్యూజిక్: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం
    సినిమాటోగ్రఫి: జగదీష్ చీకటి
    ఎడిటింగ్: విప్లవ్ నైషబ్దం
    స్టంట్స్: రామ్ సుంకర
    సాహిత్యం: చైతన్య ప్రసాద్

     అర్జున ఫాల్గుణ సినిమా కథ

    అర్జున ఫాల్గుణ సినిమా కథ

    గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో అర్జున్ (శ్రీవిష్ణు) తన నలుగురు స్నేహితులు (మహేష్ ఆచంట తదితరులు) ఎలాంటి పని పాట లేకుండా తిరుగుతుంటారు. శ్రావణి ( అమృత అయ్యర్)తో ప్రేమలో ఉంటాడు. అయితే కష్టాల్లో ఎవరైనా ఉంటే వారిని ఆదుకొనేందుకు అర్జున్ ఎంతకైనా తెగిస్తాడు. తన స్నేహితులకు వచ్చిన కష్టాలు తీర్చడానికి గంజాయి స్మగ్లింగ్ చేయడానికి తన స్నేహితులతో సిద్ధమవుతాడు. అరకు నుంచి గంజాయిని తీసుకొస్తుంటే ఇన్స్‌పెక్టర్ సుబ్బరాజు (సుబ్బరాజు)కు దొరికిపోతారు.

    ట్విస్టులు ఇలా..

    ట్విస్టులు ఇలా..

    చట్ట వ్యతిరేకమైన గంజాయి దందాలోకి ఏ పరిస్థితుల్లో అర్జున్ అడుగుపెట్టాడు? తన స్నేహితుడికి వచ్చిన కష్టం ఏమిటి? గంజాయి బస్తాను తరలించే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? గంజాయి బస్తా కోసం సీఐ సుబ్బారాజు ఎందుకు వెతుకుతున్నాడు? గంజాయి బస్తాలో ఉన్న ట్విస్ట్ ఏమిటి? గంజాయి బస్తా అర్జున్, తన స్నేహితులను కష్టాలను నుంచి ఎలా గట్టెక్కించింది? అనే ప్రశ్నలకు సమాధానమే అర్జున ఫాల్గుణ సినిమా కథ.

     అర్జున ఫాల్గుణ ఎలా ఉందంటే..

    అర్జున ఫాల్గుణ ఎలా ఉందంటే..

    వినోదం, కమర్షియల్, ఎమోషనల్ అంశాలను కలిపి సినిమాను ఫీల్‌గుడ్ నోట్‌లోనే ప్రారంభించారనే ఫీలింగ్.. కాసేపట్లోనే కనుమరుగుతుంది. పేలవమైన సన్నివేశాలు, దారి తప్పిన కథతో సినిమా గందరగోళంగా సాగుతుంది. ఎన్టీఆర్ అభిమానులమని చెప్పుకొంటూ.. ఆది, సింహాద్రి, రాఖీ, యమ దొంగ, ఊరు పాకిస్థాన్ అంటూ చెప్పుకొనే అంశాలు ఆకట్టుకొంటాయి. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ వాలంటీర్లు, మద్యం అమ్మకాలపై వేసిన సైటర్లు బాగుంటడమే కాకుండా మంచి వినోదాన్ని పండిస్తాయి. సినిమాటోగ్రఫి, డైలాగ్స్ తప్పా మిగిత అంశాలన్నీ నాసిరకంగా ఉండటంతో సినిమా ఆద్యంతం బోర్‌గా సాగుతుంది. అర్జున ఫాల్గుణ చిత్రంలో కథ, కథనాలు పేలవంగా ఉండటంతో సెకండాఫ్ మరీ దారుణంగా అనిపిస్తుంది. పొంతన లేని సీన్లు, అర్ధపర్థం లేని ట్విస్టులతో కథ ఏ లక్ష్యం దిశగా సాగుతుందనే విషయం మరింత కంగాళీగా మారుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకైన దర్శకుడు ఏదైనా మ్యాజిక్ చేస్తారా అని ఎదురు చూసిన వారికి నిరాశే మిగులుతుంది.

     నటీనటులు ప్రతిభా

    నటీనటులు ప్రతిభా

    శ్రీ విష్ణు తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. మంచి కథ, తన క్యారెక్టర్ బలంగా లేకపోవడంతో అర్జున్ పాత్ర తేలిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే తన పాత్రతో శ్రీ విష్ణు బెటర్ చేయడానికి ప్రయత్నించినప్పటికి.. కథలో సరుకు లేకపోవడంతో ఆయన శ్రమ వృధాగా మారిందిని చెప్పవచ్చు. శ్రావణిగా అమృత అయ్యర్ కూడా ఆకట్టుకొలేకపోయింది. జబర్దస్త్ మహేష్, తదితరులు తమదైన కామెడీతో కాస్త రిలీఫ్ అనిపిస్తుంది.

    దర్శకుడు, సాంకేతిక అంశాల గురించి

    దర్శకుడు, సాంకేతిక అంశాల గురించి

    జోహర్ సినిమాతో టాలీవుడ్ ప్రయాణాన్ని ఆరంభించిన తేజా మార్ని తొలి చిత్రంతో మంచి ప్రశంసలు అందుకొన్నారు. జోహర్ తర్వాత అర్జున ఫాల్గుణ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన తొలి సినిమాలో పక్కాగా
    కథ, స్క్రీన్ ప్లే రాసుకొన్న ఆయన తన రెండో సినిమా అర్జున ఫాల్గుణ విషయంలో భారీ నిరాశను ప్రేక్షకులకు కలిగించాడు. ఓవరాల్‌గా సినిమా అతుకుల బొంతగా కనిపిస్తుంది. సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. సినిమాటోగ్రఫి తప్పా.. అన్ని విభాగాలు పేలవంగా కనిపించాయి. ప్రేక్షకుడిని మెప్పించే అంశాలు వెతికినా దొరకవనే చెప్పవచ్చు.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    సమాజాన్ని ఆలోచింపజేసే మంచి పాయింట్లు అర్జున ఫాల్గుణ చిత్రంలో కనిపిస్తాయి. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే యువత చెడుదారులు ఎలా పడుతారో అనే పాయింట్ అంతర్లీనంగా కనిపిస్తాయి. కానీ పూర్తిస్థాయిలో కథను మలచకపోలేకపోవడం ఈ సినిమా అతిపెద్ద మైనస్. సుధీర్ వర్మ డైలాగ్స్ పేలకపోతే సినిమా మరింత దారుణంగా ఉండేదనిపిస్తుంది. మంచి నటీనటులు ఉన్నప్పటికీ వారి పాత్రల్లో ఏ మాత్రం దమ్ము కనిపించదు. ఇక టికెట్ రేటు కూడా ప్రేక్షకుడి జేబుకు బొక్క పడేలా ఉండటం కారణంగా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు కూడా ఆశించడం తప్పే కాదు.. అత్యాశ కూడా అవుతుంది.

    Recommended Video

    Arjuna Veta Movie Launch | Madhu Sai Vamshi | Sravani | Himabindhu || Filmibeat Telugu
     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    కొన్ని కామెడీ సీన్లు
    డైలాగ్స్
    సినిమాటోగ్రఫి

    మైనస్ పాయింట్స్
    స్క్రీన్ ప్లే
    లాజిక్ లేని కథ
    రీరికార్డింగ్

    English summary
    Sree Vishnu's Arjuna Phalguna movie released on December 31st. Directed by Teja Marni. Produced By Niranjan Reddy. In this occassion, Telugu filmibeat brings review and rating.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X