#Single Twitter Review : శ్రీవిష్ణు సింగిల్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఏంటంటే?

శ్రీవిష్ణు తాజాగా నటించిన చిత్రం Sree vishnu Single. కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో అలరించే ఈ యంగ్ హీరో ఈసారి కూడా అదే జోనర్ లో మరింత కామెడీ డోస్ పెంచి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మే9న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల అవుతుంది. కాగా ఇప్పటికే 'సింగిల్' మూవీ యూఎస్ఏలో ప్రీమియర్స్ పడింది. మూవీ చూసిన ప్రేక్షకుల స్పందన ఎలా ఉందని, శ్రీవిష్ణు సినిమా హిట్ అని చెబుతున్నారా? ఫట్ అని చెబుతున్నారనే అనే వివరాల్లోకి వెళితే..

ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, కల్యా ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. విద్య కొప్పినిడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరించారు. శ్రీవిష్ణు హీరోగా నటించగా.. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా మెరిశారు. కార్తీక్ రాజు కథ, దర్శకత్వం వహించారు. ఆర్ వెల్రాజ్ సినిమాటోగ్రఫీని అందించారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా బాధ్యత వహించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా, ఫన్ ఫిల్డ్ సినిమాగా రూపుదిద్దుకుంది. ఈ సినిమా విడుదల కాబోతున్న సమయంలో ప్రీమియర్స్ టాక్ ఆసక్తికరంగా మారింది.

Sree vishnu Single Movie Twitter Review in Telugu

శ్రీవిష్ణు Sree vishnu Singleతో కడుపుబ్బా నవ్వించడం మాత్రం గ్యారంటీ అంటున్నారు. ప్రథమార్థంలో శ్రీవిష్ణు భయంకరమైన కామెడీని డెలివరీ చేశారని ప్రీమియర్స్ చూసిన ఆడియెన్స్ ట్విట్టర్ వేదికన తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతోనే నిండిపోయిందని, శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కామిక్ టైమింగ్ కు థియేటర్ మొత్తం కడుపుబ్బా నవ్వుకుంటుందని ప్రీమియర్స్ ఆడియెన్స్ చెబుతున్నారు.

లాజిక్ లతో సంబంధం లేకుండా ఈసినిమాను చూడాలని, కేవలం ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ లోనూ కామెడీతో పాటు ఎమోషన్, రొమాంటిక్ సీన్లు అదిరిపోతాయని చెబుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో పేలిన కామెడీ, వైరల్ మూమెంట్స్ ను ఫ్రెష్ కంటెంట్ తో శ్రీవిష్ణు వెండితెరపై రీ క్రియేట్ చేశారని చెబుతున్నారు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఆడియెన్స్ కు అన్ లిమిటెడ్ ఫన్ గ్యారంటీ అని ట్విటర్ లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫన్ కు మాత్రం కొదవ లేదని, డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయని ఆడియెన్స్ ను చెబుతున్నారు. రెప్పపాటు వేగంతోనే కామెడీ సీన్లు మారుతూనే ఉంటాయని, ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ పక్కా అని అంటున్నారు. ఇదే సమయంలో కాస్తా నెగెటివ్ ఫీడ్ కూడా వస్తోంది. సెకండ్ హాఫ్ ను దర్శకుడు హ్యాండిల్ చేయడంలో తడబడ్డాడని అంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లను డీల్ చేయడంలో స్క్రీన్ ప్లే బాలేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవని, ముఖ్యంగా భావోద్వేగ భరితమైన సన్నివేశాలను అంత ఆకట్టుకునేలా ఉండవని చెప్పుకొచ్చారు. అలాగే మ్యూజిక్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిందని అంటున్నారు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాకు వెళ్లిన వారికి లాజిక్ లతో సంబంధం లేకుండా అన్ లిమిటెడ్ ఫన్ అందిస్తారనేది స్పష్టం అవుతోంది.

శ్రీవిష్ణు సింగిల్ చిత్రానికి యూఎస్ఏలో మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఓపెనింగ్సే 50 వేల డాలర్లను వసూళ్లు చేసిందని ఇప్పటికే మేకర్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో సినిమా టాక్ తెలుగు స్టేట్స్ లో ఎలా ఉంటుందనే ఆసక్తికరంగా మారింది. 2 గంటల 9 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రివ్యూలను అందుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

More from Filmibeat

Read more about: sree vishnu movie reviews single
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X