twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీకారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    3.0/5
    Star Cast: శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, రావు రమేష్, ఆమని, నరేష్, సాయి కుమార్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి తదితరులు
    Director: కిషోర్ బీ

    నటీనటులు: శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, రావు రమేష్, ఆమని, నరేష్, సాయి కుమార్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి తదితరులు
    కథ, దర్శకత్వం: కిషోర్ బీ
    నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
    సంగీతం: మిక్కీ జే మేయర్
    డీవోపీ: జే జయరాజ్
    ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
    డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
    ఆర్ట్: అవినాష్ కోళ్ల
    బ్యానర్: 14 రీల్స్ బ్యానర్
    రిలీజ్ డేట్: 2021-03-11

    శ్రీకారం కథ

    శ్రీకారం కథ

    తిరుపతి ప్రాంతానికి చెందిన పేద రైతు కుటుంబానికి చెందిన కార్తీక్ (శర్వానంద్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన కంపెనీలో పనిచేసే చైత్ర (ప్రియాంక అరుల్ మోహన్)తో ప్రేమలో పడుతాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా భారీ వేతనం అందుకొనే కార్తీక్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ అనూహ్యమైన నిర్ణయం తీసుకొంటాడు. అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమైన కార్తీక్ సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి రైతుగా మారాలనుకొంటాడు.

    శ్రీకారం మూవీలో ట్విస్టులు

    శ్రీకారం మూవీలో ట్విస్టులు

    సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదలి వ్యవసాయం చేయాలనే ఆలోచన కార్తీక్‌లో కలుగడానికి కారణం ఏమిటి? ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కార్తీక తల్లిదండ్రుల రియాక్షన్ ఏమిటి? కార్తీక్ తీసుకొన్న అనూహ్యమైన నిర్ణయానికి చైత్ర స్పందన ఏమిటి? జాబ్ వదలిసిన కార్తీక్‌కు సేద్యం చేసే సమయంలో ఎదురైన కష్టాలు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? కార్తీక్ తన లక్ష్యాన్ని చివరకు చేరుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే శ్రీకారం మూవీ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే

    కార్తీక్, చైత్ర లవ్ ట్రాక్‌తో రోటిన్‌గా కథ మొదలవుతుంది. తన గ్రామానికి చెందిన రైతు, బంధువు (నరేష్) కూలీగా మారిన సన్నివేశంతో కథలో ఎమోషనల్ పాయింట్ మొదలవుతుంది. ఆ భావోద్వేగాన్ని కంటిన్యూ చేస్తూ కథ మరింత ఎమోషనల్‌గా ముందుకు సాగుతుంది. వ్యవసాయం, సేద్యం వల్ల లాభాలు, ఆవశ్యకత ఏమిటో చెప్పే మంచి సన్నివేశంతో ప్రథమార్థం ముగుస్తుంది.

    సెకండాఫ్‌ గురించి

    సెకండాఫ్‌ గురించి

    ఇక సెకండాఫ్‌లో వ్యవసాయం చేసే పద్దతులు, రైతులను ఒప్పించే ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మరింత ఫీల్‌గుడ్‌గా కనిపిస్తాయి. తాతల తరంలో గొప్పగా ఉండే వ్యవసాయం తండ్రుల తరానికి వచ్చే సరికి ఎందుకు తగ్గిపోయిందనే విషయాన్ని హృదయానికి హత్తుకొనేలా సాగుతుంది. చివర్లో కరోనా పరిస్థితుల అంశాన్ని తెరపైకి తెచ్చి వ్యవసాయం ప్రాధాన్యతను కళ్లకు కట్టినట్టు దర్శకుడు చూపించడంలో సఫలమయ్యాడు.

    డైరెక్టర్ కిషోర్ బీ ప్రతిభ

    డైరెక్టర్ కిషోర్ బీ ప్రతిభ

    తొలి చిత్ర దర్శకుడిగా కిషోర్ ఓ ఫీల్‌గుడ్ పాయింట్‌తో అన్ని వర్గాలను కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. భారమైన సన్నివేశాలు, హార్ట్ టచింగ్ సీన్లు రాసుకొన్న తీరు ఆకట్టుకొంటుంది. క్లైమాక్స్‌ను డీల్ చేసిన విధానం మరీ బాగుంది. నరేష్, రావు రమేష్, ఆమని, సాయి కుమార్ రాసుకొన్న పాత్రలు సినిమాకు ప్లస్ అయ్యాయి. కాకపోతే మహర్షి, భీష్మ లాంటి సినిమాల ఛాయలు అక్కడక్కడా కనిపిస్తాయి.

    శర్వానంద్ యాక్టింగ్

    శర్వానంద్ యాక్టింగ్

    ఐటీ కంపెనీ ఉద్యోగిగా, యువ రైతుగా రెండు విభిన్నమైన కోణాలు ఉన్న కార్తీక్ పాత్రలో శర్వానంద్ మరోసారి ఒదిగిపోయాడు. పలు సన్నివేశాల్లో శర్వానంద్ పలికించిన హావభావాలు మనసును తాకుతాయి. కథకు బలంగా మారిన సన్నివేశాల్లో శర్వానంద్ నటన హైలెట్‌గా చెప్పుకోవచ్చు. పలు అంశాల మధ్య నలిగిపోయే యువకుడిగా తెర మీద బాగా రాణించాడని ఫీలింగ్ కలుగుతుంది.

    ఇతర నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    ఇతర నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    చైత్రగా ప్రియాంక అరుల్ మోహన్ అక్కడక్కడ మెరిసింది. తన పాత్రకు అంతగా స్కోప్ లేకపోయినప్పటికీ చైత్ర పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. గ్లామర్‌గాను, తనకు లభించిన సన్నివేశాల్లో తన నటనతో మెప్పించారు. రావు రమేష్, సీనియర్ నరేష్, సాయి కుమార్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సత్య కామెడీ, యాక్టింగ్ బాగుంది. మురళీ శర్మ పాత్రకు అంతగా స్కోప్ కనిపించలేదు. మిగితా పాత్రల్లో నటీనటులు వారి పరిధి మేరకు బాగా నటించారు.

    టెక్నికల్ విభాగాల పనితీరు

    టెక్నికల్ విభాగాల పనితీరు

    అత్యంత భావోద్వేగంతో కూడిన కథకు బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ మరింత ఆకర్షణీయంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. సాయి మాధవ్ తన మాటలకు పదును పెట్టడంతో పలు సన్నివేశాలు గుండెను పిండేసేలా ఉన్నాయి. యువరాజ్ జే సినిమాటోగ్రఫి బాగుంది. పచ్చని వాతావరణంతో తెరను ఆహ్లాదకరంగా మార్చారు. మార్తాండ్ వెంకటేష్ ఎడిటింగ్ పక్కా ఉండటంతో సీన్లలో ఎమోషన్ బాగా పండటమే కాకుండా కథలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసింది. మిక్కీ జే మేయర్ రీరికార్డింగ్ బాగుంది. పెంచల్‌దాస్‌తో పాడించిన పాట వత్తానంటివో.. పోతానంటివో, శ్రీకారం టైటిల్ ట్రాక్ ఫీల్‌గుడ్‌గా సాగుతాయి.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    వ్యవసాయం, రైతుల కష్టాల ఆధారంగా సాగే శ్రీకారం లాంటి కథను ఎంచుకోవడమే రామ్ ఆచంట, గోపి ఆచంట సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. 14 రీల్స్ బ్యానర్‌ ప్రమాణాలకు అనుగుణంగా శ్రీకారం చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. నటీనటుల ఎంపిక, సాంకేతిక నిపుణుల సెలక్షన్‌ ఫర్‌ఫెక్ట్‌గా ఉండటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఐటీ, ఉద్యోగాల చట్రంలో ఇరుక్కుపోయి సొంత గ్రామాలను, మట్టి మనుషులను, తల్లిదండ్రులకూ దూరం అవుతున్న యువతను తట్టిలేపే చిత్రం శ్రీకారం. సొంతూరు ప్రాధాన్యత, బంధుత్వాలు, అనుబంధాలను టచ్ చేస్తూ తీసిన సన్నివేశాలు ప్రేక్షకుడిని కదిలించేలా ఉంటాయి. రైతు దేశానికి వెన్నుముక అనే గొప్ప సందేశాన్ని యువతకు అందించే విధంగా రూపొందించారు. అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా ఈ సినిమా ఉంది. సాధారణ ప్రేక్షకులనే కాకుండా, సినీ విమర్శకులను కూడా ఆకర్షించే అంశాలు ఎన్నో ఉండటం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    కిషోర్ బీ డైరెక్షన్
    కథ, కథనాలు
    శర్వానంద్ యాక్టింగ్
    సెకండాఫ్

    మైనస్ పాయింట్స్
    ఫస్టాఫ్ కాస్త రొటీన్‌గా సాగడం
    కథలో సంక్లిష్టమైన పాయింట్ లేకపోవడం
    వ్యవసాయం భారంగా ఎందుకు మారిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడం

    English summary
    Sreekaram review: Tollywood Hero Sharwanand's Sreekaaram film directed by Kishore Reddy and produced by Ram Achanta and Gopichand Achanta under 14 Reels Plus. The film stars Sharwanand and Priyanka Arul Mohan in lead roles, and Sai Kumar in a pivotal role. The film released on 11 March 2021. In This occassion, Telugu filmibeat brings detailed review of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X