Sri Chidambaram Garu Movie Review: శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట, గోపినాథ్, శివకుమార్ మట్టా, కల్పలత గర్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరమ్, శంకర్ రావు తదితరులు
దర్శకత్వం: వినయ్ రత్నం
నిర్మాతలు: చింతా వినీతా రెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి
సహ నిర్మాత: చింతా రాజశేఖర్ రెడ్డి
సినిమాటోగ్రాఫర్‌: రామ్ పోడిశెట్టి
ఎడిటర్‌: అన్వర్ అలీ
మ్యూజిక్ డైరెక్టర్‌: చందు రవి
బ్యానర్: శ్రీ చక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్: 2026-01-06

గోదావరి జిల్లాలోని రాజమండ్రికి సమీపంలోని మారుమూల ప్రాంతానికి చెందిన సాల్మన్ (వంశీ తుమ్మల)పుట్టుకతోనే మెల్లకన్నుతో బాధపడుతుంటారు. దాంతో ఆయనను గ్రామస్థులంతా చిదంబరం అంటూ పిలుస్తూ ఎగతాళి చేస్తుంటారు. అయితే కంటి సంబంధిత వైకల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ నల్ల కళ్లజోడును ధరించి తిరుగుతుంటాడు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలే చిదంబరం తండ్రి మరణించడంతో తల్లితో కలిసి కష్టాలతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఆ పరిస్థితుల్లో లీలా (సంధ్య వశిష్ట) పరిచయమవుతుంది. లీలపై చిదంబరానికి ప్రేమ పుడుతుంది. కొన్ని కారణాల వల్ల లీల అతడి ప్రేమను రిజెక్ట్ చేస్తుంది.

Sri Chidambaram Garu Movie Review

మెల్ల కన్ను వల్ల చోటు చేసుకొన్న ఆత్మనూన్యత భావం సాల్మన్‌ను ఎలాంటి ఇబ్బందులకు గురి చేసింది? కంటి వైకల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి తంటాలు పడ్డారు. నల్ల కళ్లజోడు పెట్టుకోవడాన్ని లీలా ఎందుకు అభ్యంతరం చెప్పింది? లీలా తన ప్రేమను రిజెక్ట్ చేస్తే సాల్మన్ ఫీలింగ్స్ ఏమిటి? ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటే.. లక్ష రూపాయల అప్పు చేయాలని సాల్మన్ ఎందుకు ప్రయత్నించాడు? మెల్ల కన్ను లోపాన్ని సాల్మన్ సవరించుకొన్నాడా? చిదంబరం పేరును కాకుండా సాల్మన్ పేరుతో పిలిచేలా చేశాడా? లీలా ప్రేమను గెలుచుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే శ్రీ చిదంబరం గారు కథ.

మలయాళంలో కంటెంట్‌తో కూడిన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో అలాంటి స్పూర్తి పొంది.. బలమైన కంటెంట్‌ను, ఆర్టిస్టుల ప్రతిభను నమ్ముకొని చేసిన చిత్రమిది. సింగిల్ లైన్ స్టోరీతో ఎలాంటి వేరియేషన్స్ లేకుండా, భారీ ట్విస్టులు, టర్నులకు స్కోప్ ఇవ్వకుండా తాము నమ్మిన కథను నిజాయితీగా చెప్పడానికి చేసిన నిజాయితీగా చేసిన అటెంప్ట్‌గా ఈ సినిమా కనిపిస్తుంది. స్టార్లు లేకుండా సుమారుగా రెండున్నర గంటల కూర్చోబెట్టడమే కాకుండా ప్రేక్షకుడికి కొత్త అనుభూతి విధంగా తొలి చిత్ర దర్శకుడు వినయ్ రత్నం చేసిన ప్రయత్నం అభినందనీయం. క్యారెక్టర్లను డిజైన్ చేసిన విధానం, అలాగే కథను నడిపించిన విధానం చూస్తే డైరెక్టర్‌లో టాలెంట్ ఏమిటో స్పష్టంగా తెర మీద కనిపిస్తుంది.క్రిస్టియన్ ఫాస్టర్ల మీద సెటైర్ ఎపిసోడ్ బాగుంది. అయితే ఈ సినిమాకు ఇంకా బలమైన సన్నివేశాలు, పాత్రలను మరింత ఎఫెక్టివ్‌గా తీర్చి దిద్దడానికి స్కోప్ ఉంది. కానీ ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం దర్శకుడి వైఫల్యంగా కనిపిస్తుంది.

ఈ సినిమా భారన్నంతా వంశీ, సంధ్యలు తమ భుజాలపై మోశారు. ఆడియెన్స్‌ను మెప్పించే విధంగా తమ పాత్రల్లో జీవించారు. పాత్ర పరిధిని, స్వభావాన్ని అర్ధం చేసుకోని లైన్ దాటకుండా క్యారెక్టర్‌కు ఎంత కావాలో అంతే మొత్తంలో తమ టాలెంట్‌ను ప్రదర్శించారు. కళ్లు చిదంబరం పాత్రను స్పూర్తిగా తీసుకొని రాసిన పాత్రలో వంశీ ఒదిగిపోయి నటించాడు. ఇక తల్లి పాత్రలో పుష్ప ఫేమ్ కల్పలత భావోద్వేగమైన పాత్రలో మెప్పించారు. మిగితా వారంతా తమ పాత్రల పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు.

శ్రీ చిదంబరం గారు సినిమాకు అత్యంత బలం సాంకేతిక నిపుణుల పనితీరే అని చెప్పాలి. రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లను, గ్రామీణ వాతావరణాన్ని సజీవంగా, సహజ సిద్దంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ శ్రవణ్ ముప్పిరి సక్సెస్ అయ్యాడు. కేరళను మించిన రూరల్ బ్యూటీని తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యారు. చందు రవి బ్యాక్ గ్రౌండ్ స్కోరు సన్నివేశాలను బాగా హైలెట్ చేసింది. అన్వర్ అలీ ఎడిటింగ్ బాగుంది. ఇంకాస్త తన కత్తెరకు పదును పెట్టి ఉంటే ఇంకా ఫీల్ పెరిగి ఉండేది. శ్రీ చక్ర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వినీత, గోపాలకృష్ణారెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా ఈ మూవీ గురించి చెప్పాలంటే.. కంటెంట్ ప్రధానంగా వస్తున్న మలయాళ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా శ్రీ చిదంబరం గారు సినిమా ఉందని చెప్పవచ్చు. నేటివిటి, ప్రకృతి అందాలు, తెర మీద పాత్రల నిజాయితీ, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ వర్క్ ఈ సినిమాకు బలంగా కనిపిస్తాయి. సింగిల్ పాయింట్‌తో కథను నడిపించడం వల్ల సాగదీసి స్టోరీని చెప్పిన ఫీలింగ్ కలుగుతుంది. వైవిధ్యంతో కూడిన కంటెంట్‌ను అందించాలనే తాపత్రయం నిర్మాతలు, దర్శకుడిలో కనిపిస్తుంది. మలయాళ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అంచనాలు లేకుండా వెళితే.. సంతృప్తి కూడా దక్కుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X