Sri Chidambaram Garu First Review: శ్రీ చిదంబరం గారు ఫస్ట్ రివ్యూ
తెలుగుదనంతో మంచి కంటెంట్, రూరల్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన చిత్రం శ్రీ చిదంబరం గారు. స్టార్ వాల్యూ లేకుండా కేవలం థ, కథనాలను నమ్ముకొని ఈ సినిమాను అభిరుచి గల నిర్మాతలు చింతా వినీతా రెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, క్యూట్ లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమాకు వినయ్ రత్నం దర్శకత్వం వహించారు.
టాలెంటెడ్ ఆర్టిస్టులు వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట, గోపినాథ్, శివకుమార్ మట్టా, కల్పలత గర్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరమ్, శంకర్ రావు తదితరులు నటించారు.ఈ సినిమాకు రామ్ పోడిశెట్టి సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా, చందు రవి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించిన విశేషాలు, సెన్సార్ రివ్యూ వివరాల్లోకి వెళితే..

మెల్లకన్ను లాంటి శారీరక వైకల్యంతో బాధపడే యువకుడిని గ్రామస్థులంతా కళ్లు చిదంబరం అంటూ గేలి చేస్తుంటారు. దాంతో ప్రతీ క్షణం తన మెల్లకన్నులు కనిపించకుండా నల్ల కళ్లజోడు పెట్టుకొని ఉంటాడు. అలాంటి యువకుడిని గ్రామానికి వచ్చిన ఓ యువతితో పరిచయం జరుగుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారి ఎలాంటి పరిస్థితులను చిదంబరం జీవితంలోకి వచ్చాయి. చివరకు నల్ల కళ్లజోడును చిదంరం తీశాడా? గ్రామస్థులంతా చిదంబరం కాకుండా అసలు పేరుతో పిలవడం చేశారా? అనేది ఈ సినిమా కథ.
లోకల్ ఫ్లేవర్, రూరల్ కంటెంట్, ప్రాంతీయంగా ఉండే పచ్చదనం లాంటి అంశాలతో తెరకెక్కే మలయాళ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంది. అలా ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చిత్రం శ్రీ చిదంబరం. టైటిల్ నుంచి కంటెట్ వరకు తెలుగుదనం ఉట్టిపడేలా ఈ సినిమాను రూపొందించాం. కమర్షియల్ వాల్యూస్ కంటే కంటెంట్‌ను ప్రయారిటీ చేసి రూపొందించాం అని నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
ఇక ఈ సినిమాను ఇటీవల చూసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. నిజాయితీతో కూడిన అటెంప్ట్ చేసిన నిర్మాత, దర్శకులను ప్రశంసించారు. ఎలాంటి కట్స్, అభ్యంతరాలు లేకుండా ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రానికి ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా యూ (UA7+) సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే ఈ సినిమాను ఏడేళ్లకుపై పడిన వారంతా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమాను చూడొచ్చు అని సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ సినిమా నిడివిని 2 గంటల 13 నిమిషాలకు అంటే 133 నిమిషాలకు ఫిక్స్ చేశారు.
ఈ చిత్రంలోని కథ, కథనాలు, వంశీ తుమ్మల, సంథ్య వశిష్ట జంట మధ్య కెమిస్ట్రీ, ఎమోషన్స్ బాగా పండాయి. ఈ చిత్రం ద్వారా కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. వారు పండించిన హాస్యం చాలా క్లీన్‌గా ఉందనే టాక్ వినిపిస్తున్నది. ఈ సినిమాపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్, రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











